Tuesday, 22 September 2026

Tag: East Godavari District

తూర్పు గోదావరి

చిరు సేవా సమితి సేవా కార్యక్రమాలు అభినందనీయం

బుర్రిలంక, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): చిరు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరాలను డాక్టర్ పెదపాటి విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయడంతో పాటు, ఉచిత వైద్య సేవల ద్వారా ప్రజల ఆరోగ్యానికి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన చిరు సేవా సమితి నిర్వాహకులతో పాటు రమాదేవి హాస్పిటల్ యజమాని డాక్టర్ రమాదేవి, వైద్య సిబ్బంది, రక్తదాతలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, సేవా మార్గంలో చిరు సేవా సమితి మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

తూర్పు గోదావరి

పవన్ జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి.. బిక్కవోలులో కూటమి నేతల సందడి

శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు యాచకులకు దుస్తులు, పండ్లు పంపిణీ.. బిక్కవోలు నుంచి అనపర్తి వరకు బైక్ ర్యాలీ బిక్కవోలు, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బిక్కవోలులో కూటమి నాయకులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని కార్యక్రమాలను నిర్వహించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బిక్కవోలు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని ప్రార్థించారు. అనంతరం దేవస్థానం ఆవరణలో నాయకులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కల పెంపకాన్ని ప్రజలు తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు. బిక్కవోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం యాచకులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేసి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు ఆధ్వర్యంలో నిర్వహించిన బిక్కవోలు–అనపర్తి బైక్ ర్యాలీని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు. భారీ సంఖ్యలో జనసేన, టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకే పరిమితం కాకుండా పూజలు, మొక్కలు నాటడం, పేదలు, యాచకులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకున్నామని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, తెలుగు మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పవన్ జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి.. బిక్కవోలులో కూటమి నేతల సందడి

బిక్కవోలు: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బిక్కవోలులో కూటమి నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, జనసేన సమన్వయకర్త రావాడ నాగు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఆవరణలో మొక్కలు నాటి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. యాచకులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. బిక్కవోలు నుంచి అనపర్తి వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

బిక్కవోలు స్మశానవాటికలో మొక్కలు నాటిన టీడీపీ నాయకులు

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి బిక్కవోలు, సెప్టెంబరు 2 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు గ్రామంలోని స్మశానవాటికలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగరాపు రామారావు, గొర్రెల త్రిమూర్తులు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు సూచించారు. స్మశానవాటిక పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించి, వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.

తూర్పు గోదావరి

చిరు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం

26 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గెడ్డం శివరత్న గణపతి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 400 మందికి పైగా రక్తదానం జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు బైక్‌ ర్యాలీ రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే లక్ష్యంగా గెడ్డం శివరత్న గణపతి ఆధ్వర్యంలో చిరు సేవా సమితి గత 26 ఏళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుర్రిలంకలోని పీఎస్ఎం కళ్యాణ వేదిక వద్ద బుధవారం మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 400 మంది యువత, జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. యువజన విభాగం ఆవిష్కరణకు బైక్‌ ర్యాలీ పార్టీ ఆదేశాల మేరకు పిఠాపురంలో నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో వేమగిరి జాతీయ రహదారి నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల మీదుగా సాగిన ర్యాలీ బుర్రిలంకలో చిరు సేవా సమితి ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ తెరపై యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీక్షించారు. ఉచిత వైద్య సేవలు రక్తదాన శిబిరంతో పాటు అనపర్తి రమాదేవి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. యువత, మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 26 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చిరు సేవా సమితి గత 26 ఏళ్లుగా రక్తదానంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని సమకూర్చడంతో పాటు రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, వై. శ్రీను, రత్నం అయ్యప్ప, గట్టి నరసయ్య, పుల్లా రామారావు, నాగిరెడ్డి రామకృష్ణ, పాటంశెట్టి రవి, టీడీపీ నాయకులు డాక్టర్ గోరంట్ల రవి, రామ్ కిరణ్, యర్ర వేణుగోపాల్ రాయుడు, వెలుగు బంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, బోడపాటి గోపి, చిరు సేవా సమితి సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు, యువత, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

కాకినాడ, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకినాడలోని GRT గ్రాండ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) అమలు, రేషన్‌ సరుకుల పంపిణీ, ప్రజలకు అందుతున్న సేవలపై ఇరువురు చర్చించారు. పీడీఎస్‌ ద్వారా సీమరైస్‌ పంపిణీతో పాటు రేషన్‌ దుకాణాల్లో ‘మీ మార్ట్‌’ ఏర్పాటు వంటి అంశాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

తూర్పు గోదావరి

ఎమ్మెల్యే నల్లమిల్లి విజ్ఞప్తికి స్పందించిన ఎన్నికల కమిషన్

బిక్కవోలు, సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి): SIR రెండో దశలో క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు గడువును పొడిగించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ఇటీవల ఎన్నికల కమిషన్‌కు చేసిన విజ్ఞప్తికి స్పందన లభించింది. ఆయన విజ్ఞప్తి మేరకు SIR రెండో దశ క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఎన్నికల కమిషన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ సెప్టెంబర్ 10 వరకు అవకాశం కల్పించింది. ఈ గడువు పొడిగింపుతో ఓటర్ల జాబితాకు సంబంధించి అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసేందుకు ప్రజలకు మరో అవకాశం లభించిందని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. ముఖ్యంగా అర్హత లేని ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు, అర్హులైన వారి పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోతే వాటికి సంబంధించి అవసరమైన క్లెయిమ్స్ దాఖలు చేసుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా అవసరమైన సందర్భాల్లో ఫారం–7 దాఖలు చేసేందుకు కూడా గడువు పొడిగింపు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితా పరిశీలనలో కూటమి నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే నల్లమిల్లి సూచించారు.

తూర్పు గోదావరి

రామవరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర

అమ్మవారిని దర్శించుకుని గరగ ఎత్తుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామవరం, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరంలో శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గరగ ఎత్తుకుని జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వితంతువులు, డయాలసిస్ రోగికి పింఛన్లు అందజేసిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి

రంగంపేట, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లను లబ్ధిదారులకు అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి అందజేశారు. అదే కార్యక్రమంలో భాగంగా రంగంపేటలో డయాలసిస్ రోగికి పింఛన్ అందించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సామాజిక భద్రత పింఛన్ల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

13 మంది వితంతువులకు నూతనంగా పెన్షన్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి పెడపర్తి, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండలానికి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను 13 మంది లబ్ధిదారులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. పెడపర్తి పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, కూటమి నాయకులను కోరారు. ఈ నెలలో నూతనంగా మంజూరయ్యే పెన్షన్లకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించి, అర్హులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.