Tuesday, 22 September 2026

Tag: East Godavari District

తూర్పు గోదావరి

గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా ఘన నివాళులు

రామవరం, ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి): తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ప్రముఖ భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరంలో ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు కూడా గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషను ప్రజల నిత్య వ్యవహారంలోకి తీసుకురావడంతో పాటు, సరళమైన వ్యవహారిక భాషకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, రామవరం గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తి అభివృద్ధికి రూ.39.40 కోట్ల నిధులు

రోడ్లు, బ్రిడ్జి, విద్యుత్ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భారీగా నిధులు అనపర్తి, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.39.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో మరికొన్ని పనులకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. రామవరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. తొస్సిపూడి–కొంకుదురు రహదారికి రూ.2 కోట్లు, వడిశలేరు–తూర్పుగొనగూడెం బీటీ రోడ్డుకు రూ.2 కోట్లు, దుప్పలపూడి–కొత్తూరు రహదారికి రూ.70 లక్షలు, పులగుర్త రహదారి పనుల కొనసాగింపునకు రూ.35 లక్షలు మంజూరయ్యాయని వివరించారు. సోమేశ్వరం–రాజానగరం రహదారికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని, వాస్తవానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, మిగిలిన రూ.5 కోట్లు కూడా మంజూరు చేయాలని కోరుతున్నామని చెప్పారు. బలభద్రపురం–అనపర్తి కెనాల్ రోడ్డుకు రూ.5 కోట్లు, అనపర్తి–రాజమండ్రి రహదారి అభివృద్ధికి రూ.6.30 కోట్లు మంజూరవుతున్నాయని తెలిపారు. బలభద్రపురంలోని పాత బ్రిడ్జి అభివృద్ధికి రూ.2.50 కోట్ల నిధులు త్వరలో మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. అనపర్తిలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో రూ.4.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో విద్యుత్ లోడ్‌ సమస్యలు తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు. అనపర్తి–పెడపర్తి రేవు రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 80 శాతం బీటీ రోడ్లు అభివృద్ధి చేశామని, మిగిలిన రోడ్లతో పాటు పుంత రోడ్లను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఒడిశాలో మన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి

అనపర్తి, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): ఒడిశాలో వరి సాగు చేస్తున్న అనపర్తి నియోజకవర్గానికి చెందిన రైతుల ధాన్యాన్ని అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల క్రితం రైతులు తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సమస్యను రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకువెళ్లారు. రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరంలోని ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో జరిగిన సమావేశంలో ఒడిశాలో ఉన్న అనపర్తి నియోజకవర్గ రైతుల ధాన్యం కొనుగోలు సమస్యపై చర్చించారు. సమస్యను ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి శ్రీ పృథ్వీరాజ్ హరిచందన్, ఒడిశా రాష్ట్ర సివిల్ సప్లయిస్ మంత్రి శ్రీ కృష్ణ చంద్ర పాత్ర దృష్టికి ఎంపీ పురందేశ్వరి తీసుకువెళ్లారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా, వారి సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సెప్టెంబర్ 3న గవర్నర్‌తో రైతుల సమావేశం అనపర్తి నియోజకవర్గానికి చెందిన ఒడిశా రైతుల సమస్యను నేరుగా తెలుసుకునేందుకు సెప్టెంబర్ 3వ తేదీన రైతులను కలిసేందుకు ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ఒడిశాలో ఉన్న అనపర్తి నియోజకవర్గ రైతులు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి శ్రీ పృథ్వీరాజ్ హరిచందన్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ మంత్రి శ్రీ కృష్ణ చంద్ర పాత్రను కలిసి తమ ధాన్యం కొనుగోలు సమస్యను వివరించాలని సూచించారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్న రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఒడిశాలోని అనపర్తి నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పురందేశ్వరి, నల్లమిల్లి, సోము

రాజమహేంద్రవరం, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై నాయకులు చర్చించారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరంలో ఘనంగా “మన ఊరు – మన జెండా”

రాజమహేంద్రవరం, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్‌లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. క్వారీ మార్కెట్ సెంటర్‌లో నూతనంగా నిర్మించిన బీజేపీ జెండా స్తూపం వద్ద బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పురందేశ్వరిని సత్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

రాజమహేంద్రవరం, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరిని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనపర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అభినందనలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన పిల్లమార్రి మురళీకృష్ణ, కురగంటి సతీష్‌లను కూడా ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి మరింత సేవలందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

తూర్పు గోదావరి

సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి, మనోజ్‌రెడ్డి

అమరావతి, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నల్లమిల్లి మనోజ్‌రెడ్డి నియమితులైన సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి సోమవారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజమౌళి ఐఏఎస్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఐఏఎస్‌, ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఐఏఎస్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మనోజ్‌రెడ్డికి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలు లభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై పరస్పరం చర్చించినట్లు తెలిపారు. ఈ భేటీలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

తూర్పు గోదావరి

SIR సెకండ్ ఫేజ్ గడువు మరో పది రోజులు పెంచాలి ఫార్మ్-6, ఫార్మ్-7 సమర్పణకు అదనపు అవకాశం కల్పించాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి

వెలగపూడి, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): SIR (Special Intensive Revision) సెకండ్ ఫేజ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఫార్మ్-6, ఫార్మ్-7 సమర్పణకు మరో పది రోజుల గడువు పెంచాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ నెల 31తో సెకండ్ ఫేజ్ గడువు ముగియనున్న నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. ఓటర్లకు ఫార్మ్-6, ఫార్మ్-7 దరఖాస్తులు సమర్పించేందుకు తగినంత సమయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గడువును మరో పది రోజులు పొడిగించాలని కోరారు. అలాగే ఒక ప్రాంతంలో నివాసం ఉంటూ మరో ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న వారి ఓట్లపై కూడా సమగ్రంగా పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్‌కు అందజేసిన వినతిపత్రంలో కోరారు. ఆరు నెలలుగా నివాసం లేని ప్రాంతంలో ఉన్న ఓటును తొలగించి, ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన ఓటును ఎన్నికల అధికారులు తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇదే తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ వాస్తవ నివాస పరిస్థితులను పరిశీలించి అనర్హమైన లేదా డూప్లికేట్ ఓట్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఎరువుల సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు త్వరలోనే రైతుల ఇబ్బందులు తొలగిస్తాం: ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): ఎరువుల సరఫరా, బుకింగ్‌ విధానంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఎరువుల సరఫరా యాప్‌లలో రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఓటీపీ విధానం, ఎరువులను విడతల వారీగా పొందడం, డీఏపీ, యూరియా కేటాయింపులు, బుకింగ్‌ పరిమితుల కారణంగా రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. ఈ సమస్యలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తనను కలిసి వివరాలు సేకరించారని, వాటిని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలపై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం సచివాలయంలో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు మెట్ట ప్రాంతాల్లోని చెరువులను నింపేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రబీ సీజన్‌లో పంటలతో పాటు తాగునీరు, పశువుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. పంట రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. సాగు ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేందుకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

SIR ప్రక్రియపై కుతుకులూరులో సమీక్ష BLA-2లు, ముఖ్య నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే నల్లమిల్లి

కుతుకులూరు, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): SIR ప్రక్రియ రెండో దశ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కుతుకులూరులో శనివారం BLA-2లు, ముఖ్య నాయకులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో SIR ప్రక్రియ పురోగతిపై ఎమ్మెల్యే నల్లమిల్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండో దశలో చేపట్టిన కార్యక్రమాల ప్రస్తుత స్థితిగతులు, గ్రామాల వారీగా ఎదురవుతున్న సమస్యలు, పూర్తి చేయాల్సిన పనులపై నాయకులు, BLA-2లతో చర్చించారు. SIR ప్రక్రియకు సంబంధించి కార్యకర్తలకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి వాటిపై వివరణ ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు. తుది దశలో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డోర్‌టు డోర్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసిన గ్రామాల నాయకులను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి వేదికపైకి పిలిచి అభినందించారు. సమావేశంలో BLA-2లు, గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.