Sunday, 12 July 2026

Blog

యాదాద్రి భువనగిరి

దేదీప్యలో ఘనంగా రాఖీ పండుగ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) స్థానిక దేదీప్య హైస్కూల్లో సుమారుగా 400 మంది విద్యార్థులతో HAPPY రాఖీ అనే అక్షరమాలను కూర్చారు రాఖీ పండుగ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు రాఖీలు కట్టించి పాఠశాలలో రాఖీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శేషగిరిరావు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల బంధం ఈ రాఖీ పండుగ అని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషగిరి రావు, డైరెక్టర్ రంగారావు,రూప,రమ్య, శంకర్, వీరు భబిత, నరేష్,వేణు హేమలత, అనీషా, భార్గవి ,ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

నవ వధూవరులను ఆశీర్వదించిన POC కొట్టే వెంకటేశ్వర్లు!!

ఉదయగిరి:(ఆగస్టు,పున్నమి,ప్రతినిధి): ఉదయగిరి మండల ప్రధాన కార్యదర్శి కేశవ నారాయణను కలిసి నవ వధూవరులను ఆశీర్వదించి పెళ్లి కానుకగా వస్త్రములను అందచేసారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, ఉదయగిరి మండల ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, వరికుంటపాడు మండల అధ్యక్షులు రసూల్, జనసైనికులు సుంకే మల్లికార్జున, సుంకే వెంకట్,సుంకే నరేంద్ర పాల్గొన్నారు.

E-పేపర్

మూసి నది పరవళ్లు

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం. మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం –645 అడుగులు (4.46 టి ఎం సి. లు) ప్రస్తుత నీటిమట్టం –643 అడుగులు, (4.02 టి ఎంసి లు) ఇన్ ఫ్లో –4136.66 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- -4734. 99క్యూసెక్కులు నాలుగు గేట్ల ద్వారా రెండు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న మూసి ప్రాజెక్టు అధికారులు. కావున దిగువ ప్రాంత ప్రజలు జాగ్రత్త గా ఉండాలని నీటిలోకి దిగకూడదని అధికారులు తెలియజేస్తున్నారు.

అన్నమయ్య

తురక వివాహ రిసెప్షన్ హాజరై ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

ఓబులవారిపల్లి ఆగస్టు,( పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా,ఓబులవారిపల్లె మండలం, రాళ్ళచెరువుపల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీమతి తురక రాధిక & శ్రీ తురక గోపాల్ రెడ్డి గార్ల పుత్రుడు సాయితేజ రెడ్డి మరియు తనూజ వివాహ రిసెప్షన్ రైల్వే కోడూరు,యం.జి. రోడ్డు లోని రాజ్ కన్వెన్షన్ నందు నిర్వహించబడింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు,రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లొ ఎన్డీఏ నాయుకులు పాల్కొన్నారు.

అన్నమయ్య

శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం .. ముఖ్య అతిథులుగా ముక్క సాయి వికాస్ రెడ్డి

ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లొ NDA కుటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, పాల్కొన్నారు.

అన్నమయ్య

శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం .. ముఖ్య అతిథులుగా ముక్క సాయి వికాస్ రెడ్డి

ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లొ NDA కుటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, పాల్కొన్నారు.

అన్నమయ్య

బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ

ఓబులువారిపల్లి మండలంలోని బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శుభారంభం పలికారు.బలిరెడ్డి పల్లి గ్రామానికి సిమెంట్ రోడ్ ద్వారా శాశ్వత సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి” అని తెలిపారు.గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమయానికి అందించేందుకు కృషి చేస్తాము”అని తెలిపారు.అనంతరం తిరుపతి హాస్పటల్ లొ బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందిన గజ్జల రమణ రెడ్డి గారిని ఈరోజు వారి నివాసంలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,కార్యకర్తలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పోలీస్ లకు రాఖీ కట్టిన మహిళా మోర్చా నాయకులు

నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభాషిని ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. సీఐ రోశయ్యతో పాటు సిబ్బందికి వారు రాఖీలు కట్టి స్వీట్ అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న పోలీసులకు రాఖీ కట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆడపడుచులకు పోలీసులు సోదరులు లాగా రక్షణగా ఉంటున్నారని వారు కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్

రాజరాజేశ్వరి ఆలయంలో భక్తులకు తాంబూలాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ):వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 1,116 మంది మహిళా భక్తులకు తాంబూలాలు అందజేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే ఆమె ఆకాంక్షించారు.

అన్నమయ్య

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజలు

హిందువులు భక్తిశ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం పూజలు మండలంలోని అన్ని గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రావణమాసంలో రెండో శుక్రవారం కావడంతో రక్షాబంధన్ కు ముందు రోజు కలసి రావడంతో హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు శక్తి కొలది ధనము, పిండి వంటలు, వివిధ రకాల పూలు పండ్లు వరలక్ష్మి దేవికి సమర్పించి ప్రతి ఇల్లు భక్తి భావంతో వెల్లివిరిసింది. సంపద సంతోషం అదృష్టం కలయికే వరలక్ష్మీ వ్రతం చేయడంలో పరమార్థంగా భావించి శక్తి కొలది ప్రతి హిందువు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరిగింది. చిట్వేల్ మండల కేంద్రంలోని శివాలయం, అమ్మవారి శాల, శ్యామలాంబిక అమ్మవారి గుడి లో కూడా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం జరిగింది. ఆలయ అర్చకులు నాగ పవన్ శర్మ, సురేంద్ర శర్మ, దేవా స్వామి, ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఈ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండలం చుట్టుపక్కల గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.