శ్రీ కాళహస్తి, జులై 12, (పున్నమి న్యూస్): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లకు ఆదివారం ఎస్.వి.ఏ. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 14 మంది జూనియర్ అధ్యాపకులు వివిధ కళాశాలల నుండి ఎంపికై డిగ్రీ లెక్చరర్లుగా ప్రమోషన్ పొందారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వాణిశ్రీ, జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి, సంఘ సభ్యుడు కిషోర్, సీనియర్ ప్రిన్సిపల్ పద్మావతి, భారతి, డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు, చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా పదోన్నతి