శ్రీ కాళహస్తి, జులై 12, (పున్నమి న్యూస్): ముచ్చివోలు గ్రామంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్, చిత్తూరు-తిరుపతి జిల్లా అధ్యక్షుడు డా. పసుపులేటి హరిప్రసాద్‌కు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకుడు దండి నరేంద్ర తెలిపారు. ఈ సమావేశానికి సీనియర్ నాయకులు, జనసైనికులు హాజరై పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే ఎన్‌డీఏ కూటమి స్పూర్తిని కాపాడుతూ ముందుకు సాగాల్సిన దిశగా విలువైన మార్గదర్శకత్వం అందించారు. జనసైనికులతో ఆత్మీయంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుని, పార్టీ అభివృద్ధికి అవసరమైన పలు కీలక సూచనలు చేశారు. దండి నరేంద్ర నాయకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా సాగుతున్న తీరును అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉధృతంగా చేసి జనసేన అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మొత్తం సమావేశం స్ఫూర్తిదాయకంగా, ఫలవంతంగా సాగి నాయకులు, జనసైనికుల్లో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నింపింది.


