Sunday, 12 July 2026
  • Home  
  • ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాలో నారా బ్రాహ్మణి- బొజ్జల రిషితా రెడ్డి
- తిరుపతి

ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాలో నారా బ్రాహ్మణి- బొజ్జల రిషితా రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 12, (పున్నమి న్యూస్): ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ 2026 సంవత్సరానికి గాను విడుదల చేసిన “ప్రపంచంలోని వంద మంది అత్యంత శక్తివంతమైన మహిళలు” జాబితాలో హెరిటేజ్ సంస్థ కార్యనిర్వాహకురాలు నారా బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం పట్ల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. శనివారం పాత్రికేయులకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, వ్యాపార రంగంలో నారా బ్రాహ్మణి చూపుతున్న సమర్థ నాయకత్వం, కష్టం, నిబద్ధత మరియు ప్రజాసేవకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కొనియాడారు. వివిధ దేశాల నుండి కేవలం భారతదేశం తరఫున నారా బ్రాహ్మణి ఒక్కరే ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం తెలుగు రాష్ట్రానికే కాకుండా యావత్ దేశ మహిళా లోకానికి గర్వకారణమని రిషితా రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక, సాంకేతిక, వైద్య, ఇంధన రంగాలలో ప్రభావం చూపుతున్న మహిళలతో ఈ పత్రిక 29వ సారి విడుదల చేసిన జాబితాలో 94 సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు ఉన్నారు. వీరంతా కలిపి దాదాపు 1.11 కోట్ల మంది ఉద్యోగులు, 7.3 లక్షల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న దిగ్గజ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆమె వివరించారు. ఎందరో ఆడపిల్లలకు, యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నారా బ్రాహ్మణి భవిష్యత్తులో మరిన్ని అరుదైన గుర్తింపులు సాధించి దేశానికి సేవలు అందించాలని బొజ్జల రిషితా రెడ్డి ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.