శ్రీ కాళహస్తి, జులై 12, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కాశీవిశ్వరస్వామి ఆలయంలో ప్రదోష పూజలు భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ప్రదోషం సందర్భంగా ఆలయ వేదపండితులు శాస్త్రోక్త విధానంలో శ్రీ నందీశ్వరస్వామివారికి, శ్రీ కాశీవిశ్వరస్వామివారికి ఏకకాలంలో ప్రత్యేక ప్రదోష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పవిత్ర అభిషేకాలు నిర్వహించి, అనంతరం అమ్మవారితో పాటు ప్రదోష నందీశ్వరస్వామివారిని వివిధ రకాల సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ధూప, దీప, నైవేద్య సమర్పణలతో పాటు మహాదీపారాధనను ఘనంగా నిర్వహించారు. ఈ విశిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి దివ్య ఆశీర్వాదాలను పొందుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

శ్రీ కాశీవిశ్వరస్వామి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు