Sunday, 12 July 2026

Blog

E-పేపర్

ఒంటిమిట్టలో మంత్రుల ప్రచారం

కడప జిల్లా: ఒంటిమిట్ట మండల ఉప జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా  రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుల ప్రచారం … ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం… పెద్ద సంఖ్యలో పాల్గొన్న టిడిపి శ్రేణులు… *ప్రత్తిపాటి పుల్లారావు* ఒంటిమిట్టలో జడ్పిటిసి గెలుపు నల్లేరు మీద నడకే… మంచిమెజారిటీతోగెలవబోతున్నాము… మా టార్గెట్ పులివెందుల గెలుపు…. అక్కడి ప్రజల్లో మార్పు మొదలైంది….

E-పేపర్

అనుమతిలేని లేని అక్రమ నిర్మాణాల కూల్చివేత

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి) : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురంలో మూడు ఆసుపత్రి భవనాలను అనుమతించిన దానికంటే అదనపు అంతస్తులు నిర్మించారు. ఈ మూడు భవనాలపై ఫిర్యాదులు రావడంతో కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టి కూల్చివేత ప్రారంభించారు. మూడు భవనాలపై అదనపు అంతస్తులను గత నాలుగు రోజులుగా కూల్చి వేస్తున్నారు. శుక్రవారం కూడా కూల్చివేత పనులు కొనసాగాయి. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని టీపీఓ తెలిపారు.

తూర్పు గోదావరి

జనసేన సభ్యత్వ చెట్లు పంపిణీ దొండపూడి

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో గోపాలపురం జనసేన మండల ప్రెసిడెంట్ పోల్నాటి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణ రాజు గారు పాల్గొని క్రియాశీల సభ్యత్వాలు చేయించుకున్న సభ్యులకు స్వయంగా వారికి అందజేయడం జరిగినది. అనంతరం జరిగిన సమావేశంలో క్రియాశీల సభ్యత్వం యొక్క ఆవశ్యకత దాని ఉపయోగాలు దొండపూడి సాగిపాడు గ్రామ జనసేన కార్యకర్తలకు ప్రజలకు వీర మహిళలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గోపాలపురం మండలం జనసేన గ్రామ అధ్యక్షులు మరియు కార్యకర్తలు మరియు జనసేన సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగినది. , గోపాలపురం మండల ప్రెసిడెంట్ కార్యక్రమానికి సహకరించిన జనసేన గ్రామ అధ్యక్షులకు మరియు కార్యకర్తలు దొండపూడి గ్రామ అధ్యక్షుడు బద్రి కడియం శ్రీను మద్దాల సన్నారై కొవ్వూరుపాడు గ్రామం రామ్ భీముల జేసుడు ఉమా అధ్యక్షుడు నరేంద్ర నూతనంగా ఎన్నికైన రాజంపాలెం అధ్యక్షుడు వెంకటేష్ రాజింపాలెం గ్రామ జనసేన సైనికులు వీర మహిళలు పోతిన గణపతి చిలక నాగేశ్వరావు గోపాలపురం మండల కార్యకర్తలు నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల మండల వ్యాప్తంగా రాఖీ పండగ సందడి

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రాఖీ పండుగ సందర్భంగా చేజర్ల మరియు మండలంలోని ఆదురుపల్లి గ్రామంలో కొనుగోలుదారులుతో వ్యాపారం జోరుగా సాగుతోంది.గ్రామంలోని రాఖీ దుకాణాలు మరియు స్వీటు దుకాణాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రకాల రకాల రాఖీలను కొనుగోలు చేస్తున్నారు.ఐదు రూపాయల నుంచి రూ.200 వరకు వివిధ ధరల్లో,ఆకర్షణీయమైన డిజైన్లలో రాఖీలు లభ్యమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పండుగను పురస్కరించుకొని సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా రాఖీ సందడి నెలకొంది.

చిత్తూరు

కరెన్సీ నోట్లతో సత్య గంగమ్మ అమ్మవారికి అలంకరణ

పలమనేరులో కొలువై ఉన్న సత్య గంగమ్మ అమ్మవారిని శుక్రవారం కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం కావడంతో ధనలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 6 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది. 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు. అంతేకాదు ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు. రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లు చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. కరెన్సీ నోట్లతో అలంకార శోభితమైన అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. కోర్కెలు నెరవేర్చాలని, ప్రజలను చల్లగా చూడాలని కరెన్సీ నోట్లతో అలంకరణ చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

P-4లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి): సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి నిరుపేద కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P-4 ప్రోగ్రాం నిర్వహిస్తోందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. P-4 ఉద్దేశాన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరికీ వివరించాలనే లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వ లక్ష్యంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

నిర్మల్

సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సొన్, మామడ, లక్ష్మణచందా, సారంగాపూర్, దిలవార్ పూర్, నర్సాపూర్ మండలాలకు చెందిన 153 మంది లబ్ధిదారులకు రూ. 37,30,500/- (ముప్పై ఏడు లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలు) చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వినుతకోటకి బెయిల్ మంజూరు చేసిన చెన్నై కోర్ట్

శ్రీకాళహస్తి జనసేన బహిష్క్రుత నేత వినుతకోట(A3) కు మద్రాసు స్పెషన్స్ కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గతనెల 7న జరిగిన వినూతకోట డ్రైవర్ శ్రీనివాస అలియాస్ రాయుడు హత్య కేసులో ఆమె నిందితురాలిగా చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన షరతుల మేరకు వరకు ప్రతిరోజు ఉదయం 10గంటలలోపు C3 సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలంటూ బెయిల్ ఆర్డర్లో ఆదేశాలిచ్చారు.

E-పేపర్

నెల్లూరు: డిప్యూటీ MRO ప్రియాంకకు నోటిసులు

నెల్లూరు: డిప్యూటీ MRO ప్రియాంకకు నోటిసులు DRO లాగిన్లో ఉన్న ఫైల్ను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తన లాగిన్లోకి తీసుకున్న డిప్యూ టీ MRO ప్రియాంకకు DRO హుస్సేన్ సాహెబ్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా ఫైల్ను ఎందుకు తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ ఆమెను కోరారు. వివరణ అనంతరం ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కలెక్టరేట్ ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో కూడా ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి.

కడప

ఒంటిమిట్ట మండల వైస్ ఎంపీపీ బోగా గీతా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిక.

ఒంటిమిట్ట ఆగస్టు (పున్నమి ప్రతినిధి) శుక్రవారం ఒంటిమిట్ట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతులమీదుగా, రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి సమక్షంలో కొత్త మాధవరం ఎంపీటీసీ మరియు ఒంటిమిట్ట మండల వైస్ ఎంపీపీ బోగా గీతా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన మద్దతుగా నేడు టిడిపి కండువా కప్పుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.