డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వింజమూరు బంగ్లా సెంటర్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కులవివక్ష, అస్పృశ్యత నిర్మూలనకు ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” నినాదం అంబేద్కర్ ఆశయాల ప్రతిబింబమని వివరించారు. అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, వారికి రాజకీయ అధికారం కల్పించడంలో అంకితభావంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన నివాళి అని పేర్కొంటూ, అందరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.



