ఆత్మకూరు ఆర్ అండ్ బి అతిథి గృహానికి రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.
మంత్రులు మరికాసేపట్లో ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలు, కీలక అంశాలపై భేటీ కానున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టుల పురోగతి, అమలు పరిస్థితులపై చర్చించనున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, అధికారులు హాజరయ్యారు.



