Monday, 18 May 2026
  • Home  
  • పేదల మంచినీటి కొళాయిల తొలగింపు దారుణం-మిద్దెల హరి ఆగ్రహం
- తిరుపతి

పేదల మంచినీటి కొళాయిల తొలగింపు దారుణం-మిద్దెల హరి ఆగ్రహం

శ్రీకాళహస్తి, మే 18, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో దశాబ్దాలుగా పేద ప్రజలకు ఉపయోగపడుతున్న పబ్లిక్ మంచినీటి కొళాయిలను అధికారులు ఇష్టారాజ్యంగా తొలగించడం అన్యాయమని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మాజీ ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మిద్దెల హరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల్లో పట్టణంలో 40కి పైగా పబ్లిక్ కొళాయిలను తొలగించారని, మిగిలిన వాటిని కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేద ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన కొళాయిల నిర్వహణ బాధ్యత పూర్తిగా పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగానిదేనని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా, ప్రత్యేక పాలనాధికారి అనుమతి లేకుండానే కొళాయిల తొలగింపు చేపట్టడం చట్టవిరుద్ధమని విమర్శించారు. తొలగించిన పబ్లిక్ కొళాయిలను తక్షణమే పునరుద్ధరించాలని పురపాలక కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేద ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో పాటు న్యాయపోరాటం కూడా చేపడతామని మిద్దెల హరి హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.