Monday, 18 May 2026
  • Home  
  • తొట్టంబేడు ఎంఈఓ-2గా ముని తిరుమలయ్య బాధ్యతల స్వీకరణ
- తిరుపతి

తొట్టంబేడు ఎంఈఓ-2గా ముని తిరుమలయ్య బాధ్యతల స్వీకరణ

తొట్టంబేడు, మే 18, (పున్నమి న్యూస్): మండల విద్యాశాఖాధికారి-2 స్థానిక గుండెలుగుంట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.ముని తిరుమలయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన డి.భాస్కర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు ముని తిరుమలయ్యను ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) మండల శాఖ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన ఎంఈఓ-2 మాట్లాడుతూ….మండలంలో బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నమోదయ్యేలా చూడాలని కోరారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, మండల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మండలానికి జిల్లా స్థాయిలో మంచి పేరు తీసుకురావడానికి ఏపీటీఎఫ్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని సంఘ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మురళీకృష్ణ, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.రామదాసు, కె.ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.