సీపీఎం వార్డు సభ్యుడు పోలే శివ రోడ్డు ప్రమాదంలో మృతి
కొత్తపల్లి గ్రామంలో విషాదఛాయలు.. నేడు అంత్యక్రియలు
యాచారం, ఆగస్టు : యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సీపీఎం శాఖ కార్యదర్శి, వార్డు సభ్యుడు పోలే శివ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం తక్కళ్లపల్లి గేటు వద్ద స్కూటీ, బైక్ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
శివ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి తల్లి శ్యామల, భార్య మమత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా, భార్య ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన 2025 స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సీపీఎం తరఫున వార్డు సభ్యుడిగా పోటీ చేసిన శివ ఘన విజయం సాధించారు. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సీపీఎం శాఖ కార్యదర్శిగా, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
శివ మృతికి సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామ పాలకవర్గ సభ్యులు సంతాపం తెలిపారు. నేడు కొత్తపల్లి గ్రామంలో
శివ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


