Thursday, 17 September 2026
  • Home  
  • ​యాప్‌ వద్దూ.. షాపుల్లోనే యూరియా ఇవ్వాలి: మంగళవారిపేటలో BRS భారీ ధర్నా
- వరంగల్

​యాప్‌ వద్దూ.. షాపుల్లోనే యూరియా ఇవ్వాలి: మంగళవారిపేటలో BRS భారీ ధర్నా

నర్సంపేట: వ్యవసాయ సీజన్‌లో రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ BRS ఆధ్వర్యంలో ఉమ్మడి మంగళవారిపేట ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ MPP వి.ప్రకాష్ రావు, మాజీ AMC చైర్మన్ బి.శ్రీనివాస్ గౌడ్, BRS మండల అధ్యక్షుడు ఎమ్.వెంకటనర్సయ్య పాల్గొని మాట్లాడారు. ​సాంకేతిక సమస్యల వల్ల యాప్‌ల ద్వారా యూరియా కొనుగోలు రైతులకు నరకంగా మారిందని, వెంటనే యాప్ విధానాన్ని రద్దు చేసి నేరుగా షాపులు, సొసైటీల ద్వారానే అమ్మకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. RoFR పట్టాలు కలిగిన గిరిజన (ST) మరియు గిరిజనేతర రైతులందరికీ వ్యత్యాసాల్లేకుండా వెంటనే యూరియా పంపిణీ చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఖరి వల్లనే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు బాదావత్ బాలకిషన్, అబోత్ అశోక్ గుగులోత్ బాలు, గొంది నాగేశ్వర్ రావు,భూషబోయిన రాజు బొల్లు మురళి మక్కా పెద్ద వెంకన్న కాసవిమల లింగమూర్తి, భూక్యా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట: వ్యవసాయ సీజన్‌లో రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ BRS ఆధ్వర్యంలో ఉమ్మడి మంగళవారిపేట ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ MPP వి.ప్రకాష్ రావు, మాజీ AMC చైర్మన్ బి.శ్రీనివాస్ గౌడ్, BRS మండల అధ్యక్షుడు ఎమ్.వెంకటనర్సయ్య పాల్గొని మాట్లాడారు.
​సాంకేతిక సమస్యల వల్ల యాప్‌ల ద్వారా యూరియా కొనుగోలు రైతులకు నరకంగా మారిందని, వెంటనే యాప్ విధానాన్ని రద్దు చేసి నేరుగా షాపులు, సొసైటీల ద్వారానే అమ్మకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. RoFR పట్టాలు కలిగిన గిరిజన (ST) మరియు గిరిజనేతర రైతులందరికీ వ్యత్యాసాల్లేకుండా వెంటనే యూరియా పంపిణీ చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఖరి వల్లనే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు బాదావత్ బాలకిషన్, అబోత్ అశోక్ గుగులోత్ బాలు, గొంది నాగేశ్వర్ రావు,భూషబోయిన రాజు బొల్లు మురళి మక్కా పెద్ద వెంకన్న కాసవిమల లింగమూర్తి, భూక్యా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.