వనపర్తి జిల్లా పానగల్ మండలం దావాచిపల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాంక్రీట్ మిక్సర్ వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలాన్ని పరిశీలించి నివాళులర్పించారు. ప్రమాద తీవ్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.
Uploaded Video:

