అంబేద్కర్ కోనసీమ జిల్లా: అయినవిల్లికి చెందిన ఆటో డ్రైవర్ పోలేటి సతీష్ నిజాయితీ చాటుకున్నారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో టిబి జిల్లా సూపర్వైజర్గా పనిచేస్తున్న నల్లి వనిత, గత రాత్రి సుమారు 7:30 గంటలకు సతీష్ ఆటోలో ప్రయాణించి దిగే సమయంలో సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు నగలను ఆటోలోనే మర్చిపోయారు.
ఆటోలో బంగారు నగలను గుర్తించిన సతీష్ వాటిని తన వద్ద ఉంచుకోకుండా అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు. పోలీసులు బంగారు నగలను బాధితురాలు నల్లి వనితకు తిరిగి అందజేశారు.
తన విలువైన నగలను నిజాయితీగా తిరిగి అందించిన ఆటో డ్రైవర్ సతీష్‌ను బాధితురాలు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
నిజాయితీకి ఇదొక చక్కని నిదర్శనం.. శభాష్ సతీష్!


