బోటిమీదపల్లె గ్రామ సచివాలయంలో టీడీపీ యువనాయకులు పోలీనేని శివయ్య నాయుడు కూలింగ్ వాటర్ డిస్పెన్సర్‌ను విరాళంగా అందజేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లటి తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కూలింగ్ వాటర్ డిస్పెన్సర్ ద్వారా గ్రామ సచివాలయానికి వచ్చే ప్రజలు, పోస్టాఫీస్‌కు వచ్చే వారు, రైతు భరోసా కేంద్రానికి వచ్చే రైతులు, ఎం.పి.యు.పి పాఠశాల విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు చల్లటి నీటిని ఉపయోగించుకోగలుగుతారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పోలీనేని శివయ్య నాయుడు సేవా భావాన్ని అభినందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకున్నారు.

బోటిమీదపల్లె గ్రామ సచివాలయానికి కూలింగ్ వాటర్ డిస్పెన్సర్ విరాళం