Monday, 8 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తి ఆలయంలో రేపటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- తిరుపతి

శ్రీకాళహస్తి ఆలయంలో రేపటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి, జూన్ 08, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సనాతన యోగా సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ, ప్రజల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు జూన్ 08 నుండి జూన్ 21 వరకు నిరంతరాయంగా సాగుతాయి. శిక్షణ పొందిన ప్రముఖ యోగా గురువుల మార్గదర్శకత్వంలో భక్తులు, మహిళలు, యువత, విద్యార్థులకు ఉచితంగా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని జయించి, మానసిక ప్రశాంతతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు. భక్తులు, స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దేవస్థానం కోరింది. ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) బి.కె. వెంకటేసులు, డీఈఓ ఎన్.ఆర్. కృష్ణారెడ్డి, ఈఈ శ్రీనివాస రాజు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు (ఏఈఓలు) దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.