ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: ఆకుమల్లి అక్బరు బాషా
యర్రబల్లి: పున్నమి తెలుగు దినపత్రిక యర్రబల్లి రిపోర్టర్ ఆకుమల్లి అక్బరు బాషా మాట్లాడుతూ, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పున్నమి ప్రతినిధులను నియమించి సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో ఉదయగిరి ఇంచార్జ్‌గా ఎదిగి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యతాయుత పాత్రికేయుడిగా సేవలందించడమే తన ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.


