అనకాపల్లి జిల్లా, జూలై 26 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి సేకరించిన చెత్తను సైతం గ్రామ ముఖద్వారం వద్దే వేస్తుండటంతో ఆ ప్రాంతం భారీ చెత్తకుప్పగా మారింది. అంతేకాకుండా గ్రామంలో ఎక్కడ చెత్త ఉన్నా కొందరు ప్రజలు తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో వేస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. అక్కడ చెత్త వేయరాదని సూచించే సరైన హెచ్చరిక బోర్డు లేకపోవడం, చెత్తను తరలించేందుకు పక్కా చర్యలు లేకపోవడంతో ఈ ప్రాంతం డంపింగ్‌యార్డును తలపిస్తోంది. మరోవైపు గ్రామంలోని రోడ్లు గుంతలమయంగా ఉండటం, కుళాయి పనుల కోసం తవ్విన గుంతలను పూడ్చకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పరిశుభ్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రసిద్ధ ఏటికొప్పాకకు ఇదేనా స్వాగతం? గ్రామ ముఖద్వారంలో చెత్తకుప్పలు!
అనకాపల్లి జిల్లా, జూలై 26 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి సేకరించిన చెత్తను సైతం గ్రామ ముఖద్వారం వద్దే వేస్తుండటంతో ఆ ప్రాంతం భారీ చెత్తకుప్పగా మారింది. అంతేకాకుండా గ్రామంలో ఎక్కడ చెత్త ఉన్నా కొందరు ప్రజలు తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో వేస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. అక్కడ చెత్త వేయరాదని సూచించే సరైన హెచ్చరిక బోర్డు లేకపోవడం, చెత్తను తరలించేందుకు పక్కా చర్యలు లేకపోవడంతో ఈ ప్రాంతం డంపింగ్‌యార్డును తలపిస్తోంది. మరోవైపు గ్రామంలోని రోడ్లు గుంతలమయంగా ఉండటం, కుళాయి పనుల కోసం తవ్విన గుంతలను పూడ్చకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పరిశుభ్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

