Monday, 13 July 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: చంద్రబాబు

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసి… ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాది కాలంలో ఏజెన్సీ  ప్రాంతాల్లో అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను వివరించి…. రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై వారితో చర్చించి నేడు నిర్ణయాలు ప్రకటిస్తాం. ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలియజేస్తూ…. మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు

భారతీయ సంస్కృతిలో రాఖీ పండుగ రోజు అన్న, తమ్ములకు ఆడబిడ్డల ఆశీర్వాదం హైదరాబాద్, ఆగస్టు 09, పున్నమి ప్రతినిధి; రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. రాఖీపౌర్ణమి నాడు నిత్యపూజలు చేసి ఇంటిలో ఒక చోట ముగ్గు, పీట వేసి సోదరుడుని కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టవలెను. మిఠాయిలు తినిపించవలెను. సోదరుడు కృతజ్ఞతగా తన సోదరికి ధనము, బట్టలు, నగలు గానీ కానుకగా ఇవ్వడం ఆచారం. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్పగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల || -పై శ్లోకాన్ని పఠిస్తూ సోదరి-సోదరునకు విజయ ప్రాప్తి కోసం సోదరుని ముంజేతికి రాఖీ కట్టవలెను. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం.

యాదాద్రి భువనగిరి

భారత సేవా రత్న పురస్కారం -2025 అందుకున్న బుషపాక శివకుమార్ సేవా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన సేవా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బుషపాక శివకుమార్ కు గాను భారత సేవా రత్న పురస్కారం ఎంపిక చేసి సత్కరించింది. శుక్రవారం హైదరాబాద్ లోని సూర్య కంప్లెక్ హాల్ అబిడ్స్ లో జరిగిన జాతీయ అవార్డుల “తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డా: శంకర్ నాయుడు గారు మరియు వెంకట లక్ష్మి గారు రేఖ గార్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డా: శంకర్ నాయుడు గారికి , వెంకట లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డును నా తల్లిదండ్రులకు నా సంస్థ సభ్యులకు, దాతలు,రక్తదాతలు ,మిత్రులుకు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాను. మీ అందరి మద్దతుతో ప్రేమ తో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు …

తిరుపతి

పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఊంజల సేవ.

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆలయంలోని మండపంలో స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా ఊయలలో అధిష్టింప చేసి వేదపండితుల మంత్రోచ్చారణలతో మేళతాళాలు,మంగళవాయిద్యాల నడుమ ఎంతో వైభవం గా ఊంజలసేవ నిర్వహించారు.భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు.

ఖమ్మం

ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు.

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి) శ్రావణ మాసం 3 వ శుక్రవారం వరలక్ష్మి వ్రత వేడుకలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండే అమ్మ వారి కి పూజలు నిర్వహించిన అనంతరం ఆడపడుచు లని పిలిచి వాయినాలు అందజేసుకొని ఆశీస్సులు తీసుకున్నారు అమ్మ వారి కరుణ కటాక్షలు అందరి మీద ఉండాలి పూజలు చేశారు. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిట కిటలాడయి.

ఆంధ్రప్రదేశ్

పలు దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ): నెల్లూరులో నామినేటెడ్ పదవుల సందడి మొదలు కాబోతోంది. ఆలయ పాలకమండలి ఛైర్మన్లకు, సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం, మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంతో పాటు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చైర్మన్ పదవులను, బోర్డు మెంబర్స్ పదవులను దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు.

యాదాద్రి భువనగిరి

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో హర్ ఘార్ తీరంగా యాత్ర జిల్లా వర్క్ షాప్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ సుర్వి శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవల మహేందర్ గారు విచ్చేశారు విశిష్ట అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఉట్కూరు అశోక్ గౌడ్ గారు పాల్గొన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చేవెళ్ల మహేందర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మన దేశంలో ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలి మరియు మహనీయుల విగ్రహాలు శుదీకరణ చేసి వారిని గౌరవించుకోవాలి విభజన గాయాల స్మృతి దినం గా ఈ వారం రోజులు పండుగ సంబరాలు చేసుకోవాలి దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరంగా యాత్ర జిల్లా కో కన్వీనర్లు కమిటీ కారి కృష్ణ దయ్యాల కుమారస్వామి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి మందడి చిత్తరంజన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మండల అధ్యక్షులు మండల కన్వీనర్లు కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. *భవదీయ* *కమిటీ కార్ కృష్ణ* *దయ్యాల కుమారస్వామి* *తిరంగా యాత్ర కో కన్వీనర్లు*…

యాదాద్రి భువనగిరి

పండుగ సాయన్న జయంతిముదిరాజు సంఘం ఆధ్వర్యంలో

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది.. ముఖ్య అతిథిలుగా హాజరైన కొలుపుల హరినాద్ గారు,పెంట నరసింహ గారు మాట్లాడుతూ పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర అని పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు అని,పేదప్రజలకు దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు. కానీ రాబిన్‌హుడ్ లాగా పండుగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టేవాడని,సాయన్న 1840 నుంచి 1900 మధ్య కాలానికి చెందినవాడని,అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. అతను తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌కు దగ్గర నవాబ్‌పేట మండలం, మెరుగోనిపల్లె గ్రామానికి చెందినవాడు అని అతను గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు అని,20 కేజీల గుండును అవలీలగా ఒక్కచేత్తో లేపే వాడట. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడుఅనీ,అతను పేదవర్గాలకు సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా అతనిని చిత్రించారు అని,ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదాములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టాడు ,సాయన్న సొంతంగా ఆయుధాలు తయారుచేసుకున్నాడు ,ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని తెలిపారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ట్ ఛైర్మన్ పాశం సంజయ్ బాబు , ఇట్టబోయిన గోపాల్,గొర్రెంకల శివశంకర్,ఎనబోయిన జంగీర్,సాదు విజయ్,ఉడుత భాస్కర్,పిట్టల బాలరాజు,దిద్దికాడి భగత్,కమ్మ వెంకటేష్,కొలుపుల నాగరాజు,శాగంటి నర్సింహ,గుర్రాల మల్లేష్,బీసుకుంట్ల జంగిర్,బోయిని బాలయ్య,కానుక బాలరాజు,తుమ్మల నగేష్,మేడబోయిన సాయి,బూస కిష్టయ్య,సిదేన్కి కోటయ్య,కొలుపుల గణేష్,శ్రీకాంత్, బండి సూరి,బండి మహేష్,సాదు మనోజ్,పెంట నితీష్,ఇట్టబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి

సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) *ఈరోజు భువనగిరి పట్టణ 23వ వార్డులో శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం పూజలు మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించి ఈవ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ వాయనాలు ఒక్కరికీ ఒక్కరు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలందరూ వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు ఆ అమ్మవారిని గౌరమ్మ రూపంలో కొలుచుకొని అమ్మవారిని ప్రత్యేక అలంకరణలు చేసి ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి అమ్మవారికి అనేక రకాల నైవేద్యాలను సమర్పించి వ్రతం నిర్వహించి మహిళలందరూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు శ్రీలక్ష్మీదేవి అష్ట అవతారాలలో వరలక్ష్మి ఒకరు వరాలిచ్చే తల్లి వరలక్ష్మిగా భక్తులు కొలుస్తారు వివాహమైన స్త్రీలు కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహాలు జరిగిన మహిళలందరూ దీర్ఘ సుమంగళీ గా ఉంటారని అలాగే అష్టశ్వర్యాలైన సంపద,భూమి, శిక్షణ,ప్రేమ,కీర్తి,శాంతి,సంతోషం,శక్తి వంటివి లభిస్తాయని అన్నారు ఆ జగన్మాత అమ్మవారి ఆశీర్వాదంతో భువనగిరి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఈకార్యక్రమంలో మహిళలు అనసూయ లక్ష్మి లావణ్య నాగమణి రమణ రేవతి శ్యామల సుజాత ఆదిలక్ష్మి మల్లమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.