Sunday, 12 July 2026

Blog

భక్తి

శాలిగౌరారం మండల గ్రామాల్లో బోనాల సంబరాలు

శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని చాలా గ్రామాలు గురువారం బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో కులామతాలకు అతీతముగా చేసుకోవడం జరిగింది. శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో బోనాల పండుగను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొని పండుగకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగను విజయవంతంగా జరుపుకున్నారు.

అన్నమయ్య

బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

ఓబులువారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలంలోని బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంకు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శుభారంభం పలికారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ,”బలిరెడ్డి పల్లి గ్రామానికి సిమెంట్ రోడ్ ద్వారా శాశ్వత సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి” అని తెలిపారు.ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ,”గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమయానికి అందించేందుకు కృషి చేస్తాము” అని తెలిపారు.అనంతరం తిరుపతి హాస్పటల్ లొ బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందిన గజ్జల రమణ రెడ్డి గారిని ఈరోజు వారి నివాసంలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ

ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ మంగంపేట వాస్తవ్యులు పసుపులేటి సుబ్రమణ్యం అలియాస్ మణి ,NDA కుటమి నాయుకులు, ప్రజలు, పాల్కొన్నారు.

E-పేపర్

మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ

ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ మంగంపేట వాస్తవ్యులు పసుపులేటి సుబ్రమణ్యం అలియాస్ మణి ,NDA కుటమి నాయుకులు, ప్రజలు, పాల్కొన్నారు.

అన్నమయ్య

నూతన శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

ఓబులవారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలం మంగంపేట ఆర్ఆర్ 5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ ఎన్ డి ఏ కుటమి నాయుకులు, ప్రజలు, పాల్కొన్నారు.

ఖమ్మం

ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు రక్ష బందన్ వేడుకలు

ఖమ్మం ఆగస్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నగరము లోని రోటరీ నగర్ నందు గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ కిషోర్, డైరెక్టర్ సాయి మెహెర్, పాల్గొనగా ప్రినిసిపల్ సరిరత మాటలాడుతూ విద్యార్థిని, విద్యార్థులు సోదరా బావము తో మెలగాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ, ఉపాధ్యయానీలు విద్యార్థుల పాల్గొన్నారు

భక్తి

ప్రత్యేక అలంకరణలో సవదప్తి రేణుక ఎల్లమ్మ

రాయదుర్గం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో వెలసిన సవదత్తి రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం వరమహాలక్ష్మి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు రాజు అమ్మవారికి పంచామృత,కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. ప్రత్యేకించి అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు సూచించారు.

తెలంగాణ పెద్దపల్లి

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

*మంథని: అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు* మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రం అంబేద్కర్ నగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు ఈ సమావేశాల్లో అంగన్వాడి ఉపాధ్యాయురాలు మండల సుగుణ పలు సూచనలు చేశారు. చిన్నారులకు ఆరు నెలల వయసు వచ్చేవరకు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించాలని ఆమె సూచించారు. కొందరు తల్లిదండ్రులు రసాయన మిశ్రమాలతో తయారు చేసిన కృత్రిమ పాలు తాగించి, పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలే ముద్దని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయు రాలు మండల సుగుణ తో పాటు.. అంగన్వాడి ఆయా రాజేశ్వరి, కాచర్ల కళావతి, కరెంగల రంజిత, పీక శృతి, కట్ల సౌందర్య, మంథిని చైతన్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

ఇంతటి ఆత్మీయ అభిమానం ఎక్కడ చూడలేదు – ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు

ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారి నంద్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ ఇంతటి ఆత్మీయ అభిమానం ఎక్కడ చూడలేదని వ్యాఖ్యానించారు. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని మార్క్ ఫెడ్ కార్యాలయం ఆవరణలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మార్క్ ఫెడ్ కార్యాలయం చేరుకున్న ఆయనకు ఏపి మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులు, సిబ్బంది,  జిల్లా మేనేజర్ హరినాథ్ రెడ్డి, ప్లాంట్ మేనేజర్ అనుషా అధ్వర్యంలో భారి గజమాలతో, అర్చకులు వెంటరాగ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం, సుమారు కోటిన్నర రూపాయలతో పునర్నిర్మాణ చేసిన దాన కర్మాగారం, పప్పుల మిల్లుకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ప్లాంట్ ఆవరణంలో చైర్మన్ తో, డిరెక్టర్లు, అధికారులు మొక్కలు నాటారు.  అనంతరం, ప్లాంట్ ఆవరణంలో జరిగిన ప్రత్యేక పూజల్లో బంగార్రాజుతో పాటు మార్క్ ఫెడ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. అర్చకులు, వేద పండితులు వారిని ఆశీర్వదించారు మర్క్ఫ్ ఫెడ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ కర్రోతు బంగార్రాజు మాట్లడుతూ మనం బాగుండాలంటే.. సంస్థ బాగుందలన్నారు. సంస్థ బాగుండాలంటే.. అందరు కలిసికట్టుగా పని చెయ్యలని ఆయన పిలుపు ఇచ్చారు. సంస్థను లాభాల్లో నడిపించాల్సిన బాధ్యత మనందరి పై ఉందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా ప్లాంట్ సుమారు నాలుగేళ్ల పాటు మూసివెయ్యడం పట్ల బంగార్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తానూ  బాద్యతలు చేపట్టిన 10 నెలలలో ప్లాంట్ లో పనులు పూర్తీ చెయ్యడంలో అందరి సహకరం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు మార్క్ ఫెడ్ లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సిఐటియు నాయకులు గౌస్ చైర్మన్ దృష్టికి తీసుకోవేల్లారు. సమస్యను బోర్డు సమావేశాల్లో చర్చించి పది రోజుల్లో పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకుంటామని అయన హామీ ఇచ్చారు. నంద్యాల మార్క్ ఫెడ్ కు సుమారు 3.77 ఎకరాల్లో స్థలం ఉందని, అందులో చాల వరకు ఖాలిగా ఎందుకు ఉందని ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ స్థానిక అధికారులను ప్రశ్నించారు. అ స్తాలాన్ని ఖాలిగా ఉంచకుండా, ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చర్యలు తీసుకోవాలని, ఫలితంగా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుందని అయన పేర్కొన్నారు రాష్ట్రలో ఏపి మార్క్ ఫెడ్ అధ్వర్యంలో పలు పరిశ్రమలు నడుస్తున్నాయని ఆయన అన్నారు. మా ఉత్తరాంధ్ర ప్రాంతలో కంది, పప్పుదినుసుల వంటి పంటలు పండవని, కేవలం పాడి మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు. నంద్యాల జిల్లా వంటి బాగా పంటలు పండే ప్రాంతాల్లో అభివృద్ధి బాగా జరుగుతుందని, అటువంటి చోట్ల పెట్టుబడులు పెట్టలని ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ పారిశ్రామిక వేత్తలకు సూచించారు. రాష్ట్రంలోని 26 జిలాల్లో మార్క్ ఫెడ్ కో సొంత భవనలు నిర్మాణం కోసం ఆన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు బొబ్బిలిలో అక్రమనకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. తానూ నంద్యాల పర్యటనకు రావడానికి ముఖ్యకారణం ఏపి టిడిపి రాష్ట్ర కార్యదర్శి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి అన్నారు. తను ఊహించిన దానికన్నా అయన ఆహ్వానించిన విధానం, ఆత్మీయత చూస్తే, పెళ్లి మండపం నుంచి నూతన వధువరులను ఆహ్వానించి తీసుకొచ్చినట్టు ఉందని ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ బంగార్రాజు పేర్కొన్నారు. నంద్యాలలో తులసి రెడ్డి అధ్వర్యంలో మార్క్ ఫెడ్ అభివృద్దికి తాము అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  సమావేశం అనంతరం, చైర్మన్, డైరెక్టర్స్ ను నంద్యాల మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులు నంది విగ్రహాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు అనంతరం, నంద్యాల జిలాల్లో పొగాకు సాగు చేసిన రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను టిడిపి యువనేతలు భగవాన్ చౌదరి, చాంద్ బాష ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ బంగార్రాజు దృష్టికి తీసుకోవేల్లారు. స్థానికంగా పొగాకు సాగు చేసిన రైతుల నుంచి మార్క్ ఫెడ్ కొనుగోలు చెయ్యాలని భగవాన్ చౌదరి ఆయనను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ పొగాకు రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోవేల్లుతానని హామీ ఇచ్చారు.

హైదరాబాద్

కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బి జె హెచ్ పి ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప జనం న్యూస్ ఆగస్టు 08 ప్రతినిధి దూపం అంజనేయలు అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు లేకపోతే మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండలని, రాష్ట్ర ప్రజలకు, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప బి జె హెచ్ పి ఎస్ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి, చేశారు రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు విస్తారమైన వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను పాటించాలని వర్షంలో తడవకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.