బోరజ్ ఎక్స్ రోడ్డు–జైనథ్–బేలగుండ–మహారాష్ట్ర వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల్లో నాణ్యతా లోపాలు, అవినీతి జరుగుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వినియోగించడం, కల్వర్టులు, డ్రైనేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. బీటీ రోడ్డు కూడా నిర్దేశిత మందంతో వేయడం లేదని పేర్కొన్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని విమర్శించారు. వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజాధనాన్ని కాపాడాలని ఎంపీని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

రోడ్ల నిర్మాణంలో అవినీతిపై ఎంపీ గోడం నగేష్‌కు సీపీఐ ఫిర్యాదు