Sunday, 10 May 2026

Blog

Blog

బార్ రెన్యువల్స్ చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం – ప్రొహిబిజన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి ఎస్ రవికుమార్

నంద్యాలలో బార్ రేణువల్స్ చేస్తున్నారని, లైసెన్సు రుసుములో మార్పు ఉండబోతున్నది అని ఒక ఫేక్ వార్త సామాజిక మద్యమాల లో అదికంగా ప్రచారం జరుగుతున్నది. అటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించారు, గవర్నమెంట్ కేబినెట్ లో రూల్ ఆఫ్ లా ఆమోదం పొందినవి మరలా కేబినెట్ లోనే రూల్ ఆఫ్ లా ఆమోదం పొందడం జరుగుతుందన్నారు ప్రస్తుతం ఉన్న బార్ రూల్స్ ఈ నెల 31కి ముగియనుంది, సెప్టెంబర్ 1 నుండి నూతన బార్ పాలసీ విధానం ప్రకారం కొత్త రూల్స్ కొనసాగుతుంది, ఈ విధానంలో ఎటువంటి మార్పులు వుండబోవని తెలిపారు. గడువు ముగింపు సమయం 5:00 గంటల వరకు వేచివుండకుండా త్వరగా అప్లికేషన్స్ నమోదు చేసుకొని, చివరి నిమిషంలో తిరస్కరణకు గురికాకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఎవరైతే ఫేక్ వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో వారిపై తగు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంద్యాలకు బార్ లైసెన్సు దరకాస్తుదారులు ఫేక్ వార్తలు నమ్మకుండా జాగ్రత్తలు పడాలని కోరారు.

ఖమ్మం

తెలంగాణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన గల్లా

ఖమ్మం పున్నమి ప్రతినిధి వినాయక చవితి పర్వదినం సంధర్భముగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిరాజేశారూ. ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలి కోరుకుంటున్నట్లు అయన తెలిరాజేశారూ

హైదరాబాద్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు భారత దేశ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలియజేసారు. ఈ సం దర్భముగా అయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ… భగవంతుని సర్వవ్యాపితత్వాన్ని తెలియజేసే ఈ పర్వదినం సమస్త జీవుల సమభావనకు ప్రతీక. ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, గణేశుని ఆశీస్సులతో పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరు తమతమ రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం, పర్యావరణహిత పద్ధతుల్లో నిమజ్జనం చేద్దాం. ప్రకృతిని కాపాడుకుందాం. అని అన్నారు

క్రైమ్

దొంగ తనం కేసు లో పోలీస్ తో పాటు బామ్మర్థి అరెస్ట్

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఈనెల 23న సికింద్రాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న సింవపురి ఎక్స్ ప్రెస్ లో దొంగతనం కేసులో ఓ పోలీస్ కానిస్టేబుల్ తో పాటు అతని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం న్యాయస్థానానికి తరలించారు. GRP ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ N అంజలి కథనం ప్రకారం… హైదరాబాద్ మణికొండ కు చెందిన బండి ప్రియాంక సింహపురి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తోంది. తన I – ఫోన్ -15 దొంగలించబడినట్లు గుర్తించింది. ఇద్దరు అగంతకులను అనుమానించింది. ఈ మేరకు డోర్నకల్ GRP పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న డోర్నకల్ పోలీసులు ఖమ్మం CI N.అంజలి ఆధ్వర్యంలో SI J.సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు నేరాన్ని ఒప్పుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న యరమడి రవీందర్ జల్సాలకు అలవాటు పడ్డాడు. GRP సికింద్రాబాద్ లో కొంతకాలం విధులు నిర్వహించిన రవీందర్ రైల్లో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే తన బావ మరిది మేకల నాగసాయి తో కలిసి రైళ్లలో దొంగతనాలు చేస్తున్నాడు. బండి ప్రియాంక ఫిర్యాదుతో నిందితులు ఇద్దరు ఇలా పోలీసులకు చిక్కారు.

ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్న “అక్షర విద్యాలయం”

26.8.25 పున్నమి ప్రతినిధి. ఈరోజు వెంకటాచలం అక్షర విద్యాలయము నందు గౌరవనీయులు శ్రీమతి దీప వెంకట్ గారి ఆశీస్సులతో ఘనంగా వినాయక చవితి పూజ మహోత్సవం జరిగినది. విద్యాలయ డైరెక్టర్ గారు మరియు ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తదితర సహచరులు ఈ పండుగలు పాల్గొన్నారు. విద్యార్థులందరూ తమ ప్రతిభ కనపరచి మట్టి వినాయక ప్రతిమలు చేసి అందర్నీ సంతోషపరిచినారు.End.

అన్నమయ్య

చిట్వేల్‌: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

చిట్వేల్ మండలంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు నిమజ్జన కేంద్రాలను పరిశీలించారు.చెర్లోపల్లి సిమెంట్ రోడ్ వద్ద ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది ఆయన పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా చిట్వేల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామోహన్, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

యువతకు ఆదర్శం ఇమ్రాన్ సోదరులు డిగ్రీ చదివి బెల్లం పానకం పప్పు బండి నిర్వహణ – అభినందించిన జమాఆతె ఇస్లామీ నంద్యాల అమీర్ సమద్

చదివు ఉన్నా చదువు లేకున్నా నేడు చాలా మంది యువత కాలం వెలిబుచ్చడం, సెల్ ఫోన్ లలో టైమ్ పాస్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. కొంత మంది తల్లితండ్రులను వేధిస్తూ వయసు వచ్చిన పెద్దలపై ఆధారపడి జీవిస్తు కుటుంబానికి, సమాజానికి భారంగా తయారవుతున్నారు అలాంటి యువతకు నంద్యాల రియాజ్,ఇమ్రాన్ సోదరులు ఆదర్శంగా నిలిచి కుటుంబ పోషణలో తమవంతు కృషి చేస్తున్నారు. ఉద్యోగాలంటు కాలం గడపక, చిన్న పనులంటు సిగ్గు పడక ఆత్మవిశ్వాసంతో తమ కాళ్ళపై తాము నిలబడటానికి సిద్ధం అయ్యారు, టెక్కే గిరినాధ్ సెంటర్కు చెందిన ఇమ్రాన్ సోదరులు బెల్లం పానకం పప్పు తయారు చేసి బండి పై అమ్ముతున్నారు. తమ తండ్రి సోను పాపిడి అమ్మెవాడు,గత అయిదు సంవత్సరాల క్రితం మరణిస్తే ఇంటి పోషణ భారం తమపై వేసుకొని ముందుకు సాగుతున్నారు. తండ్రి అనుభవం పుణికి తెచ్చుకొని రోజు ఇంటి వద్ద ‘బెల్లం పానకం పప్పు’ తయారు చేసి స్థానిక పద్మావతి నగర్ లో నంది మిల్క్ సెంటర్ వద్ద బండి పై అద్దం బాక్స్ లో ఉంచి ఇమ్రాన్ విక్రయిస్తాడు, అన్న రియాజ్ ఇంటి వద్ద స్వెచ్ఛమైన బెల్లం పాకంలో వేరుశనగ పప్పు వేసి కమ్మని పానకం పప్పు తయారు చేస్తారు. వారి కృషిని నిరాడంబర వ్యాపార సరళిని సందర్శించిన నంద్యాల జమాఆతె ఇస్లామీ హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమద్ అభినందించారు. బెల్లం పానకం పప్పు టేస్టు వల్ల రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పది కేజీలు అమ్ముతామని, చాలా మంది ఆరోగ్యం, బలం కోసం రోజు వచ్చి తీసుకొని తింటారని, కొంత మంది పిల్లల కోసం తీసుకెళుతారని ఇమ్రాన్ తెలిపాడు. తమ దగ్గర కేవలం కేజి రు. 240 ఉంటుందన్నారు. చాలా మంది ఆర్డర్లు కూడా ఇస్తున్నారని సోదరులు తెలిపారు‌ కొనుగోలుదారుల ను ఇమ్రాన్ సోదరులు చాలా మంచిగా పలకరిస్తు అందరి మన్ననలు పొందటం అభినందనీయమని సమద్ ఆ యువకుల కృషిని ప్రశంశిస్తు నేటి యువతకు ఇమ్రాన్ సోదరులు ఆదర్శం అన్నారు.

E-పేపర్

మదర్ తెరిసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాల నిరంతర నిర్వహణ:డాక్టర్ రవి కృష్ణ

సేవా స్ఫూర్తి ప్రదాత మదర్ తెరిసా జన్మదినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో,నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు, పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు సౌజన్యంతో పేద దివ్యాంగుల కు వినాయక చవితి పండుగ సరుకులు పంపిణీ చేయడం జరిగింది నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో సేవకు ప్రతీకగా నిలిచి, ఆపన్నులకు చేయూత నిచ్చిన మదర్ తెరిసా స్ఫూర్తితో లయన్స్ క్లబ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం, ఐఎంఏ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని డాక్టర్ రవి కృష్ణ అన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం అందించే చేతులు మిన్న అనీ ప్రబోధించిన మదర్ తెరిసా మానవాళికి నిరంతర స్ఫూర్తి ప్రదాతగా చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు ఉపాధ్యక్షులు సేవా కార్యక్రమ దాత పోసిన సుబ్బారావు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి,నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్, రామయ్య, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు

E-పేపర్

మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం

కర్నూలు జిల్లా యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో రాయలసీమ డివిజన్ అధ్యక్షురాలు భారతమ్మ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ కమిటీ సభ్యులు నడుచు కోవలసిన పద్ధతులపై మహిళా ఐక్య వేదిక విధి విధానాలను వివరించి మహిళా ఐక్య వేదికను నిజాయితీతో నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లాలని ఆమె కార్యవర్గాన్ని కోరారు. కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా ఐక్య వేదిక కమిటీ నిర్మాణాలు చేపట్టాలని, మహిళా ఐక్య వేదిక బలోపేతానికి సభ్యులు శ్రమించాలని మండల జిల్లా ల కమిటీకి తెలియజేశారు. అలాగే మహిళలు తమ ఆత్మగౌరవం, హక్కులకై నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందని, మరోవైపు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు, వ్యతిరేకంగా మహిళలంతా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె మహిళా ఐక్య వేదిక సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కటిక భాను, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుతోట పద్మావతి, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలు ఉసేన్ బీ,కోడుమూరు మండల అధ్యక్షురాలు దస్తగిరమ్మ, బేతంచర్ల మండల అధ్యక్షురాలు కోమ్ము పెద్దక్క, షేకున్ బి,లక్ష్మేశ్వరి,కన్యాకుమారి, షేక్ ఇస్మాత్, ఖాజా బి,తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

జాతీయ ప్రతిభ పురస్కార అవార్డులకు ఎంపికైన నంద్యాల బాల అకాడమీ ఉపాధ్యాయులు

గుంటూరు సదరన్ ప్రవేట్ లెక్చరర్, టీచర్ ఆర్గనైజేషన్, కేవిఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రవేట్ టీచర్స్, లెక్చరర్ కి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (టీచర్స్ డే) సందర్భముగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ పురస్కారాలు ప్రకటించనున్నారు.ఈ జాతీయ అవార్డుకు నంద్యాల స్ధానిక బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్,మ్యాథ్స్ ఉపాధ్యాయులు వి.లక్ష్మీనారాయణ మరియు తెలుగు ఉపాధ్యాయులు యం.సురేష్ బాబు లకు ఈ అవార్డులు అందించనున్నారు ఈ వేడుక ఈ నెల 31 వ తేదీన గుంటూరు లోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ ప్రతిభ అవార్ధులకు ఎంపికైన ఉపాధ్యాయులను పాఠాశాల డైరెక్టర్ యం.జీ.వి. రవీంద్రనాద్ మరియు ప్రిన్సిపాల్ మాధవి లత మరియు ఉపాధ్యాయులు, విద్యార్ధులు అభినందనలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.