Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడకు పోయే మార్గంలో ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా అగ్నిప్రమాదం అగ్నిప్రమాద

పున్నమి ప్రతినిధి బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు27.8.25 తేదీ వేకువజామున సుమారుగా 5 గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహం నుండి జొన్నవాడికి పోయే మార్గం ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న టీ సెంటర్ మరియు టెంపో స్టాండ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న రెండు టెంపోలు అగ్నికి ఆహుతి అయినాయి. దానికి తగిన కారణములు ఇంకా తెలియ రాలేదు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.End.

అన్నమయ్య

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి మదనపల్లెలో ఆరు నెలల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన డ్రైవర్ శ్రీకాంత్ ను మంగళవారం జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. రాయలసీమ కోఆర్డినేటర్ దారం అనిత, హరిప్రసాద్, అశ్వత్, ధరణి, ప్రసాద్ లు శ్రీకాంత్ కు అండగా నిలిచి, రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. శ్రీకాంత్ సమస్యను ఎమ్మెల్యే షాజహాన్ బాషా దృష్టికి తీసుకెళ్లి, మరింత సహాయం అందేలా చూస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

అన్నమయ్య

‘ప్రజల కష్టాలన్నీ తొలగిపోవాలి’

అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి వినాయక చవితి సందర్భంగా బుధవారం రాజంపేట కూచివారిపల్లి పంచాయితీ ఎన్టీఆర్ కాలనీలో చమ్మర్తి అభిమాని హరి ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమంలో రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. ఆయన స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరికీ శుభం కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

అన్నమయ్య

చిన్నమండెం: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తన స్వగ్రామం బోరెడ్డిగారిపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, అధికారులకు ఫోన్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

అన్నమయ్య

రాయచోటిలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

అన్నమయ్య జిల్లా పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రధారణలో అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. విఘ్నాలు తొలగి విజయ మార్గంలో నడిపించాలని, జిల్లా పోలీసు కుటుంబాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

అన్నమయ్య

రైల్వేకోడూరులో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రైల్వే కోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) వినాయక చవితి తొలి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందుతూ, నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు గారు ప్రసంగించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సిహెచ్. రమేష్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుబ్బరామరాజు, సర్పంచ్ హరికృష్ణ రెడ్డి, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, ఆంజనేయులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, వార్డ్ మెంబర్లు ఫరూక్, కరీముల్లా, మొహమాద్, వినోద్ కన్నా, సిద్దయ్య, కొన్నిపాటి ప్రసాద్, సుబ్బారాయుడు, కోప్పల శంకరయ్య, ఎక్స్ ఎంపీటీసీ ఆనందయ్య తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేలిలో క్రేజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

చిట్వేలిఆగస్టు (పున్నమి ప్రతినిధి) చిట్వేలి మండలంలోని మెయిన్ రోడ్ స్టేట్ బ్యాంక్ వద్ద వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా క్రేజీ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు ఈసారి మరింత వైభవంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణలతో ప్రజలందరిని ఆకట్టుకున్నాయి. ఉదయం అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ గారి నేతృత్వంలో వినాయకుని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ ధాత బద్రి చంద్ర గారు పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీర్వచనం అందించారు. స్థానిక మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పూజను విజయవంతం చేశారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే గణేష్ హోటల్ వారు అన్నప్రసాద వితరణ చేపట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది. భక్తులు, గ్రామస్తులు, యాత్రికులు అందరూ ఇందులో పాల్గొని వినాయకుని కృప పొందుతున్నారు.ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా పాల్గొని ఉత్సవ వాతావరణాన్ని మరింత చక్కబెట్టుతున్నారు. ఈ కార్యక్రమాలు చిట్వేలి ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ, సమాజంలో ఐకమత్యం పెంచుతున్నాయి.ఈ వేడుకలను విజయవంతం చేసిన ముఖ్య నిర్వాహకులు చౌడవరం నరసింహ రెడ్డి (బాబు అన్న), చౌడవరం మహేశ్వర్ రెడ్డి, పగడాల గణేష్ కుమార్, కరణం వెంకటసుబ్బయ్య, రామి రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, పగడాల భరత్ కుమార్ మరియు క్రేజీ యూత్ సభ్యులు. వీరి కృషితో వినాయక చవితి ఉత్సవాలు చిట్వేలిలో అంగరంగ వైభవంగా జరిగాయి.భక్తి, ఉత్సాహం, సాంస్కృతిక వైవిధ్యం కలగలిసి చిట్వేలి వినాయక చవితి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.

నాగర్‌కర్నూల్

NGKL:ఆసుపత్రిలో ఘనంగా గణపతి పూజలు….

NGKL ఆసుపత్రిలో ఘనంగా గణపతి పూజలు…. విఘ్నా రహిత ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి…. మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి శ్రీ విశ్వవాసు సంవత్సరం భద్రపద మాస శుక్ల చవితి వినాయక చవితి పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో బుధవారం నాడు గణపతి పూజలు ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిచే ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ దృష్ట్యా, ప్రకృతి వికృత రూపం దాల్చకుండా ప్రజా ఆరోగ్యాన్ని,ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడాలని ఆమె భగవంతుని ప్రత్యేకంగా కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ డాక్టర్ ఏ.రోహిత్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పి.పూర్ణిమ,జనరల్ సర్జన్ డాక్టర్ రాజేష్,నర్సింగ్ అధికారులు ఎం.ఆనంద్ కుమార్,ఏం.కిరణ్, ఆంజనేయులు,మన్మోహన్ రెడ్డి,కేశవ్,సునీత, వెంకటేశ్వరీ,చెన్నమ్మ,పలు విభాగాల నర్సింగ్ అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

కాణిపాక ఆలయంలో చేజర్ల నాయకులు

చేజర్ల ఆగస్టు పున్నమి ప్రతినిధి వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉదయం కాణిపాకంలో వెలసియున్న వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకున్న చేజర్ల మండల టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్,ఎంపీటీసీ మస్తానయ్య,భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,ఆర్య వైశ్య సంఘం నాయకులు దేవతి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

ఆగస్టు 27 పున్నమి ప్రతినిధి @ ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ ఉత్తర,దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.