Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వచ్చే నెలలో రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల: పవన్ కళ్యాణ్

ఆగస్టు 27 పున్నమి ప్రతినిధి @ పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదల వుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రకటించారు. ‘ఆర్దిక సంఘం నిధుల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు ఉపశమనం కలగనుంది. హామీ ఇచ్చినట్లు గానే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల్లో సద్వినియోగం చేయాలన్న దృఢమైన వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. స్థానిక స్వపరిపాలనను బలో పేతం చేస్తూ గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమ ర్థంగా అందించాలన్నదే మా ఉద్దేశం. రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్య వాదాలు’ అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా వినాయక చవితి కార్యక్రమం

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంఘం కార్యాలయంలో గల వినాయక దేవాలయంలో వినాయకున్ని ప్రతిష్టించి సంఘం సభ్యులు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

డాక్టర్స్ మెడికల్ అకాడమీ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం జిల్లా పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ) వినాయక చవితి వేడుకలని ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఖమ్మం నగరం లో ని ప్రముఖ మెడికల్ అకాడమీ అయినా డాక్టర్స్ మెడికల్ అకాడమీ లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నరూ. బాలికల క్యాంపస్ లో జరిగిన గణపయ్య పూజలో శ్రీమతి ఈగ లక్ష్మి భరణి దంపతులు పాల్గొనగా బాలుర క్యాంపస్ లో జరిగిన గణపయ్య పూజలో శ్రీమతి రాయల ఈశ్వరీ సతీష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా శ్రీ ఈగ భరణి లక్ష్మి దంపతులు,, శ్రీ రాయల సతీష్ ఈశ్వరీ దంపతులు వారి కళాశాల విద్యార్థిని, విద్యార్థులకి సిబ్బంది కి,తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసారు.

నాగర్‌కర్నూల్

వెలమ సంఘం కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం కార్యాలయంలో బుధవారం ఘనంగా వినాయక చవితి ఉత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వినాయకుడిని కార్యాలయంలోనే వినాయక దేవాలయంలో ప్రతిష్టించారు. శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెలమ సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వినాయకున్ని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

ఖమ్మం

దంచి కొడుతున్న వాన

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి బంగాళాకతం లో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం నగరం లో లోతట్టు ప్రాంతాలు జలమయం ఐయ్యాయి. ఐటి హబ్, ఇల్లేందు క్రాస్ రోడ్డు, పాత బస్ స్టాండ్, మయూరి సెంటర్ జలమయం ఐయ్యాయి. దీనితో రాకపోకలు కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా లో పాలేరు, వైరా, లంక సాగర్ జలాశయలకి వరద ఉదృతంగా ప్రవహిస్తుంది

తిరుపతి

శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ

వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా,గత 11 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తూ పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.అలాగే భక్తులందరూ మట్టి గణపతి ప్రతిమలను పూజించి, పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ సందర్భంగా,జనసేన పార్టీ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి,నాయకులు కుమార్,మాధవ మహేష్, గరికపాటి చంద్రశేఖర్, విజయ్,ఈర్ల చిరంజీవి,సురేష్,రాఘవ, మోహన్, లీలదర్, వీరామహిళా కవిత తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

గల్లా కి శుభాకాంక్షలు తెలిపిన అయన అభిమానులు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖమ్మం కో ఆప్షన్ సభ్యులుగా నియమితులైన భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా మాజీ రథసారథి బిజెపి రాష్ట్ర నాయకులు మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జి శ్రీ గల్లా సత్యనారాయణ కి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లరావ్ గౌడ్, గజ్జల శ్రీనివాస్, అప్పారావ్ లు కలసి అభినందనలు తెలిపారు. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్

శర్వాణి విద్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

శర్వాణి విద్యాలయంలో బుధవారం ఘనంగా వినాయక చవితి పూజను నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుని ఆశీర్వాదాలు పొందారు. ఉదయం నుంచే విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో పాఠశాలకు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి గీతాలు, శ్లోకాలతో వాతావరణం భక్తిమయమైంది. ఉపాధ్యాయులు గణనాధునికి ప్రత్యేక పూజలు చేసి, విద్యార్థులతో కలసి నామస్మరణ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీమతి సాయి రాణి మాట్లాడుతూ –“వినాయక చవితి పండుగ విద్యార్థులలో సత్కార్య భావన, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తుంది. విఘ్నేశ్వరుని ఆరాధనతో ధైర్యం, సాహసం, విజయం సిద్ధిస్తాయి. విద్యార్థులు విద్యలో శ్రద్ధ చూపి గురువులను గౌరవిస్తే గణేశుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి” అని అన్నారు.అనంతరం విద్యార్థులకు ప్రసాదం పంపిణీ చేయగా, చిన్నారులు ఆనందోత్సాహాలతో ఇంటికి చేరుకున్నారు.

ఖమ్మం

ఇదేనా ఖమ్మం అభివృద్ధి…?

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒకరు మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం అభివృద్ధి చెందినది. హైదరాబాద్ మహానగరం అంత అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రులు ఒక్క సారి వర్షాకాలం లో ఖమ్మం నగరం లో మీరు చేసిన అభివృద్ధి ఏంటో అని ఒక సారి బూతద్ధం పెట్టి వెతకండి. కనిపిస్తుందేమో చూద్దాం. డ్రైనేజీ లు పొంగి పొర్లుతున్నాయి. వాటి వల్ల మోకాళ్ళు లోతు నీళ్లు తో ప్రజలు నానా యాతన పడుతుంటే మంత్రులేమో దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహారిస్తునట్లు ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారూ.

ఆంధ్రప్రదేశ్

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే కాకర్ల సురేష్..///

నవరాత్రులు వినాయక మండపాలన్నీ కళకళలాడాలి… ఉదయగిరి పున్నమి న్యూస్ ప్రతినిధి గస్టు 26 :/// ఉదయగిరి నియోజకవర్గం యావత్ ప్రజానికం.. కూటమి శ్రేణులకు మనందరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అందరూ గణపతి నవరాత్ర మహోత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజానీకానికి మనందరి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియచేస్తూ సందేశాన్ని విడుదల చేశారు.ఆయురారోగ్యాల‌తో అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని గ‌ణ‌నాథుడిని వేడుకుంటున్నానన్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజానికం మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే ప‌నుల‌కి విఘ్నాలు తొల‌గి, దిగ్విజ‌యం అయ్యేందుకు ప్రధమ పూజ్యుడు వినాయ‌కుడు ఆశీస్సులు అందించాలని ఆయన ఆకాంక్షించారు.తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నవరాత్రులన్నీ రోజులు వినాయక మండపాలు కళకళలాడాలన్నారు. విఘ్నాలను అధిగమించి, రాష్ట్రం పురోగమనం సాధిస్తుందని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.