Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

నరసన్నపేట సీఐ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పండుగ సందర్భంగా నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. శ్రీనివాస్ రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –“ఆ విఘ్నేశ్వరుడు, గణనాథుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందమయ జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబం సంతోషసమృద్ధులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ –“వినాయక చవితి పండుగ, వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలను ప్రశాంతంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, అపశృతులకు తావులేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరుపుకోవాలి. పోలీసు శాఖ జారీ చేసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి” అని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు ఎస్పీ శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడు, గణనాథుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆనందంతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. జీవన ప్రయాణంలో ఉన్న విఘ్నాలు తొలగిపోయి విజయాలు సాధించాలని, ప్రజలందరి జీవితాల్లో సకల శుభాలు నెలకొనాలని కోరారు. జిల్లాలో వినాయక చవితి పండుగ, వేడుకలు, గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఆనందభరితంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ జిల్లా పోలీసు శాఖ జారీ చేసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు పాటిస్తూ, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

మంత్రి సుభాష్ గురువారం పర్యటన వివరాలు

కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గురువారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చైర్మన్ గా వలవల మల్లికార్జున రావు ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమిటేషన్ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

అన్నమయ్య

వినాయకుడిని దర్శించుకున్న సుగవాసి

రాయచోటి పట్టణంలోని మసాపేట, గాలివీడు రోడ్డు, మదనపల్లె రోడ్డులలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనను సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పలు వీధులలో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.

అన్నమయ్య

వ్యాపారం ముగిసింది.. చెత్త మిగిలింది

రైల్వే కోడూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ప్రధాన రహదారిపై చిరు వ్యాపారులు వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి అమ్మకాలు జరిపారు. బుధవారం వ్యాపారం ముగిసిన తర్వాత, వారు తమ వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్లడంతో రహదారి ఇరువైపులా చెత్తాచెదారం పేరుకుపోయింది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

కె.జగన్నాధపురం గుత్తుల వారి పాలెం లో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు

అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గుత్తుల వారి పాలెం లో వర సిద్ధి వినాయకుడు కొలువుదీరాడు. చవితి నవరాత్రి ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. అర్చకుల వేద మంత్రాల నడుమ బాజా భజంత్రీలు, మేళ తాళాలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. వర్షం కురుస్తున్నా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్

*లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు* 🔹

1ముఖ్య అతిథులుగా పొట్లూరి హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ డి.ఈ రమేష్ కుమార్ తెలుగు భాషా అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం – వడ్డి సుధాకర్ లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడ్డి సుధాకర్ అధ్యక్షతన హిందూపురంలోని శ్రీ శేఖర్ అకాడమీ నందు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ ముందస్తు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జానపద కలళ అకాడమీ తొలి అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ, హిందూపురం మునిసిపల్ ఛైర్మన్ డి.ఈ రమేష్ కుమార్ పాల్గొని తెలుగు భాష పట్ల అంకితభావంతో పనిచేస్తున్న లేపాక్షి ఫౌండేషన్ సేవలను కొనియాడారు.ప్రతి ఒక్కరూ తెలుగు భాష అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. లేపాక్షి ఫౌండేషన్ చైర్మన్ వడ్డి సుధాకర్ మాట్లాడుతూ తెలుగు భాష అభ్యున్నతికి అభివృద్ధికి లేపాక్షి ఫౌండేషన్ ముందుంటుందని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలియజేస్తూ కవులకు తెలుగు భాషా పురస్కారాలను, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అతిధుల చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ మండల విద్యాధికారి గంగప్ప కౌన్సిలర్ దుర్గా నవీన్, లేపాక్షి ఫౌండేషన్ సభ్యులు ధనాశి ఉషారాణి,చంద్రశేఖర్,అశోక్ కుమార్,శశికళ,విజయ్ కుమార్ పలు జిల్లాల కవులు విజేతలు పెద్ద ఎత్తున తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఘన సన్మానం చేశారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం.

ఆగస్టు 27 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజమండ్రి మోరంపూడి చేతన్య హాస్పిటల్ లో జరిగిన ఓ విద్యార్థి పై ర్యాగింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విచక్షణారహితం. ఐరన్ బాక్స్ తో కాల్చి దుర్మార్గానికి పాల్పడ్డారు. కోనసీమ జిల్లా రాజమండ్రి మోరంపూడి శ్రీచైతన్య హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (16)పై సహచర విద్యార్థులు పైశాచికత్వానికి పాల్పడ్డారు. ఐరన్ బాక్స్ తో పొట్ట భాగం, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టి… శ్రీచైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ చేసారు. బిడ్డను చూసేందుకు శ్రీచైతన్య స్కూల్‌కు తల్లి వెళ్లడంతో ఈ ఘటన బయట పడింది. కానీ ఇప్పటికి స్పందించలేదు యాజమాన్యం. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదరించిన ఘటనకు పాల్పడ్డాడు విద్యార్థులు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లి లక్ష్ణ్మీకుమారి.

అన్నమయ్య

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవం

అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి మహోత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి ప్రత్యేక పూజల్లో పాల్గొని, వినాయకుడు సమాజం నుంచి విఘ్నాలు తొలగించి సుఖశాంతులు కలిగించాలని ప్రార్థించారు.పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి గీతాలు పాడి, హారతులు ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. సమిష్టిగా జరుపుకున్న ఈ వేడుక పోలీసు కుటుంబంలో అనుబంధాన్ని బలపరిచింది.

అన్నమయ్య

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాస్ రెడ్డి టీడీపీలో చేరిక

చిట్వేలి ఆగస్టు పున్నమి ప్రతినిధి చిట్వేల్ మండలానికి చెందిన క్లాస్–1 కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ ముక్క రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.