దొంతాళి డంపింగ్ యార్డ్ పరిశీలించిన మంత్రి నారాయణ.. నెలాఖరుకల్లా 65 వేల టన్నుల చెత్త తొలగింపు లక్ష్యం
నెల్లూరు రూరల్‌లోని దొంతాళి డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 153 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రంపై మోపి, ప్రజలపై చెత్త పన్ను భారం వేసిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, దొంతాళిలో ఉన్న 65 వేల టన్నుల చెత్తను ఈ నెలాఖరుకల్లా పూర్తిగా క్లియర్ చేస్తామని వెల్లడించారు. రెండేళ్లలో వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను పూర్తి చేసి, 100 కిలోమీటర్ల పరిధిలోని చెత్తను రోజువారీగా ప్రాసెస్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

దొంతాళి డంపింగ్ యార్డ్ పరిశీలించిన మంత్రి నారాయణ.. నెలాఖరుకల్లా 65 వేల టన్నుల చెత్త తొలగింపు లక్ష్యం
దొంతాళి డంపింగ్ యార్డ్ పరిశీలించిన మంత్రి నారాయణ.. నెలాఖరుకల్లా 65 వేల టన్నుల చెత్త తొలగింపు లక్ష్యం నెల్లూరు రూరల్‌లోని దొంతాళి డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 153 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రంపై మోపి, ప్రజలపై చెత్త పన్ను భారం వేసిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, దొంతాళిలో ఉన్న 65 వేల టన్నుల చెత్తను ఈ నెలాఖరుకల్లా పూర్తిగా క్లియర్ చేస్తామని వెల్లడించారు. రెండేళ్లలో వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను పూర్తి చేసి, 100 కిలోమీటర్ల పరిధిలోని చెత్తను రోజువారీగా ప్రాసెస్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

