Saturday, 8 August 2026
  • Home  
  • డాక్టర్ జగన్ మోహన్ రావు ప్రథమ వర్ధంతి.. ఘనంగా నివాళులు
- ప్రకాశం

డాక్టర్ జగన్ మోహన్ రావు ప్రథమ వర్ధంతి.. ఘనంగా నివాళులు

ఒంగోలు: ఒంగోలు గద్దలగుంటలో డాక్టర్ జగన్ మోహన్ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు పలువురు దళిత, మాల సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు, దళిత ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, సీనియర్ మాల మహానాడు నాయకులు నత్తల యానాధరావు తదితరులు జగన్ మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, సమాజం కోసం ఆయన చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘ నాయకులు క్రాంతి కుమార్, కసుకుర్తి మల్లికార్జున్, బల్లికురవ గోపి, అనంతబాబు, పి.డి. నరేష్, టీచర్ కోటేశ్వరరావుతో పాటు దళిత నాయకులు, కుటుంబ సభ్యులు నత్తల భీమేష్, కృష్ణ, బల్లికురవ వెంకట తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

ఒంగోలు: ఒంగోలు గద్దలగుంటలో డాక్టర్ జగన్ మోహన్ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు పలువురు దళిత, మాల సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు, దళిత ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, సీనియర్ మాల మహానాడు నాయకులు నత్తల యానాధరావు తదితరులు జగన్ మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, సమాజం కోసం ఆయన చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘ నాయకులు క్రాంతి కుమార్, కసుకుర్తి మల్లికార్జున్, బల్లికురవ గోపి, అనంతబాబు, పి.డి. నరేష్, టీచర్ కోటేశ్వరరావుతో పాటు దళిత నాయకులు, కుటుంబ సభ్యులు నత్తల భీమేష్, కృష్ణ, బల్లికురవ వెంకట తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.