Sunday, 10 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘనంగా గణేష్ ఉత్సవాలు

న్యూస్ ఆగస్టు 27 కాట్రేనికోన కమిని పంచాయతీ పొట్టితిప్ప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు గుడి అర్చక స్వామి పోతుల శ్రీను ఆధ్వర్యంలో పూజలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ గడ్డం కృష్ణమూర్తి మాట్లాడుతూ గణపతిని పూజించడం వలన విఘ్నాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అన్నారు ఈ విధంగా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులు ప్రజలందరూ ఐక్యమత్యంతో పూజలు నిర్వహించడం వలన అందరి మధ్య స్నేహభావం ఏర్పడుతుందన్నారు ఐ పోలవరం మండలం తిల్లకుప్ప అంబేద్కర్ కాలనీలో ఎస్ ఎస్ ఎఫ్ గ్రామ కన్వీనర్ తోటకూర బాబులురాజు రాచకొండ అచ్చిబాబు ల ప్రోత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు గణపతి మండపం ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించినారు. ఆలయ కన్వీనర్ సాధనాల పండు మెల్లం మురళి మోత రాజు శ్రీ జొన్నాడ దుర్గ యం. శ్రీరామ్ శంకర్ జొన్నాడ జగదీష్ గేల్లా కార్తీక్ కుమ్మరి విజయ్ మాత శంకర్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ 100% క్లియర్

న్యూస్ ఆగస్టు 27 కాట్రేనికోన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ వందశాతం పూర్తయ్యిందని కాట్రేనికోన డిసిసిబి మేనేజర్ పీతల శ్రీనివాస రావు పేర్కొన్నారు.మండల పరిధిలోని కందికుప్ప సొసైటీ కార్యాలయంలో చైర్ పర్సన్ నూకల మూర్తి అధ్యక్షతన కంప్యూటరైజషన్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి బిఎం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రాబోయే రోజులలో సొసైటీ కార్యక్రమాలు ఆన్ లైన్ లో జరుగుతాయన్నారు.సంఘం పరిధిలోని సభ్యులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్ధిక సాయం చేయాలని రైతులు కోరారు.అలాగే సొసైటీలో అందిస్తున్న పౌర సేవలను ప్రజానీకం సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.అనంతరం చైర్ పర్సన్ నూకల మూర్తి,సభ్యులు కాలాడి వీరబాబు,బొంతు శివశంకర్ ఆధ్వర్యంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావుకి సన్మానం చేసారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సూపర్ వైజర్ పేర్నీడి జయశ్రీ,రైతులు నూకల కొండలరావు,దుర్గబాబు,తాడి బాబా సురేంద్రనాథ్,పాలెపు చిన సత్యం,సత్యానందం,గుద్దటి మంగారావు,నాగళ్ళ వాసు,గోనెమడతల మహేష్,సీఈఓ యర్రంశెట్టి రామచంద్రరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ని సత్కరించిన నాయకులు

… న్యూస్ ఆగస్టు 27 కాట్రేనికోన సారథ్యం కార్యక్రమానికి కాకినాడ విచ్చేసి అన్నమ్మగాటి సెంటర్లో నాయకర్ గారి కాంస్య విగ్రహానికి గజమాల వేసి సారథ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ,,పివియన్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువా, తో బిజెపి నాయకులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు శ్రీమతి ఉమామహేశ్వరి, చెక్కా అజయ్ వర్మ సత్కరించడం జరిగింది.. అనంతరం…నాయకర్ జిల్లా సాధన సమితి తో కలిసి జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని వినతిపత్రం నాయకర్ ఇప్పుడు మీ బాబాయ్ చిత్రపటం, అందించడం జరిగింది… అనంతరం మాధవ్ మాట్లాడుతూ….మల్లాడి సత్యలింగం నాయకర్ గారు ఎంఎస్ఎన్ చారిటీస్ స్థాపించి రాష్ట్రంలో మొదటి సాంకేతిక కళాశాల పాలిటెక్నిక్ స్థాపించి అనేక మంది ఇంజినీర్స్ ని తయారు చేయడం తో పాటు అనేక కళాశాలలను ప్రారంభించడంతో పాటు విద్య వసతి భోజనం విదేశాల్లో చదువుకోవడానికి అనేకమందికి ప్రోత్సాహాన్ని అందించడం ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు ఆ స్థాయికి ఎదగడానికి ప్రోత్సాహాన్ని అందించింది కూడా వారే… అంతేకాకుండా అనేక దేవాలయాలు, వేద పాఠశాల నిర్మాణం చేసి ఆధ్యాత్మిక సామాజిక చైతన్యం కోసం యావదాస్తిని సమాజ సంక్షేమం కోసం.. ఖర్చు చేసిన మహనీయులు అందుకే వారికి గజమాలను వేసి నివాళులర్పించి సారథ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని తెలియజేశారు…. మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు వైదాడి నూకరాజు.. బిజెపి నాయకులు కొక్కిలిగడ్డ గంగరాజు మచ్చ శివప్రసాద్ కోపనాతి దత్తాత్రేయ వర్మ శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి అధ్యక్షులు పెమ్మాడి శ్రీను కోలా మీరయ్య కాలాడి శివ దున్న జాన్ కామేశ్వరరావు పాలెపు సత్తిబాబు… తదితరులు పాల్గొన్నారు…

తిరుపతి

జనసేన నాయకులు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

జనసేన పార్టీలోని 7 సిద్ధాంతాలలో చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించడం,ఈ సిద్ధాంతం ఆశయ సాధన కోసం ఈరోజు వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలపడం జరిగింది.రసాయనాలు కలిగినటువంటి వినాయకుడిని పూజించడం వలన నిమజ్జనం కోసం చెరువులలో,నదులలో, సరస్సులో,వేయడం వలన నీటి కాలుష్యం,భూమి కాలుష్యం జరిగి జలచరజీవులు నశించిపోతున్నాయని ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పర్యావరణాన్ని రక్షించడం కోసం ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

శేషాచలం అడవుల్లో పెద్దపులి సంచారం

చిట్వేలి ఆగస్టు పున్నమి ప్రతినిధి ఉమ్మడి కడప జిల్లా చిట్వేలి శేషాచలం అడవుల్లో పెద్దపులి దర్శనమిచ్చింది. ఇటీవల రేంజ్ అధికారులు ఏర్పాటు చేసిన 30 ట్రాప్ కెమెరాల్లో పగలు, రాత్రి పులుల సంచారం రికార్డు అయ్యింది. రెండు నుంచి మూడు పులులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇవి శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ నుంచి నల్లమల–శేషాచలం కారిడార్ ద్వారా వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో ఈ అడవుల్లో పులుల సంచారం పెరిగే అవకాశముందని అంచనా.

తిరుపతి

వినాయకచవితి సందర్భంగా శ్రీకాళహస్తిలో అన్నదానం

శ్రీకాళహస్తి పట్టణం,దర్గామిట్టలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వార్డు నాయకులు రవి గౌడ్,మున్నా రాయల్, తదితరులు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.అనంతరం వినాయక చవితి శుభ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కాట్రేని కొన లో నూకల దుర్గ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

న్యూస్ ఆగస్టు 27 కాట్రేను కోన కాట్రేనికోన జనసేన నాయకులు నూకల దుర్గ పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దాట్ల పవన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగ్రికుల క్షత్రియ చైర్మన్ ఎక్స్ నాగిడి నాగేశ్వరరావు ఎస్సీ డైరెక్టర్ చెల్లు అశోక్ సుబ్బరాజు, ఆకాశం శ్రీను ఏఎంసి చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకట్ రెడ్డి బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంథి నానాజీ బిజెపి జిల్లా నాయకులు మట్ట సూరిబాబు బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ మోక బాల ప్రసాద్ త్సవటపల్లి శ్రీను జొన్నాడ రాజారావు, రంబాల రమేష్, రంబాల దొరబాబు బిజెపి , , పిఎస్ఎన్ రాజు, వాసంశెట్టి రాజేశ్వరరావు, విత్తనాల బుజ్జి , కంది కుప్ప సొసైటీ త్రి కమిటీ సభ్యులు కాలాడి వీరబాబు ,మోకా అప్పాజీ జంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వినాయక నిమర్జన ప్రదేశాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు-టూ టౌన్ సిఐ

శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి పురస్కరించుకుని వినాయక నిమర్జనం చేయు భక్తుల కోసం ఏర్పాటు చేసిన టూ టౌన్ పరిధిలోని పెద్దకన్నలి తెలుగు గంగా కాలువ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పడాని సిసి కెమెరాలు, లెడ్ ఫోకస్ లైట్ లు ఏర్పాటు చేసి, పోలీసులు మరియు ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రెండవ పట్టణ సిఐ నాగార్జున రెడ్డి తెలియజేసారు.

తిరుపతి

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి పి రాధాకృష్ణన్ కి స్వాగతం పలికిన కోలా ఆనంద్

తిరుమల పర్యటనకు విచ్చేసిన ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి పి రాధాకృష్ణన్ కి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ,భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బి డి బాలాజి,డాక్టర్ నరేష్,జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్,జిల్లా కార్యవర్గ సభ్యులు యతేందర్ రెడ్డి, రమణారెడ్డి,మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు కూనాటి నాగరాజు,ఏడం కృష్ణయ్య, భగర్తి వెంకటేష్,తిరుమలశెట్టి నరేష్,పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిలు కోనేటి అయ్యప్ప , సిద్ధూ రాయల్,యువ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ యుగంధర్,రవి రాయల్ తదితరుల పాల్గొన్నారు.

తిరుపతి

జ్ఞాన సిద్ది వినాయకు స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, నవగ్రహ హోమం

శ్రీకాళహస్తి పట్టణం గాంధీ వీధి నందు వినాయక చవితి సందర్భంగా జ్ఞాన సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు,నవగ్రహ హోమము,గణపతి హోమము శాస్త్రోకంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు.అనంతరం స్వామి వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమంలో పూర్ణాహుతి సమర్పించారు.ఈ కార్యక్రమంలో జలకం కిషోర్,మధు, కుప్పయ్య,కనపర్తి తిరుపాల్,రూపేష్, ఆవులపాటి శ్రీనివాసులు,పూడి రవి, మొగరాల గణేష్,జలగం సందీప్,కనపర్తి హరికృష్ణ, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.