Sunday, 10 May 2026

Blog

జనగాం

ZPHS ఏడునూతులకు కలెక్టర్ అభినందన – అధికారులకు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు

ఆగస్టు 28, పున్నమి ప్రతినిధి, జనగాం: జాతీయ స్థాయి నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (NAS-2024) లో జనగాం జిల్లా 6వ తరగతి విభాగంలో 35వ ర్యాంక్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించిన సందర్భంగా, కలెక్టర్ శ్రీ రిజ్వాన్ బాషా షేక్, IAS గారు, అదనపు కలెక్టర్ శ్రీ పింకేష్ కుమార్, IAS గారు ZPHS ఏడునూతుల ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యాకయ్య గారిని, ఉపాధ్యాయులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ZPHS ఏడునూతుల (Kodakandla మండలం) ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యాకయ్య గారు, సిబ్బంది మరియు విద్యార్థులు కలెక్టర్, అదనపు కలెక్టర్ గారికి, అలాగే మండల విద్యా అధికారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “హెడ్మాస్టర్ దూరదృష్టి మార్గం చూపితే, ఉపాధ్యాయుల కృషి ఆ మార్గంలో విజయదీపం వెలిగించింది” అని విద్యార్థులు పేర్కొన్నారు. హెడ్మాస్టర్ శ్రీ నారబోయిన యాకయ్య గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ – “ఈ విజయం మొత్తం సిబ్బంది కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం ఫలితం. జనగాం (మా పాఠశాల) జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి నిరంతరం శ్రమిస్తాం” అన్నారు. ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులు: కమల్ కుమార్, రాంబాబు,భాస్కర్, సోమేశ్వర్, యాదగిరి, G. రజిత, మమత, M. రజిత, విజయ, ఈర్య, కవిత. అధికారుల ప్రోత్సాహం, మార్గదర్శకం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై చూపిన శ్రద్ధ వలననే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించి, జిల్లా, రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని సంకల్పించారు.

ఖమ్మం

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. * లోతట్టు ప్రాంతాల్లో సేవలకు కార్యకర్తలు సిద్ధం కావాలని బీజేపీ అధ్యక్షుడు పిలుపు.

పున్నమి Daily న్యూస్ ప్రతినిథి:T.Ravinder ఖమ్మం ఖమ్మం, ఆగస్టు 28: ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రజల ఉద్దేశించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్న దృష్ట్యా పార్టీ కార్యకర్తలు తక్షణమే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. “వర్ష విపత్తు సమయాల్లో ప్రజల పక్కనే నిలబడి సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలి. అవసరమైతే రాత్రింబగళ్లు పనిచేసి బాధితులకు తోడ్పాటు అందించాలి” అని ఆయన కార్యకర్తలకు సూచించారు. వాగులు పొంగిపొర్లుతున్నాయి – పంటలు జలదిగ్బంధం గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రహదారులు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పంట పొలాలు జలదిగ్బంధమై వేలాది ఎకరాల్లో పత్తి పంట తీవ్ర నష్టానికి గురైంది. గ్రామాలు, లోతట్టు కాలనీలు నీటమునిగి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద భయాందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించగా, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అవసరమైతే వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని నెల్లూరి కోటేశ్వరరావు సూచించారు. అత్యధిక వర్షపాతం – గ్రామాలు చీకటిలో సత్తుపల్లి మండలంలో 18 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవగా, కొనిజర్ల, మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షపు తీవ్రతతో రోడ్లు చెరువుల్లా మారి అనేక గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయమై, గ్రామీణ ప్రాంతాలు చీకటిలో మగ్గుతున్నాయి. తాగునీరు, పాల సరఫరా, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండి, అప్రమత్తతతో వ్యవహరించాలని, సహాయక చర్యలకు కార్యకర్తలు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని ఆయన మరొకసారి పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్…!

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ వీధి వ్యాపారస్తులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. వీధి వ్యాపారులు మరియు చిరు వ్యాపారులకు రుణాలను అందించే పీఎం స్వనిది పథకాన్ని మార్చ్ 2030 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం. మొదటి ఆదాయం వచ్చే రుణాన్ని పదివేల నుంచి 15 వేలకు, రెండో ఏడాది అమౌంటును 25 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.

విద్య విజ్ఞానం

నకిలీ విశ్వవిద్యాలయాలు:! ఆ 20 వర్సిటీలిచ్చే డిగ్రీలు చెల్లవ్.. ఫేక్ యూనివర్సిటీలను గుర్తించడం ఎలా?

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్ పూర్తయ్యాక ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. కానీ, ఇదే అదనుగా విద్యార్థులు, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొనేందుకు నకిలీ వర్సిటీలు పుట్టుకురావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఫేక్ వర్సిటీల మాయలో పడితే విద్యార్థులు మోసపోయే ప్రమాదం అధికం. ఇవి మీ సమయాన్నే కాదు.. డబ్బును, భవిష్యత్తునూ నాశనం చేస్తాయి. అందువల్ల నకిలీ యూనివర్సిటీలను(Fake Universities) గుర్తించి వాటి అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం. జూన్ 2025 నాటికి మన దేశంలో 20 నకిలీ (Fake Universities In India) ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఆయా వర్సిటీల జాబితాను సైతం అందుబాటులో ఉంచింది. నిజమైన యూనివర్సిటీలు ఏవైనా సరే యూజీసీ లేదా ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొంది ఉండాలి. ఆ విద్యా సంస్థలకు మాత్రమే విద్యార్థులకు డిగ్రీలు మంజూరు చేసే అధికారం ఉంది. ఇవి ఇచ్చే డిగ్రీలకే విలువ ఉంటుంది. నకిలీ వర్సిటీలిచ్చే డిగ్రీలకు ఏమాత్రం విలువ ఉండదు. అందువల్ల మీరు చదవాలనుకొంటున్న యూనివర్సిటీ గురించి తెలుసుకొనేందుకు కొంచెం సమయం కేటాయించి అధ్యయనం చేయండి. ఆ తర్వాతే ఎంపిక చేసుకోవడం తెలివైన పని. 20 నకిలీ యూనివర్సిటీల జాబితా కోసం క్లిక్ చేయండి. ఫేక్ యూనివర్సిటీలను గుర్తించడం ఎలా? విద్యార్థుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నకిలీ విశ్వవిద్యాలయాలు ప్రయత్నిస్తుంటాయి. తమ వర్సిటీ/విద్యా సంస్థలో చేరాలంటూ పదే పదే వెంటపడి వేధిస్తే సందేహించాల్సిందే! సాధారణ సమయం కన్నా తక్కువ వ్యవధిలోనే కోర్సుల్ని పూర్తి చేయిస్తామని చెబుతుండటం. తక్కువ ఫీజులతో కోర్సుల్ని అందించడంతో పాటు, ప్లేస్మెంట్ హామీలు గుప్పించడం యూనివర్సిటీలో సిబ్బంది, అందించే కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచకపోవడం వంటి అసాధారణ లక్షణాలను గమనిస్తే అప్రమత్తంగా ఉండటమే మేలు. ఇలా చేయండి.. మీరు చేరాలనుకొంటున్న వర్సిటీ విశ్వసనీయతను తెలుసుకొనేందుకు ఆ కాలేజీలో చదువుతున్న, పూర్వ విద్యార్థులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం. యూజీసీ అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు సందర్శించి అప్డేట్స్ చెక్ చేసుకోవడం. నకిలీ యూనివర్సిటీలు చాలా వరకు క్యాంపస్ లేకుండా ఆన్లైన్లోనే పనిచేస్తుంటాయి. నిజమైన వర్సిటీలకైతే భవనాలు, ల్యాబ్లు, లైబ్రరీలు ఉంటాయి. అందువల్ల మీరు చేరాలనుకొనే విద్యాసంస్థ క్యాంపస్ని ఒకసారి సందర్శించి రండి. తక్కువ ఫీజులకే కోర్సులంటే తొందరపడి చేరిపోవద్దు. దానిపై కాస్త అధ్యయనం చేయండి. సామాజిక మాధ్యమాల్లో సంబంధిత వర్సిటీల రివ్యూలను చూడండి. ఆ వర్సిటీలు అందించే కోర్సులకు ఏఐసీటీఈ, న్యాక్ వంటి ఇతర సంస్థల గుర్తింపు ఉందో లేదో చెక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పాడి రైతులకు గుడ్ న్యూస్.. పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు!

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ అమరావతి : ఏపీలో పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ శుభవార్త చెప్పింది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే ప్రభుత్వం 80% శాతం రాయితీ అందిస్తుందని పేర్కొంది. ఈ బీమా మూడేళ్లు ఉంటుంది. 384 రూపాయలు రైతు చెల్లిస్తే మూడేళ్ళ పాటు వర్తిస్తుంది. దీంతో పశువులు అకాల మరణం చెందితే రూ.30 వేల రూపాయలు బీమా పొందొచ్చు.గొర్రెలు, మేకలకు ఏదైనా సరే ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే రూ.6000 రూపాయలు బీమా లభిస్తుంది. ఇప్పటికే పశువులకు 50% రాయితీతో దాణా అందించడం జరుగుతుందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్

సిగరెట్ కాలుస్తూ… 20 నిమిషాల్లో!

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ నిన్నటిదాకా సరదా సరదాగా సిగరెట్ కాలుస్తూ…రింగులు రింగులుగా పొగ వదులుతూ గడిపిన సుబ్బారావు పొగతాగడం మానేయాలని డిసైడయ్యారు. అయితే ఆయనకో అనుమానం… ఇన్నేళ్లుగా ఉన్న ఈ అలవాటును హఠాత్తుగా మానేస్తే ప్రయోజనం ఉంటుందా?.. అని. పొగతాగడం మానేశాక ఏం జరుగుతుందనే దానిపై ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనలు ఇలా చెబుతున్నాయి మానేయడానికి మార్గాలెన్నో… నోటితో నమిలే తక్కువ మోతాదు ఉన్న ‘నికోటిన్ బబుల్గమ్’ ద్వారా సిగరెట్లు తాగాలనే కోరిక క్రమంగా తగ్గించుకోవచ్చు. చర్మంపై అతికించే ‘నికోటిన్ ప్యాచెస్’ ప్లాస్టర్తో సిగరెట్ మానేస్తే ఎదురయ్యే తలనొప్పి, చిరాకులను దూరం చేయవచ్చు. సిగరెట్ అలవాటును దూరం చేసుకోడానికి నాసల్ స్ప్రే రూపంలో మందులున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘స్మోకింగ్ డీ అడిక్షన్’ వ్యవస్థ ఉంది. ఇక్కడి వైద్యులు ఉచితంగానే కౌన్సెలింగ్ చేస్తారు. సిగరెట్లు తాగే అలవాటు తీవ్రంగా ఉన్నవారు వైద్యుని ఆశ్రయిస్తే.. కొన్ని మందులు, ఇంజక్షన్ల రూపంలో డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. ప్రపంచంలో సుమారు 125 కోట్ల మంది ఏదో ఒక రూపంలో పొగాకు వినియోగిస్తున్నారు. సిగరెట్లకు అధిక సంఖ్యలో బానిసలవుతున్నారు. పురుషుల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంది. పొగ తాగే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఖమ్మం

ఖమ్మం బోనకల్ మధ్య రాకపోకలు బంద్

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా లో భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం నుండి బోనకల్ వెళ్లే రహదారి మీద రాక పోకలు నిలిచి పోయాయి. పందిల్లా పల్లి వద్ద వరద నీరు రోడ్డు మీద పెద్ద స్థాయిలో ప్రవహిస్తున్న కారణం గా రాక పోకలు నిలిచి పోయాయి.

జాతీయ అంతర్జాతీయ

నా రిటైర్‌మెంట్‌ ఎప్పుడనేది వారి చేతుల్లో లేదు: షమీ

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ నా రిటైర్‌మెంట్‌ ఎప్పుడనేది వారి చేతుల్లో లేదు: షమీ ఇప్పటికే ముగ్గురు సీనియర్‌ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత లిస్ట్‌లో వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. రెండేళ్ల కిందట చివరిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన షమీ.. అప్పటినుంచి జట్టులో స్థానం దక్కించుకోలేదు.

జాతీయ అంతర్జాతీయ

అమెరికాలో విద్యార్థి వీసాలకు ‘టైం లిమిట్‌

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ ఇప్పటికే సోషల్‌ మీడియా వెట్టింగ్, తదితర షరతులతో విదేశీ విద్యార్థులకు వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. ప్రస్తుతం మరో నిబంధనతో గుబులు రేపేందుకు సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి యూఎస్‌లో ఉండకుండా వీసా నిబంధనలను మార్చేందుకు చర్యలు చేపడుతోంది. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే.. అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు.

ఖమ్మం

విద్యా సంస్థ లకి నేడు సెలవు ప్రకటించిన కలెక్టర్

ఖమ్మం పున్నమి ప్రతి నిధి భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ని అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వ యేతర పాఠశాల లకి కళాశాల ల కి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి నేడు సెలవు ప్రకటించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.