Sunday, 10 May 2026

Blog

అన్నమయ్య

బి. కొత్తకోట: కాండ్లమడుగు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం

కొత్తకోట మండలంలోని కాండ్లమడుగు క్రాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గుర్తించారు. వెంటనే స్పందించి తన సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం తన సొంత వాహనంలో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మదనపల్లికి చెందినవాడిగా గుర్తించారు.

అన్నమయ్య

చిట్వేల్ బజారులో శునకాల ఉన్మాదం – ప్రజల్లో భయాందోళన …..పసిబిడ్డపై దాడితో ప్రజల్లో ఆగ్రహం; తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక

చిట్వేల్ పట్టణంలోని ప్రధాన బజారు వీధులలో వీధి శునకాల విర్రవీగింపు రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై ఎప్పుడెప్పుడు దాడి చేస్తాయోనన్న భయంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యాపార సమయాల్లో దుకాణాలకు వచ్చే కస్టమర్లు కూడా శునకాల భయంతో వెనక్కి తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల పది నెలల పసిబిడ్డపై శునకాల దాడి జరగడంతో చిన్నారి ఆసుపత్రి పాలైన ఘటన ప్రజలను మరింత భయాందోళనకు గురి చేసింది. చిన్నారి ప్రాణం బతికినా, ఈ సంఘటన పట్టణ ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించింది. “ఇక సహించలేము… పంచాయతీ శాఖ అధికారులు వెంటనే ముందడుగు వేసి శునకాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. లేకపోతే బజారు వ్యాపారాలు దెబ్బతింటాయి, ప్రజల ప్రాణాలు సురక్షితం కావు” అని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. చివరగా చిట్వేల్ ప్రజల ఏకగ్రీవ కోరిక – పంచాయతీ శాఖ తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ శునకాల సమస్యను పరిష్కరించాలి. జనజీవనాన్ని కాపాడేందుకు, పట్టణంలో శాంతి భద్రతలు నిలుపుదలకు పంచాయతీ శాఖ ఇప్పుడే కదలిక చూపాలని పట్టణ ప్రజలు వ్యాకులంగా కోరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

నాలుగు నెలలుగా చిట్వేల్ అడవుల్లో పెద్దపులి సంచారం-నాగార్జునసాగర్–శ్రీశైలం నుండి వచ్చిన పెద్దపులి – కెమెరాల్లో స్పష్టమైన ఆధారాలు

చిట్వేల్, ఆగస్టు 28 ( పున్నమి ప్రతినిధి):శివ అన్నమయ్య జిల్లా చిట్వేల్ టైగర్ ప్రాజెక్ట్ కారిడార్‌లో గత నాలుగు నెలలుగా పెద్దపులి సంచరిస్తోందని చిట్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధీరజ్ పెరుమాళ్ళ తెలిపారు. శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పగలు–రాత్రి పులి సంచారం దృశ్యాలు రికార్డైనట్టు ఆయన వెల్లడించారు. సోమశిల బ్యాక్ వాటర్, ఒంటిమిట్ట, రాజంపేట, చిట్వేల్, రాపూరు ప్రాంతాలు ఈ కేంద్ర పరిధిలో ఉన్నాయని చెప్పారు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు నుండి ఈ పులి చిట్వేల్ కారిడార్‌లోకి ప్రవేశించిందని తెలిపారు. ప్రస్తుతం అది ఇక్కడే సంచరిస్తుండగా, ఇంకా శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోకి వెళ్లలేదని వివరించారు. నాగార్జునసాగర్–శ్రీశైలం రేంజ్‌లో పులుల సంఖ్య 86 దాటిందని, అందువల్ల కొత్త పులులు విస్తరించి కారిడార్‌ మార్గంలో సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు రాత్రి ఒంటరిగా ప్రయాణాలు చేయకుండా, జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం. 4,472 కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకు ₹1,129 కోట్లను ఆమోదించిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఈ విలేజ్ క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటన . 4472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు రూ.1129 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో అధిక భాగం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్

కొవ్వూరు గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్సి కమీషన్ చైర్మన్ జవహర్..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు (ఆగష్టు 28) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విగ్నేస్వర ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు కొవ్వూరు వాటర్ ట్యాంక్, మెరక వీధి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్,మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్,ఆయన వినాయకుని దర్శించుకున్న తరువాత ఆ వినాయక స్వామి వారు రాష్ట్రాన్ని ,రాష్ట్ర ప్రజలను సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అన్నారు,ఆయన తో పాటుగా వారి తనయుడు కొత్తపల్లి ఆశిష్ లాల్ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా నల్లా పవన్

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అమలాపురం కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నల్లా పవన్ కుమార్ నియమితులయ్యారు. గురువారం పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన లిస్టులో ఆయన పేరు ఉంది. ఆయన ఇప్పటి వరకు జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గా పని చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారధ్యంలో డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాష్ట్ర పదాధికారిగా నల్లా పవన్ కు చోటు దక్కింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకరన్ మరియు పార్టీ నాయకులు నల్లా పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సొసైటీ అధ్యక్షుడు ఎస్. రాజా ను సన్మానించిన ఏఎన్ఆర్

సీతారామపురం ఆగస్టు (పున్నమి ప్రతినిధి) సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన సోమనబోయిన రాజశేఖర్(రాజా) ను గురువారం స్థానిక సొసైటీ కార్యాలయంలో సీతారామపురానికి చెందిన ఆది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆది నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మెట్ట ప్రాంతమైన సీతారామపురం మండలంలోని రైతుల అభివృద్ధికి రుణాలను అందించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు ఉత్తమ సేవలను అందించి సొసైటీ చైర్మన్ పదవికి వన్నె తీసుకువచ్చేలా సోమనబోయిన రాజశేఖర్ పనిచేశారని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కే. కిషోర్, గురు, శివ, కుశల్ పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పేదల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం రాజమండ్రిలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 13 మంది లబ్ధిదారులు రూ. 21,34,680 విలువైన ఆర్థిక సహాయం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “పేదవారి ఆరోగ్య రక్షణ కోసం సీఎం సహాయనిధి ఒక సంజీవనిలా ఉపయోగపడుతోంది. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ, పేదలకు మరింత చేరువగా ఉండే విధానాలను అమలు చేస్తోంది. పేదల ఆరోగ్య సంరక్షణే మా ధ్యేయం,” అని పేర్కొన్నారు. అలాగే, అవసరమైన సమయంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యంగా వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి ఎంతో సహాయకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసీపీ అధినేత వైయస్ జగన్, భారతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: సీతారామపురం మండల వైసిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి దంపతులు

సీతారామపురం ఆగస్టు (పున్నమి ప్రతినిధి) వైసిపి అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి దంపతులకు 29 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను సీతారామపురం వైసిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి సతీమణి సీతారామపురం మండల అధ్యక్షురాలు చింతం రెడ్డి పద్మావతి దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సుపరిపాలన తరాలు మారినా నిలిచి ఉంటుందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి పట్టం కట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ మంత్రి కాకాణి ని కలిసిన దుగ్గి రెడ్డి గురవారెడ్డి

సీతారామపురం ఆగస్టు(పున్నమి ప్రతినిధి) మాజీమంత్రి, వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులోని కాకాణి నివాసంలో గురువారం సీతారామపురం మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురువారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నెల్లూరు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటాలు కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దుగ్గిరెడ్డి గురవారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులను బనాయించినా న్యాయం వైఎస్ఆర్సిపి, కాకాణి గోవర్ధన్ రెడ్డి వైపు ఉండడంతో న్యాయస్థానాలు అన్ని కేసులలో బెయిల్ మంజూరు చేసిందని త్వరలోనే అన్ని కేసులలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. వైసిపి నాయకుల పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వైసిపి కార్యకర్తలు నాయకులపై కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు అక్రమ కేసులు లతో భయపెట్టాలనుకుంటే వైసీపీ కార్యకర్తలు మరింత ఉత్తేజంగా కసిగా పనిచేసి 2029 లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చేలా కష్టపడతారన్నారు. ఆయన వెంట దేవిశెట్టిపల్లి మాజీ సర్పంచ్ రేనాటి సుధాకర్ నాయుడు, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.