Sunday, 10 May 2026

Blog

తెలంగాణ

మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలల సందర్శనలను పెంచాలని ఆదేశించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ఈరోజు (గురువారం) జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు. ఎంఈఓలు పాఠశాలలను సందర్శించడంతోపాటు,విద్యార్థులలో విద్యాసామర్ధ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాలల తనిఖీ తో పాటు,పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలలకు మంజూరైన పనుల పురోగతి, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. కొన్ని పాఠశాలలో విద్యాబోధన చాలా బాగుందని, జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో మంచి విద్యను అందించేందుకు కృషి చేయాలని, వెనుకబడిన పాఠశాలల్లో పురోగతి తీసుకురావాలని అన్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తాను పాఠశాల సందర్శన సందర్భంగా ఆయా అంశాలలో విద్యార్థుల విషయపరిజ్ఞానాన్ని పరీక్షించడం జరుగుతున్నదని, అదేవిధంగా ఎంఈఓ లు సైతం పాఠశాలలను సందర్శించి సబ్జెక్టు నాలెడ్జిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

తెలంగాణ

నార్కెట్ పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన :జిల్లా కలెక్టర్

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈరోజు (గురువారం) ఆమె ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కుక్కకాటుకు గురైన వారికి రేబీస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ సహకారంతో కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తక్కువగా ఉన్నందున గ్రౌండింగ్ ను పెంచాలని చెప్పారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. కాగా నార్కెట్ పల్లి మండలంలో మొత్తం 308 మరణాలు సంభవించగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి 158 దరఖాస్తులు రావడం జరిగిందని,వాటిని పరిశీలిస్తున్నట్లు తహసీల్దార్, ఎంపీడీవోలు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

తిరుపతి

శ్రీకాళహస్తి లో వామపక్షాల నిరసన

శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు స్మార్ట్ మీటర్లు మా ఇంటికి వద్దు,కరెంటు అదనపు చార్జీలు రద్దు చేయాలని, పెట్టిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ మేరకు సిపిఎం నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ చార్జీలను పోరాటం చేసిన వారిపై లాఠీచార్జి చేసి కాల్పులు జరిపించారని,ఆ కాల్పుల్లో మరణించిన బాలస్వామి రామకృష్ణులు,విష్ణువర్ధన్ రెడ్డి మరణించారని వారి స్పూర్తితో,వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల ప్రక్రియను వేగవంతo చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె శాలిగౌరారం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి జాతీయ కుటుంబ ప్రయోజన కింద వచ్చిన దరఖాస్తులు వివరాలను ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, తహసిల్దార్ జమీరుద్దీన్ లను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ ఒకటి 2017 నుండి మండలంలో 176 మరణాలు సంభవించగా, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 73 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 23 దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని తహసిల్దార్ జిల్లా కలెక్టర్ కు వివరించారు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధిదారులకు మేలు చేకూర్చేందుకు గాను దరఖాస్తుల స్వీకరణ పరిశీలన ప్రక్రియలను వేగవంతం చేసి శనివారంలోగా ఆర్డిఓ ద్వారా ఆన్లైన్లో పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల తుది ఓటర్ జాబితా ప్రచురణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను ఎంపీడీవో జ్యోతిలక్ష్మి ద్వారా అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ శాలిగౌరారం నుండి ఊట్కూరు వెళ్లే రహదారిలో కాజువే పై నీరు ప్రవహిస్తుండగా పరిశీలించారు. అలాగే ఊటుకూరు నుండి బండమీదిగూడెం వెళ్లే రహదారి వద్ద కూడా రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నదని తెలుసుకొని పరిశీలించి పరిస్థితిపై నివేదిక సమర్పించాలని తహసిల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు.

తిరుపతి

దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం

తన ఐదేళ్ళ పాలనలో జగన్ రెడ్డి దివ్యాంగుల పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచకుండా మోసం చేయగా,ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచి దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచింది అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు. ఏ ఒక్క దివ్యాంగుడి పెన్షన్ తొలగించడం లేదని, అర్హులైన ప్రతీ దివ్యాంగుడికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానిది అని తెలిపారు.గత వైసిపి ప్రభుత్వంలో బోగస్ సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందిన అనర్హులను ఏరివేయడానికి చేపట్టిన తనిఖీ ప్రక్రియను తన ఫేక్ ప్రచారంతో అర్హులైన దివ్యాంగులలో గందరగోళం సృష్టిస్తున్న జగన్ రెడ్డి సైకో బృందం యొక్క అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారు

బి. కొత్తకోటలో జర్నలిస్టులకు కేటాయించిన 239 సర్వే నెంబర్ లో కొంతమంది బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారని జర్నలిస్టులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ భావజాన్ మాట్లాడుతూ, 239 సర్వే నెంబర్ లో 1.15 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి అని, దీనిలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. గతంలో ఈ సర్వే నెంబర్ పై కొందరు అక్రమంగా ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారని, వాటిపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామని ఆయన పేర్కొన్నారు.

అన్నమయ్య

రాయచోటి: రూ. 71. 24 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు సిఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను 62 మంది లబ్ధిదారులకు 60. 24 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది. అలాగే ఇద్దరు ఎల్ ఓ సి బాధితులకు రూ. 11 లక్షలు చెక్కులు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు.

అన్నమయ్య

రాయచోటి లో రూ. 30. 00 లక్షల నిధులతో మరమ్మతు పనులు

రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రాయచోటి మాసాపేటలోని మాండవ్య నది మరమ్మతు మరియు సుందరీకరణ పనులకు గురువారం మంత్రి మండిపల్లి రూ.30 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రాయచోటి మున్సిపాలిటీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

అన్నమయ్య

విద్యుత్ చార్జీల పెంపుపై వామపక్షాల నిరసన

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరులో గురువారం సిపిఎం, సిపిఐ, వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆప్ చార్జీలు, విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించాలని నిరసన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కదిలించిన చలో అసెంబ్లీ విద్యుత్ ఉద్యమానికి ఆగస్టు 28, 2000 నాటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య పేర్కొన్నారు.

అన్నమయ్య

650 కుటుంబాలు టీడీపీలో చేరిక

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంది. పాటూరు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులు, గ్రామ నాయకులతో సహా 650 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ, కందులవారి పల్లి, చిట్వేల్ గ్రామాల్లో జరిగిన ఈ చేరికలకు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వం వహించారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.