585 మార్కులతో మెరిసిన శివప్రతాప్‌కు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన సన్మానం
కొండాపురం మండలం కొమ్మి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి వినుకొండ శివప్రతాప్ పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 585 మార్కులు సాధించి గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శివప్రతాప్ స్వగృహానికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా పట్టుదల, క్రమశిక్షణతో చదివితే అత్యున్నత విజయాలు సాధించగలరని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

585 మార్కులతో మెరిసిన శివప్రతాప్‌కు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన సన్మానం
585 మార్కులతో మెరిసిన శివప్రతాప్‌కు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన సన్మానం కొండాపురం మండలం కొమ్మి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి వినుకొండ శివప్రతాప్ పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 585 మార్కులు సాధించి గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శివప్రతాప్ స్వగృహానికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా పట్టుదల, క్రమశిక్షణతో చదివితే అత్యున్నత విజయాలు సాధించగలరని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

