Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఈరోజు29.8.25 వెంకటాచలయం అక్షర విద్యాలయం నందు తెలుగు దినోత్సవం మరియు స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు.

ఈరోజు ఉదయం అక్షర విద్యాలయం నందు తెలుగు భాషా దినోత్సవం మరియు స్పోర్ట్స్ డే నిర్వహించినారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించార. మొదటిగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ దేశభక్తి గీతం విద్యార్థులు ఆలపించినారు తదుపరి శ్రీకృష్ణదేవరాయల తెలుగు స్క్రిప్ట్ విద్యార్థులు చక్కగా అభినయించినారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రియా జాకబ్ గారు వైస్ ప్రిన్సిపల్ మంజుల గారు తెలుగు అధ్యాపకులు మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొని కార్యక్రమము జయప్రదం చేసినారు.end

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నెం. X-98 అప్పనపల్లి లో అవగాహన సదస్సు

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం అప్పనపల్లి లో నెం. X-98 అప్పనపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి॥, అప్పనపల్లి కంప్యూటరైజేషన్ పై అవగాహన సదస్సు జరిగింది. కంప్యూటరైజేషన్ పై అవగాహన కార్యక్రమంపై సి ఇ ఓ గిడుగు శ్రీరాములు మాట్లాడుతు అప్పనపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మనమందరం కలిసి ముందు తీసుకోని వెళ్ళాలి లోన్స్ అలాగే పంట పొలంలకు ఎరువులు మీద రైతులకు ఏవిదంగా ఉపయోగ పడతాయో సి ఇ ఓ శ్రీరాములు హాజరైనా రైతులకు మరియు కమిటీ సభ్యులకు వివరాలు తెలియ చేశారు. ఈ సంఘం నకు ముఖ్యంగా ఛైర్ పర్సన్ కామిశెట్టి వెంకట్రావు, పాటి గోవిందరావు, తులా ఆదినారాయణ పర్సన్లు, స్టాప్ వై వి సత్య శ్రీధర్, గెడ్డం లెనిన్ బాబు మరియు అప్పనపల్లి గ్రామ రైతులు పాల్గున్నారు.

తూర్పు గోదావరి

రంపచోడవరం నియోజకవర్గంలో 390 బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల నిర్మాణం పూర్తి: మరో 27 టవర్ల పనులు ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే దిశగా కీలక అడుగులు పడ్డాయి. నియోజకవర్గంలోని 11 మండలాల్లో మొత్తం 390 బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల నిర్మాణం పూర్తయినట్లు జిల్లా ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ శ్రీ పలివెల రాజు వెల్లడించారు. అంతేకాకుండా, మరో 27 టవర్ల నిర్మాణ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కో టవర్‌ నిర్మాణానికి దాదాపు రూ. కోటి వ్యయం అవుతుందని పేర్కొన్నారు. రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి, రాజవొమ్మంగి, లగారాయి, దురనాథర్ గ్రామాల్లో ఇప్పటికే టవర్లు ఉన్నప్పటికీ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అదనంగా మరో 34 టవర్లు నిర్మించినట్లు తెలిపారు. ఈ కొత్త టవర్ల ద్వారా నెలకు కనీసం రూ. 10 లక్షల ఆదాయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టవర్ల నిర్మాణ బాధ్యతలను పిసిబి.బి. టెక్ అనే సంస్థకు అప్పగించినట్లు శ్రీ రాజు తెలిపారు. ప్రతి టవర్ వద్ద నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా ఆయన కోరారు.

నిర్మల్

*అధికారులు అలర్ట్ గా ఉండాలి ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని . న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలు ఉంటే అక్క‌డ రాక‌పోక‌లు నిషేధించాల‌ని సూచించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని శ్రీ భోస్లె నారాయణ్ పటేల్ గారు సూచించారు.

భక్తి

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కొత్త నిబంధనలు.

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ విజయవాడ : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు. సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దర్శనాలకు రావాలని నిబంధన. అమ్మవారి ఆలయ ఆవరణలో సెల్‌ఫోన్‌ వాడకంపై నిషేధం. భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు. కీలక ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖా

భక్తి

సెప్టెంబర్ 7న తాత్కాలికంగా తిరుమల ఆలయం మూసివేత

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ తిరుమల : చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేలు తో మీ పని తీరుమార్చుకోవాలి! పవన్ కళ్యాణ్!

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ విశాఖపట్నం: మీ పనితీరంతా ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నా. నివేదికలన్నీ ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తూనే ఉంది. కచ్చితంగా పనితీరు మార్చుకోవాలి. కార్యకర్తలకు చేరువగా ఉండాలని గుర్తు పెట్టుకోండి. ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారంటే మీ నియోజకవర్గం నుంచి ప్రభుత్వం వరకు మీరు వారధులుగా ఉంటారన్న ఆకాంక్షతోనే’ అని జనసేనాని పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలతో పేర్కొన్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి పనితీరు నివేదికలు ఇచ్చి సమాధానాలు కోరినట్లు తెలుస్తోంది. ‘పదవులు రాలేదు.. పదవులు రాలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. పదవుల వ్యామోహంలో పడి మన మూలాలను మర్చిపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వేగంగా పెరుగుతున్న భద్రాచలం వద్ద గోదావరి

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం.. ఈరోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 37 అడుగుల వరకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల ఇంకా నీటిమట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జలాశయంలోని 24 గేట్లు వదిలి 57 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. వరద కారణంగా శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం భారీగా పెరగడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

క్రైమ్

ఏసీబీ వాలలో మరో అవినీతి అధికారి.

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ గుంటూరు జిల్లా: గుంటూరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఐపీవో. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు జెడ్పీ ఐపీవో ముత్తి శ్రీనివాసరావు. పరిశ్రమల శాఖలో ఐపీవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు. పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు లక్ష డిమాండ్. బాధితుడు మండేపూడి కమలాకర్ తో తొలుతగా 30వేలు ఇచ్చేందుకు ఒప్పందం. జడ్పీ ప్రాంగణంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ఐపీవో శ్రీనివాసరావు. అదే సమయంలో దాడి చేసిపట్టుకున్న ఏసీబీ అధికారులు.. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.

ఆంధ్రప్రదేశ్

ఉల్లి కొనుగోళ్లపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష.

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున ఉల్లి కొనుగోలు చేయాలని ఆదేశం. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచన. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలన్న సీఎం చంద్రబాబు. రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలి. పంట ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి. రైతుబజార్ల సంఖ్య పెంచడంతో పాటు ఆధునీకరణ చర్యలు చేపట్టాలి : సీఎం చంద్రబాబు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.