Sunday, 10 May 2026

Blog

అన్నమయ్య

650 కుటుంబాలు టీడీపీలో చేరిక

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంది. పాటూరు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులు, గ్రామ నాయకులతో సహా 650 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ, కందులవారి పల్లి, చిట్వేల్ గ్రామాల్లో జరిగిన ఈ చేరికలకు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వం వహించారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

అన్నమయ్య

650 కుటుంబాలు టీడీపీలో చేరిక

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంది. పాటూరు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులు, గ్రామ నాయకులతో సహా 650 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ, కందులవారి పల్లి, చిట్వేల్ గ్రామాల్లో జరిగిన ఈ చేరికలకు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వం వహించారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

అన్నమయ్య

బషీర్ బాగ్ అమరులకు ఏఐటీయూసీ ఘన నివాళి

ఓబులవారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేట పారిశ్రామికవాడలో ఏఐటియుసి త్రివేణి కార్మిక సంఘం గురువారం ఆగస్టు 28, 2000న హైదరాబాద్ బషీర్ బాగ్ లో జరిగిన కాల్పుల్లో అమరులైన కార్మికులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు షరతులు అమలు చేస్తూ విద్యుత్ చార్జీలను భారీగా పెంచారని, దానిని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఉద్యమించాయని తెలిపారు.

అన్నమయ్య

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

రాజంపేట ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గురువారం బోయినపల్లిలో అధికారులను హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు మేలు జరగాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో లాగా పథకాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అన్నమయ్య

పలు వినాయక మండపాలని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు పట్టణంలోని కొత్తబజార్ మరియు నరసరాంపేటలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు గురువారం సందర్శించారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు బత్యాలని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అన్నమయ్య

వినాయక మండపాలను తనిఖీ చేసిన ఏఈ

సుండుపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) సుండుపల్లి మండలంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక స్వామి మండపాలను విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్, విద్యుత్ శాఖల అనుమతి కోసం 182 ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని గురువారం సూచించారు. మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సంఘటనలు జరిగితే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు.

అన్నమయ్య

మదనపల్లిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి స్పాట్ డెడ్

మదనపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) గురువారం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి సమీపంలోని నాలుగు లైన్ల రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 35 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం బైకును ఢీ కొట్టి వెళ్లిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు, పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.

అన్నమయ్య

సానుకూల స్పందనల వల్ల జిల్లాలో పెట్టుబడులు సాధ్యం

రాయచోటి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి) భారత ప్రభుత్వం నిర్వహించిన సులభతర వ్యాపారంపై సర్వేలో సానుకూల స్పందనతో, రాష్ట్రానికి, అన్నమయ్య జిల్లాకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, వ్యాపార సౌలభ్యానికి జిల్లా యంత్రాంగం చేయూతనిస్తుందని మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి తెలిపారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024 అవుట్ రీచ్ కార్యక్రమం జరిగింది.

అన్నమయ్య

బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమం పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తాం

రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 28, 2000న విద్యుత్ చార్జీలు తగ్గించాలని అమరులైన వారి స్ఫూర్తితో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో రాయచోటిలో ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూడౌన్ పేరుతో ధరలు తగ్గిస్తామని ప్రకటించి, ఆపై ట్రూ అప్ పేరుతో మరో రూ. 12,771 కోట్లు భారాన్ని మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు

అన్నమయ్య

రూ. 3. 50కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ

రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో 3.50 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న 36 అభివృద్ధి పనులకు, సిమెంటు రోడ్లు, డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు కూడా పెద్దపీట వేస్తుందని, రాబోయే రోజులలో రాయచోటి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.