Sunday, 10 May 2026

Blog

E-పేపర్

జాతీయ ప్రతిభ పురస్కార అవార్డులకు ఎంపికైన నంద్యాల బాల అకాడమీ ఉపాధ్యాయులు

గుంటూరు సదరన్ ప్రవేట్ లెక్చరర్, టీచర్ ఆర్గనైజేషన్, కేవిఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రవేట్ టీచర్స్, లెక్చరర్ కి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (టీచర్స్ డే) సందర్భముగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ పురస్కారాలు ప్రకటించనున్నారు.ఈ జాతీయ అవార్డుకు నంద్యాల స్ధానిక బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్,మ్యాథ్స్ ఉపాధ్యాయులు వి.లక్ష్మీనారాయణ మరియు తెలుగు ఉపాధ్యాయులు యం.సురేష్ బాబు లకు ఈ అవార్డులు అందించనున్నారు ఈ వేడుక ఈ నెల 31 వ తేదీన గుంటూరు లోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ ప్రతిభ అవార్ధులకు ఎంపికైన ఉపాధ్యాయులను పాఠాశాల డైరెక్టర్ యం.జీ.వి. రవీంద్రనాద్ మరియు ప్రిన్సిపాల్ మాధవి లత మరియు ఉపాధ్యాయులు, విద్యార్ధులు అభినందనలు తెలియజేశారు.

E-పేపర్

మంత్రి సవిత ను కలిసిన కురుబ సంఘం నేతలు

తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం నందు *రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవిత* ను కలిసిన చిత్తూరు కురబ సంఘం నాయకులు. తన తండ్రి కీర్తిశేషులు ఎస్ రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం తిరుపతిలో కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహం కోసం గతంలోనే 8 లక్షల రూపాయలు మంత్రి సవితమ్మ గారు కురుబ కులస్తులకు అందజేశారు. సందర్భంగా త్వరలో ప్రారంభించబోయే శ్రీ భక్త కనకదాసు విగ్రహ ప్రారంభోత్సవం గురించి మంత్రి సవితమ్మతో చర్చించిన కురుబ సంఘం నాయకులు…

తిరుపతి

చందనాలంకారంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ విజ్ఞానగిరి పై వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.తరువాత పలురకాల పుష్పాలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చందనాలంకారం చేసి విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు.

తెలంగాణ

గట్టుప్పల్ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) గట్టుప్పల్ లోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను ఆమె,పరిశీలించి విద్యార్థులకు చాక్లెట్ పంపిణీ చేశారు. అనంతరం గట్టుప్పల్ లో నూతనంగా నిర్మిస్తున్న వైద్య ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను,కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

ఖమ్మం

దంచి కొడుతున్న వాన..

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరము లో మంగళవారం ఉదయం నుండి చిన్న గా మొదలైన వాన సాయంత్రం నుండి దంచి కొడుతుంది. దీనీతో వినాయక చవితి పండుగ సం దర్భముగా పూజ సామాగ్రీ కొనుగోలు చేసే వారు, అమ్మే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరుపతి

ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనికీలు..

శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో ఎరువులు పక్క దారి పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎరువులు అధిక ధరలకు విక్రయించ రాదన్నారు.అనంతరం దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ ఏ డి ఏ (పి పి), డి ఎ వో ఆఫీస్ తిరుపతి ధనంజయ రెడ్డి,ఏడిఏ రమేష్ రెడ్డి,రెండో పట్టణ సీఐ నాగార్జున రెడ్డి,ఏవో మమతారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Blog E-పేపర్ తెలంగాణ నిర్మల్ విద్య విజ్ఞానం

క్రీడా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వండి..

నిర్మల్ జిల్లా 26ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ఈనెల 29న మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి అంబేద్కర్ మినీ ట్యాంక్ బండ్ వరకు వెళ్లి మళ్లీ తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీగా వచ్చే కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్ క్రీడాకారులు పీడి/పీఈటీలు ఉత్సాహవంతులు ర్యాలీలో పాల్గొనాలని జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. గత సంవత్సరం సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం సైతం ఉంటుందని తెలిపారు.

E-పేపర్ ఆదిలాబాదు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ తెలంగాణ నిర్మల్

అక్రమ సంబంధం.. కట్ చేస్తే..!! ఏం జరిగిందో తెలిస్తే షాక్..!

నిర్మల్ జిల్లా 26-ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) (గైని భోజన్న):- వేదమంత్రాల సాక్షిగా ఏడు అడుగులు వేసి కలకాలం ఒకరికొకరు తోడుంటామని చెప్పి పెళ్లితో ఒక్కటయ్యే భార్య భర్తల జీవితం మనిషి జన్మలో మలుపు తిప్పే మరో అద్భుత ఘట్టం అని అంటారు. కానీ నేటి కాలంలో జరుగుతున్న భర్తలను భార్యలు హత్య చేస్తున్న ఘటనలు చూస్తుంటే సమాజం అసలు ఎటువైపు వెళుతుందో ఎవరికి అంత చిక్కడం లేదని చెప్పక తప్పడం లేదు. అక్రమ సంబంధానికి అడ్డుగా నిలిచాడన్న నెపంతో తన భార్యే తన చావుకు కారణం అవుతుందని తను అనుకోకుని ఉండకపోవచ్చు అలా తన భార్యే భర్తను చంపిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్ గ్రామానికి చెందిన హరి చరణ్, నాగలక్ష్మి దంపతులు అన్యోన్య దాంపత్యాన్ని గడిపినప్పటికీ మూడో వ్యక్తి వారి జీవితంలోకి అడుగు పెట్టాడు. దీంతో భర్త హరిచరణ్ భార్య మరియు తర్వాత వచ్చిన ఆ మూడో వ్యక్తి ద్వారా చనిపోతాడని అనుకోలేదు కాబోలు. ఎందుకంటే భార్య నాగలక్ష్మి కి అదే గ్రామానికి చెందిన మహేష్ అనే ఆ మూడో వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం కాస్త వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీయడంతో అడ్డుగా ఉన్న భర్త హరిచరణ్ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్న భార్య నాగలక్ష్మి, తన ప్రియుడు మహేష్ తో కలిపి ఈనెల 22వ తేదీన భర్త మెడకు టవల్ ఉరివేసి చంపి బాత్రూం లో మూర్ఛ వ్యాధి వచ్చి చనిపోయి ఉండవచ్చని అందరినీ నమ్మించింది. కట్ చేస్తే విషయం తెలుసుకున్న కొడుకు కృష్ణ తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన అంత్యక్రియలకు హాజరయ్యాడు. తండ్రి చనిపోయాడు అని మాత్రమే తెలుసుకున్న కృష్ణకి విషయం అర్థం కాకపోవడంతో అంత్యక్రియలు సైతం నిర్వహించుకున్నారు. ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ మాట్లాడే తన తండ్రి హరిచరణ్ కి మూర్ఛవ్యాధి లేకపోవడం అది కూడా బాత్రూంలో మూర్చ వ్యాధి రావడం ఏంటని ఆలోచించినా కృష్ణ తన తల్లి నాగలక్ష్మిని గట్టిగా నిలదీశాడు. అయినా ఫలితం లేకపోవడంతో తన తండ్రి మృతి పై అనుమానం ఉందని పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు తమదైన శైలిలో నాగలక్ష్మి విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని నాగలక్ష్మి మరియు మహేష్ ఇద్దరం కలిసే టవల్ తో హరిచరణ్ మెడకు ఉరిబిగించి బాత్రూంలో మూర్ఛ వ్యాధితో చనిపోయాడని నమ్మించామని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు మంగళవారం వారిద్దరిని అరెస్టు చేసి మీడియా ముందు ఉంచారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డ ఇరువురిని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏ.ఎస్.పి రాజేష్ మీనా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో ముఖ్యపాత్ర పోషించిన సోన్ సిఐ, ఎస్.ఐ గోపి లను అభినందించారు.

ఖమ్మం

జరా రైతుల గోడును పట్టించుకోండి

పున్నమి Daily న్యూస్ ప్రతినిథి.: T.Ravinder ఖమ్మం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ నాయుడు రాఘవరావు ప్రశ్నించడం జరిగింది*, *జరా రైతుల గోడును పట్టించుకోండి*. *లక్షల, వేల ఎకరాలలో సాగవుతున్న పామాయిల్ మొక్కలలో కాతకు రాని, పూతకు రాని*, *ఆఫ్ టైప్ మొక్కల గురించి రైతుల గోడును పట్టించుకోగలరు*. *రైతులు ఎంతో ఆనందంతో పామాయిల్ సాగుకు ఉపక్రమించటం జరిగింది*. *కానీ వారి ఆశలు అడియాసలైపోయినట్లుగా ఉంది*. *వాళ్లు సాగు చేస్తున్న భూములలో ఎక్కువ ఆఫ్ టైప్ మొక్కలు ఉండటం జరిగింది*. *టి ఎస్ ఆయిల్ ఫెడ్ నిర్లక్ష్యం అవినీతి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు* .*ఈ ఆఫ్ టైప్ మొక్కల గురించి రైతులు ఎక్కని ప్రభుత్వ కార్యాలయం లేదు, తిరగని ప్రజాప్రతినిధులు లేరు, తిరగని కోర్టులు లేవు*. *అయినప్పటికీ వారి సమస్య సమస్యగానే ఉంది*. *ఐదు, ఆరు సంవత్సరాలు చంటి పిల్లల లాగా పామాయిల్ మొక్కను పెంచిన రైతు కళ్ళల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయి*. *ఎప్పటికీ కాతకు రాదని, గెలలు రావని తెలిసి రైతులు భోరున విలపిస్తూ, లోలోన కుమిలిపోతున్నారు*. *రైతులు ఆఫీసులకు వెళ్ళినప్పుడు తూతూ మంత్రంగా ఎవర్నో కొంతమంది అధికారులను పంపించి సర్వే పేరుతో తత్సారం చేస్తున్నారే తప్ప రైతులకు జరిగిన మేలు శూన్యం*.*ఇవన్నీ తెలవనట్లుగా తెలంగాణ వ్యవసాయ శాఖ వ్యవహారిస్తోంది*. *ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అధికారులను పిలిపించి రైతుల భూములలో సర్వే చేపించి రైతులకు తగు నష్టపరిహారం ఇప్పంచవలసిందిగా కోరుతున్నాము*. *ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, రైతుల తరఫున పామాయిల్ ఆఫ్ టైప్ మొక్కల గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహించి , రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం అమని బిజెపి బిజెపి జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు డిమాండ్ చేసినారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కాట్రేనికోన మండలం లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనికి .

న్యూస్, ఆగస్టు 26 కాట్రేనికోన కాట్రేనికోన మండలం లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం యూరియ కొరత పై ఆకస్మిక తనికి చేయడం జరిగింది. ఇందులో భాగంగా పల్లంకురు గ్రామంలో రైతులను కలిసి చేపలు మరియు రోయల్ చెరువులో యూరియ వాడకం జరుగుతుంది అని ఆరా తీయడం జరిగింది. రైతులు ఇచ్చిన వాగ్మూలం మేరకు మండలంలో అటువంటి ఎరువులు ఏమి వాడకం లేదు అని తెలిసింది. అనంతరం కాట్రేనికోనలో గల శ్రీ వెంకట సుబ్రమణ్య ట్రేడర్లు నందు ఎరువులు నిల్వ, అమ్మకం, డివిటి మరియు పి ఓ ఎస్ నందు అప్డేషన్ తనికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజిలెన్స్ స్పై ఎస్ తాతారావు డి సి టి ఓ ఎం నవీన్ కుమార్ మండల వ్యవసాయ అధికారి బి. మృదుల గ్రామ మత్స్యశాఖ సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.