Tuesday, 14 April 2026
  • Home  
  • సేవా కార్యక్రమాలకు సమాజం తోడ్పాటు అవసరం-బృందమ్మ
- తిరుపతి

సేవా కార్యక్రమాలకు సమాజం తోడ్పాటు అవసరం-బృందమ్మ

తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలం శివనాదపాలెం గ్రామంలోని “అమ్మ అనాధ వృద్ధ మహిళల ఆశ్రమం” స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆశ్రమ నిర్వహణను అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. తోడు లేని వృద్ధ మహిళలకు ఈ ఆశ్రమం ఒక నిలువెత్తు నీడగా నిలుస్తూ, వారికి ఉచిత భోజనం, సంరక్షణ అందించడం అభినందనీయం అని అన్నారు. ఆశ్రమంలోని వృద్ధులను స్వయంగా పలకరించిన బృందమ్మ, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. సేవా దృక్పథంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రశంసిస్తూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, సేవా భావం కలిగిన దాతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.