శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, సామాజిక న్యాయం అందాలనే గొప్ప లక్ష్యంతో బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నం రెడ్డి, శివారెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, కంట ఉదయ్ కుమార్, భరత్ కుమార్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి-అంబేద్కర్ జయంతిలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి పిలుపు