*రాష్ట్ర విజిలెన్స్ కమిటీలో సీనియర్ కన్జ్యూమర్స్ యాక్టివిస్ట్ అరిగెల బలరామమూర్తి నియామకం*
అమలాపురం జులై 22
జిల్లా కోకోపేడ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ అరిగెల బలరా మూర్తి ని ఇటీవల రాష్ట్ర విజిలెన్స్ కమిటీలో మెంబర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులు అందిన సందర్భంగా ఆ ఉత్తర్వులను అమలాపురం శాసనసభ్యులు అయితాబుత్తుల ఆనందరావు చేతుల మీదుగా అరిగెల బలరామమూర్తి కి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్ మాట్లాడుతూ మరింత బాధ్యత వహించి వినియోగదారులకు న్యాయం చేయటంలో మీరు ముఖ్య భూమిక వహించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత నాలుగు దశాబ్దాలుగా కన్జ్యూమర్ యాక్టివిస్టుగా ఉంటూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం విశేష కృషి చేస్తూ అనేక సమస్యలను తీర్చి కన్జ్యూమర్స్ కు న్యాయం చేయటం మీ దక్షతకు నిదర్శనమని ఈ సందర్భంగా వాటిని అన్నిటిని ప్రభుత్వం గుర్తించి మిమ్ములను రాష్ట్ర కమిటీలో నియమించటం జరిగిందని శాసనసభ్యులు ఆనందరావు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు కుఅరిగెల బలరా మూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు
మరియు అమలాపురం జిల్లా కేంద్రంలో డిసి ఐసి సెంటర్ ఏర్పాటు చేయడంలో కృషి చేసిన ఎమ్మెల్యే ఆనందరావు కు ఆయనకృతజ్ఞతలు తెలియజేస్తూ, కన్జ్యూమర్స్ సమస్యల పరిష్కార ఫారం ఏర్పాటు చేయటానికి కూడా కృషి చేయాలనిఈ సందర్భంగా శాసనసభ్యులను బలరామ మూర్తి కోరారు .
ఈ సమావేశాంలో
జిల్లా కోకోఫెడ్ మరియు డిసిపిసి మెంబర్స్ బీ.వి.వీ. సత్యనారాయణ,
జీవీఎల్ఎన్ శర్మ, బి .వి. హనుమంతరావు, అమరేశ్వరరావు, ఆకుల దొరబాబు, నేలపూడి నాగభూషణం, కొత్తపేట ఉషా మేడం సిస్టర్స్, తదితరులు అరిగెల బలరామమూర్తి ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు సాహితీ వేత్త నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ బలరామమూర్తికి పదవి లభించడం వినియోగ హక్కుల పరిరక్షణకు మరో బలమైన అడుగని ఆయన అన్నారు. నిబద్ధతకు, నిజాయితీకి, అంకితభావానికి చేసిన సేవలకు దక్కిన రాష్ట్రస్థాయి గుర్తింపు ఈ పదవి అని ఆయన అన్నారు.

