తెలంగాణ భారీ వర్ష సూచన
పున్నమి ప్రతి నిధి తెలంగాణ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు కోరుతున్నారు
పున్నమి ప్రతి నిధి తెలంగాణ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు కోరుతున్నారు
రాజంపేట జిల్లా కేంద్రం సాధన ఉద్యమానికి మరింత బలంగా తోడ్పాటు లభించింది. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజును కలిసి అభినందనలు తెలుపుతూ, రాజంపేట జిల్లా కేంద్రం సాధనకు మద్దతు ఇవ్వమని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా జెఎసి చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాను ముందుంటానని జగన్ మోహన్ రాజు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, కార్యదర్శి సుభాష్, కోశాధికారి రవీంద్ర నాయుడు తదితరులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా కేంద్రం సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఆర్ అండ్ బి కార్యాలయంలో అన్ని పార్టీల నేతలతో ప్రత్యేక విస్తృత సమావేశం జరగనుందని, ప్రభుత్వం దృష్టికి వినతిపత్రాలు పంపుతామని ప్రభాకర్ నాయుడు తెలిపారు.
వినాయక చవితి నేపథ్యంలో… గణపతి కి చేసే 21 రకాల పత్రీ పూజ.. అందులో వినియోగించే పత్రీ.. వాటి యొక్క ఓషద గుణాలు. వినాయక చవితి రోజున 21 రకాల ఆకులతో విఘ్నేశ్వరుడిని పూజించడం సంప్రదాయం. ఈ పత్రి ఒక్కోటి ఒక్కో ఔషధ గుణాన్ని కలిగి మన శరీరానికి రోగనిరోధక శక్తి ప్రసాదిస్తుంది. 🍃 21 పత్రులు – వాటి ఔషధ గుణాలు 1️⃣ మాచీపత్రం (మాచిపత్రి) – దద్దుర్లు, తలనొప్పి, చర్మవ్యాధులు తగ్గిస్తుంది. 2️⃣ బృహతీ పత్రం (వాకుడాకు) – దగ్గు, జ్వరం, దంతధావనం, నేత్రవ్యాధులకు ఉపయోగం. 3️⃣ బిల్వ పత్రం (మారేడు) – మధుమేహం, కామెర్లు, జ్వరం, నేత్రవ్యాధుల నివారణ. 4️⃣ దూర్వా (గరిక) – గాయాలు, మొలలు, మూత్ర మంట, చర్మ వ్యాధులకు ఉపశమనం. 5️⃣ దత్తూర పత్రం (ఉమ్మెత్త) – చర్మవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు తగ్గిస్తుంది (విషపూరితం – జాగ్రత్తగా వాడాలి). 6️⃣ బదరీ పత్రం (రేగు) – జీర్ణకోశ వ్యాధులు, పిల్లల రోగనిరోధక శక్తి పెంపు. 7️⃣ ఆపామార్గ పత్రం (ఉత్తరేణి) – దంతధావనం, మొలలు, మూత్రపిండ రాళ్లు తగ్గించడానికి ఉపయోగం. 8️⃣ తులసి పత్రం – దగ్గు, జ్వరం, గాయాలు తగ్గించి రోగనిరోధక శక్తి పెంచుతుంది. 9️⃣ చూత పత్రం (మామిడి ఆకు) – చర్మవ్యాధులు, కీటక నివారణకు దోహదం. 🔟 కరవీర పత్రం (గన్నేరు) – కణుతులు, కీటక కాట్లకు ఔషధం. 1️⃣1️⃣ విష్ణుక్రాంత పత్రం – దగ్గు, ఉబ్బసం తగ్గించి జ్ఞాపకశక్తి పెంచుతుంది. 1️⃣2️⃣ దాడిమీ పత్రం (దానిమ్మ) – విరోచనాలు, గొంతు నొప్పి, చర్మవ్యాధులకు ఉపయోగం. 1️⃣3️⃣ దేవదారు పత్రం – జీర్ణకోశ వ్యాధులు, నేత్రవ్యాధులకు శ్రేయస్కరం. 1️⃣4️⃣ మరువక పత్రం (మరువం) – జీర్ణశక్తి పెంచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. 1️⃣5️⃣ సింధూర పత్రం (వావిలి) – జ్వరం, తలనొప్పి, ప్రసవానంతర ఇబ్బందులకు ఉపశమనం. 1️⃣6️⃣ జాజీ పత్రం – వాతనొప్పులు, నోటి పూత, చర్మ వ్యాధులు తగ్గిస్తుంది. 1️⃣7️⃣ గండకీ పత్రం (దేవకాంచనం) – కఫం, పొట్టవ్యాధులు, నులి పురుగుల నివారణ. 1️⃣8️⃣ శమీ పత్రం (జమ్మి) – కఫం, దంతవ్యాధులు, మూలవ్యాధుల నివారణ. 1️⃣9️⃣ అశ్వత్థ పత్రం (రావి) – జీర్ణశక్తి, జ్ఞాపకశక్తి పెంపు. 2️⃣0️⃣ అర్జున పత్రం (తెల్లమద్ది) – గుండె జబ్బులు, చర్మవ్యాధులు తగ్గిస్తుంది. 2️⃣1️⃣ ఆర్క పత్రం (జిల్లేడు) – కీళ్ళ నొప్పులు, చెవిపోటు, విరేచనాలు తగ్గిస్తుంది. ✨ వినాయకునికి 21 పత్రులు సమర్పిస్తే, అన్ని రోగాలు తొలగి, ఆయురారోగ్యం కలుగుతుందని విశ్వాసం.
నరసన్నపేట, శ్రీకాకుళం: స్థానిక మారుతీ నగర్ జంక్షన్‌లో ప్లాటినం 22 గుడ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ హితంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహాలను స్వీకరించారు. ఈ సందర్భంలో ప్లాటినం 22 గుడ్ ఫ్రెండ్స్ సభ్యులు తమ సామాజిక సేవా కార్యక్రమాల కోసం గుర్తింపు పొందారు. వీరికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా కెరీర్ ఫెయిర్ అవార్డు అందజేయబడింది. నిర్వాహకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో… మంచి పనికి మించిన పూజ లేదు మానవత్వానికి మించిన సంపద లేదు మనిషికి మరణం ఉంటుంది గానీ. మంచితనానికి మరణం ఉండదు అన్న నోబెల్ అవార్డు గ్రహీత,భారతరత్న మదర్ థెరిస్సా గారికి ఇవే మా ఘన నిజమైన ఘన నివాళులు అర్పిందాం అంటూ అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ N.రఘురామయ్య స్కూల్ పిల్లల చేత వందనం అభిషేకం చేయించారు. అనంతరం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ పిల్లలకు స్కూల్ అవర్ణంలో మదర్‌థెరిస్సా కి జన్మదిన శుభాకాంక్షలు !! (26th aug) తెలియ చెప్పుతూ… అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ పిల్లలకు మదర్‌థెరిస్సా ను గుర్తుకు తెస్తూ మదర్‌థెరిస్సా మానవత్వం మూర్తీభవించి మానవసేవే మాదవ సేవగా భావించి తన జీవితాన్ని చివరి వరకు అనాథసేవలకు అంకితం చేసిన మహోన్నత మహిళ మదర్‌థెరిస్సా. మదర్ అసలు పేరు ఆగ్నస్ గోన్‌షా బోజాక్షువు. యుగోస్లేవియా దేశంలో స్కోప్జి (ప్రస్తుతం ఇది మాసిడోనియా రాజధాని)అనే పట్టణంలో సామాన్య రైతు కుటుంబంలో 1910 ఆగస్టు 26న మదర్‌థెరిస్సా జన్మించింది నేడు మదర్ థెరిస్సా గారి జయంతి సందర్బంగా అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ N.రఘురామయ్య, మరియు టీచర్స్ బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ, షబ్బీర్ ర్ హుస్సేన్, Mఅనంత లక్ష్మి దేవి మదర్ థెరిస్సా గారికి ఇవే మా ఘన నిజమైన ఘన నివాళులు అర్పిచారు.
ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్ కార్డుతో ఉచిత బస్సు ప్రయాణం ఉండదని బస్సుల్లో దర్శనమిస్తున్న నోటీసులు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డులో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనే ఉండడంతో జీరో టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కండక్టర్లు ఆధార్ కార్డు అప్‌డేటెడ్ ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని బస్సులో కనిపిస్తున్న నోటీసులు ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రాలకు, మీసేవ కేంద్రాలకు పోటెత్తున్న మహిళలు తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్తున్న ఉన్నతాధికారులు.
నరసన్నపేట మండలం శ్రీరాంపురం వద్ద హైవే సర్వీస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డంతా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి. ప్రతిరోజూ వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ • అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి… • కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది… • నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్,మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది… • గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది… • అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది… • జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి… • బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది… • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే,పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది… • మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది… • బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది… • మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది… • దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది… • ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది… • అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది… • కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి… • మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు… • ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది… • బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది… • క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది… • మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం… • వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి… • అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది… • పుచ్చకాయలో ఉండే లైకొపీన్ గుండె,చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది… • సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి… • దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది. • ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి… • చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి… • కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు… • క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి… • యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది… • వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది… • పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి… • ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి… • ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది… • ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు… • జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది… • ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది… • నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి… • మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు… • మునగ కాయలు ఆకలిని పెంచుతాయి…
పున్నమి న్యూస్ ప్రతినిధి,, కలిగిరి ,ఆగస్టు 26: మీ భద్రత – మా బాధ్యత అంటున్న ఎస్సై ఉమా శంకర్..//// కలిగిరి మండల పోలీస్ వారి విజ్ఞప్తి కలిగిరి మండలంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి-భద్రత-సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ….. ఈ విధంగా తెలియజేశారు.గణేష్ విగ్రహప్రతిష్టాపన మరియు ఉత్సవాల సమయంలో అనుసరించవలసిన ముఖ్యమైన మార్గదర్శకాలు..వినాయకచవితి, ఉత్సవాలు,పోలీస్ ,విధ్యుత్ శాఖల అధికారుల అనుమతితో నిర్వహించాలి అనుమతి తప్పనిసరి: ఏవైనా గణేష్ మండపాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలంటే పోలీస్ నుండి అనుమతి తప్పనిసరి. ఆన్లైన్లో ganeshutsav.net ద్వారా అప్లై చేయాలి.మండపం స్థాపన రహదారి పైన, ట్రాఫిక్కు ఆటంకం కలిగించేలా ఉండరాదు, ఒక వైపు మాత్రమే ఏర్పాటు చేయాలి. గణేష్ విగ్రహాలను పర్యావరణ హితం దృష్టిలో ఉంచుకొని మాత్రమే పెట్టాలి. పాప్ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్), రసాయన రంగులు వాడటం మానుకోవాలి. గట్టి మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలి,మైక్ మరియు స్పీకర్లు ఉపయోగించడానికి ముందు సంబంధిత కలిగిరి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అనుమతి తీసుకోవాలి,ఉత్సవ ప్రాంగణంలో,ఉత్సవ కమిటివారు మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్దులకు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల ఉత్సవ కమిటివారు మండపం నందు త్రాగునీరు,అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాలి ఉత్సవ కమిటివారు మండపంలో విధ్యుత్ అలంకరణను జాగ్రతగా ఏర్పాటు చేసుకొనవలెను.ప్రతి రోజు రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు లౌడ్స్పీకర్లు వినియోగించరాదు,అశాంతి కలిగించే నినాదాలు, పాటలు మరియు మద్యం సేవించడం వంటి అనుమతి లేని కార్యక్రమాలకు పాల్పడరాదు.సి సి టీవీ మరియు సురక్షిత ఏర్పాట్లు: సీసీటీవీ లు 24×7 రికార్డింగ్ ఉండాలి. మండపాలు/ఉత్సవ ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ (నీరూ, ఇసుక) ఉండాలి. మంటలు పట్టే పదార్థాలు దాచరాదు.ప్రతి మండపంలో కనీసం ముగ్గురు వాలంటీర్లుఉండాలి, వారి కాంటాక్ట్ డిటైల్స్ స్థానిక పోలీసులకు ఇవ్వాలి.అత్యవసర సమయంలో 112 కు కాల్ చేయాలి.విగ్రహ నిమర్జన: అధికారులు సూచించిన ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిమర్జన. ఊరేగింపులు నిర్ణిత మార్గాల్లో, నిదానంగా సాగాలి పటాకులు నిషేధం మరియు నిమజ్జనానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలి ఉత్సవ కమిటివారు నిబంధనలు ఉల్లంఘించినపుడు అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా గణేష్ పండుగను సురక్షితంగా, పర్యావరణ హితంగా, శాంతియుతంగ జరుపుకోవాలని కలిగిరి ఎస్ఐ ఉమాశంకర్ కోరారు.
ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ ఏపీలో RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. 11,702మంది ఎంపిక కాగా, ఆగస్టు 31 లోపు విద్యార్థులు స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ తెలిపింది. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు అందుతుందని చెప్పింది. దీనికి సంబందించిన వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవచ్చని వివరించింది.