Sunday, 10 May 2026

Blog

రంగారెడ్డి

వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి,

పున్నమి: వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండు మైలారం గ్రామం మరియు మరియ యాచారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆధునిక R.O వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, సోమవారం ఈరోజు గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి వారి తో కలిసి ఈ RO వాటర్ ప్లాంట్ లను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ

నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపిన: మంత్రి

నల్గొండ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ప్రతీక్ పౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం (25/08/25) నాడు నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించగా రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై ఈ యూనిట్ ద్వారా పరిసర ప్రాంత ప్రజలు లబ్ధి పొందాలని కోరారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డ్లు పంపిణీ

శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధి నందు గల 11 వ నెంబరు గల రేషన్ దుకాణం నందు నూతనముగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డును శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ,శ్రీకాళహస్తి ఆర్టీవో భాను ప్రకాష్ రెడ్డి శ్రీకాళహస్తి తహసిల్దార్ చేతుల మీదుగా అర్హత కలిగిన రేషన్ కార్డు దారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డును అందించడం జరిగినది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్డును ఉపయోగించి రాష్ట్రంలో ఎక్కడైనా నిత్యవసర వస్తువులు తీసుకోవచ్చునని అలాగే,కొంతమందికి ఫింగర్ ప్రింట్ పడకుండా ఇబ్బంది అయ్యే వారికి ఈ కార్డు చాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో CSDT, VRO,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో ఏసీబీ దాడులు

పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం షో కాజ్ నోటీసు ఇచ్చి దాన్ని ఉపాసంహరించుకునేందుకు రూ 25 వేలు తన కార్యాలయం విద్యానగర్ లో తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు….

తిరుపతి

శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టేషన్లో న్యాయ విజ్ఞాన సదస్సు

శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా బాల్య వివాహ నిర్మూలన చట్టం గురించి అక్కడ ఉన్న ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది.బాల్య వివాహాల వలన అమ్మాయిలకు కలుగుతున్న ఇబ్బందులను గురించి ప్రముఖ న్యాయవాదులు వివరించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మునిచంద్రయ్య,వారి సిబ్బంది న్యాయవాదులు గుమ్మల్ల రాజేశ్వరరావు అరుణ్,శ్రీరామ్ మరియు కోర్టు సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

నకిరేకల్ పట్టణ సమస్యల గురించి వినతిపత్రం ఇచ్చిన బిజెపి నాయకులు

రాష్ట్ర బిజెపి కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో అనేక వార్డులలో ఉన్న సమస్యల గురించి మునిసిపల్ ఇంచార్జికి వినతిపత్రం సమర్పించిన బిజెపి పార్టీ అధ్యక్షులు మురళి మోహన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి బోనగిరి వెంకటేశ్వర్లు, సందుపట్ల వేణుమాధవ్, పందాల సైదులు గౌడ్ కారంగుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం పకృతిని కాపాడుదాం

యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులైన ఫౌండర్ డాక్టర్ గానుగ పెంట రమేష్,సంస్థ రాష్ట్ర అధ్యక్షులైన తాళిక్కాల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 6 సంవత్సరాలుగా ఉచితంగా 1000 కి పైగా పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కొరకై మట్టి వినాయక విగ్రహలు పంపిణీ కార్యక్రమం జరుపుతున్నామని, నియోజకవర్గం మొత్తం సంస్థ సభ్యులచే పలు ప్రాంతాలలో శిభిరాలను ఏర్పాటు చేసి ప్లాసర్ ఆఫ్ పారిస్ తో పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుంది కనుక ప్రజలంతా మట్టి విగ్రహాలనే పూజించాలని అవగాహన కల్పిస్తూ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగుతుందని మట్టి గణపయ్యే పర్యావరణ హితం అని సంస్థ ప్రతినిధులు తెలిపుతూ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఎలూరు

గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరగాలి

గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరగాలి ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరగాలని ఇందుకు అందరి సహకారం కావాలని ఎస్ఐ శుభ శేఖర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో లో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసులు, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ నుండి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మం

పర్యావరణాన్ని కాపాడండి మట్టి వినాయకుడిని పూజించండి

పున్నమి Daily న్యూస్ ప్రతినిథి:T.Ravinder ఖమ్మం మట్టి వినాయకుని వల్ల ప్రధాన ఉపయోగాలు పర్యావరణ పరిరక్షణ మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు సహజమైనవి పర్యావరణానికి హాని కలిగించు వీటిని నిమజ్జనం చేసినప్పుడు ఇవి పంచభూతాలలో కలిసిపోయి కాలుష్యాన్ని నివారించడంతోపాటు పాజిటివ్ ఎనర్జీని యాగాల ఫలితాలను ఇస్తాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు రంగులు రసాయనాలు మెరుపులు లేని మట్టి విగ్రహాలు నీటి వనరులను కలుస్తాం చేయవు మట్టి విగ్రహాలు అధికంగా జీవ అధోకరణం చెందుతాయి అంటే అవి సహజంగా కుళ్ళిపోయి పర్యావరణానికి హాని కలిగించవు మెరుగైన సమాజం కోసం మట్టి విగ్రహాలనే వాడాలని తెలియజేశారు అధ్యక్షుల వారితో సీనియర్ జిల్లా నాయకులు రవీందర్ మరియు జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్టు ప్రవీణ్ కుమార్ వైరా రోడ్ లో ఉన్న షాపులను సందర్శించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు

ఖమ్మం

పర్యావరణాన్ని కాపాడండి మట్టి వినాయకుడిని పూజించండి

మట్టి వినాయకుని వల్ల ప్రధాన ఉపయోగాలు పర్యావరణ పరిరక్షణ మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు సహజమైనవి పర్యావరణానికి హాని కలిగించు వీటిని నిమజ్జనం చేసినప్పుడు ఇవి పంచభూతాలలో కలిసిపోయి కాలుష్యాన్ని నివారించడంతోపాటు పాజిటివ్ ఎనర్జీని యాగాల ఫలితాలను ఇస్తాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు రంగులు రసాయనాలు మెరుపులు లేని మట్టి విగ్రహాలు నీటి వనరులను కలుస్తాం చేయవు మట్టి విగ్రహాలు అధికంగా జీవ అధోకరణం చెందుతాయి అంటే అవి సహజంగా కుళ్ళిపోయి పర్యావరణానికి హాని కలిగించవు మెరుగైన సమాజం కోసం మట్టి విగ్రహాలనే వాడాలని తెలియజేశారు అధ్యక్షుల వారితో సీనియర్ జిల్లా నాయకులు రవీందర్ మరియు జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్టు ప్రవీణ్ కుమార్ వైరా రోడ్ లో ఉన్న షాపులను సందర్శించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.