Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

*ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు కొత్త జిల్లాలు* – ఏర్పాటుకు వ్యూహరచన

అమరావతి, ఆగస్ట్ 25 ( పున్నమి స్టాప్ రిపోర్టర్ యామల రామమూర్తి): ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై మళ్లీ కసరత్తు మొదలైంది. ఇప్పటికే 26 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం మరో ఆరు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పరిపాలన సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధి, జనాభా సాంద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. *మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ప్రారంభం* కొత్త జిల్లాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు బృందాలుగా విభజమై జిల్లాల వారీగా పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించనుంది. 24 ఆగస్ట్‌ 29 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంత్రులు పర్యటనలు చేపట్టనున్నారు. 24 సెప్టెంబర్‌ 2న అల్లూరి జిల్లాలో కూడా అధ్యయనం కొనసాగనుంది. *ప్రతిపాదిత కొత్త జిల్లాలు* -అమరావతి జిల్లా – అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ -పలాస జిల్లా – పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం – మార్కాపురం జిల్లా – మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి -గూడూరు జిల్లా – గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట – మదనపల్లె జిల్లా – మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి -ఆదోని జిల్లా – ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ మార్పులు జరిగితే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది. *రాజకీయ & పరిపాలనా విశ్లేషణ* 2022లో వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26గా విభజించింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరో ఆరు జిల్లాలను పెంచాలని ముందడుగు వేసింది. అధికారికంగా ఇది పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పినా, రాజకీయ లెక్కలు కూడా ఈ నిర్ణయానికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం. *అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇంకా పెండింగ్* 2014లో అమలులోకి వచ్చిన రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కి పెంచే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా 2026 అక్టోబర్‌ నుంచి జనగణన చేపట్టాలని నిర్ణయించడంతో, ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని భావిస్తున్నారు. **తుది నిర్ణయం ఎప్పుడు..?* ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం పర్యటనలు, ప్రజాభిప్రాయ సేకరణతో ప్రక్రియ మొదలైంది. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త జిల్లాలు ప్రకటించబడితే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థలో మరోసారి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఆంధ్రప్రదేశ్

*విద్యుత్ తీగలు తగలడంతో పూర్తిగా దగ్ధమైన వరిగడ్డి*

నాయుడుపేట ఆగస్టు పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట మండలం వేముగుంటపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మడఫలం గ్రామం వద్ద రహదారిపై వరిగడ్డి లోడు తో వెళ్తున్న లారీ కి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగి లారీ లో ఉన్న వరిగడ్డి పూర్తిగా మంటలలో చిక్కుకుంది, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేసారు. వరిగడ్డి పూర్తిగా మంటలలో చిక్కుకుని దగ్ధమైంది.

E-పేపర్

అక్టోబర్ 5వతేదీ నుండి అనంతపురంలో స్టేట్ టోర్నీ “లీగ్” పద్దతిలో నాలుగు రోజుల పాటు టోర్నమెంట్

జెసాప్ మిత్రులకు గుంటూరు వేదికగా జెసాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీని నిర్వహించు కున్నాం. ప్రస్తుతం మరో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు అనంత పురం వేదికైంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్దం చేయడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలు నాకౌట్ పద్ధతిలో కాకుండా “లీగ్” పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓటమి చెందిన జట్టు ఒక మ్యాచ్ తోనే వెనుతిరగటంతో కొన్ని జట్లు నిరాశ చెందుతున్నందున ప్రతీ జట్టుకు ప్రతిభ ఆధారంగా మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో లీగ్ పద్ధతి ద్వారా మ్యాచులు నిర్వహించడం జరుగుతుంది. చాలా సమయం ఉంది కనుక టోర్నమెంట్ కి జిల్లా జట్లు సిద్ధం కావటానికి ఆస్కారముంటుంది. అనంతపురం లో ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీ జగదీష్,యుగంధర్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ టోర్నీ కోసం అనుమతులు తీసుకుని ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. కాబట్టి గెట్ రెడీ ఆల్ ది టీమ్స్ పి.ఎస్.ఎమ్.కృష్ణంరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ జెసాప్.

అన్నమయ్య

అంగరంగ వైభవంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ప్రతి సంవత్సరము రైల్వే కోడూరు నియోజక వర్గంలో ప్రతిస్టాత్మకంగా జరిగే పవన్ కళ్యణ్ గారి జన్మదిన వేడుకలు చిట్వేలిటౌన్ లో చేసేలా నియోజక వర్గ జనసేన పార్టీ తీర్మానించింది..ఈ సందర్బంగా వేదికగా అంబేద్కర్ సర్కిల్ లోని RK కల్యాణ మండపములో వేడుకలు జరిగేటట్లు ఈ ప్రాంగణమునకు “శ్రీ దామోదరం సంజీవయ్య” ప్రాంగణముగా నామకరణం చేశారు.. అతిరధ మహారధులతోపాటు NDA నాయకులు అతిధులు గా విచ్చేయనున్నారు ఈ సందర్బంగా పారిశుద్ధ కార్మికులకు మరియు గిరిజన మహిళలకు వస్తాల పంపిణి, గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు, మరియు కౌలు రైతులకు నగదు ప్రోత్సాహం, మెగా రక్తదాన శిబిరం,మొక్కల పెంపకం తదితర సేవాకార్యక్రమాలతో పాటు అన్నదానం, సత్కార కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు…. ఇన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుటకు గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, మరియు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గార్ల ఆధ్వర్యంలో వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని… చిట్వేలి మండలం జనసేన నాయకులు మాదాసు నరసింహ తెలియచేసారు.

E-పేపర్

ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిధులతో ఆర్ టీ సి ప్రయాణికులకు ఉచిత మినరల్ వాటర్.

నంద్యాల జిల్లా కేంద్రం లోని ఆర్ టీ సి బస్టాండ్ ఆవరణలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నిధులతో ఆర్ టీ సి కార్మికులు, ఉద్యోగులు, ప్రయాణికుల సౌకర్యం కోసం ఉచిత మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం జరుగుతుందని సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, ఆర్ టీ సి రీజనల్ మేనేజర్ రజియా సుల్తాన చెప్పారు. సోమవారం నంద్యాల ఆర్ టీ సి బస్టాండ్ ప్రాంగణంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నిధులతో చేపట్టే మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ప్రయాణికులు, కార్మికులు, ఉద్యోగుల కోసం మినరల్ వాటర్ ఫ్లాంట్ ఎంపీ డాక్టర్ శబరి మంజూరు చేయడం అభినందనీయం అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ సురేష్, టీడీపీ నాయకులు అజయ్, మనోజ్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

*పోరాటాల గడ్డ ముదిగొండ కొత్త నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం..!*

ప్రతిపాదిత నియోజకవర్గాల జాబితా (Delimitation 2027 తర్వాత ఖమ్మం జిల్లా – ఊహాత్మకంగా ఉండే అవకాశం..! 1. *ఖమ్మం* :-ఖమ్మం అర్బన్,రఘునాథపాలెం (ఖమ్మం రూరల్ బయటకు వెళ్లి పూర్తిగా పాలేరు లో కలిసిపోతుంది) 2.*పాలేరు* :-తిరుమలాయపాలెం,కూసుమంచి,ఖమ్మం రూరల్ (మొత్తం) 3.*ముదిగొండ* :-కొత్త నియోజకవర్గం (ఉదాహరణ పేరు – “ *ముదిగొండ* ” నియోజకవర్గం) నేలకొండపల్లి (పాలేరు నుంచి వేరవుతుంది) ముదిగొండ (మధిర నుంచి) చింతకాని (మధిర నుంచి) 4.*మధిర*:మధిర,బొనకల్,ఎర్రుపాలెం (మిగిలిన 3 మండలాలతో చిన్న పరిమాణం అవుతుంది) 5.*వైరా* (పెద్దగా మార్పు ఉండదు) వైరా, ఎంకూర్,కోనిజెర్ల,సింగరేణి జూలూరుపాడు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి) 6.*సత్తుపల్లి* (ప్రస్తుతంగానే ఉండే అవకాశం) సత్తుపల్లి,పెనుబల్లి,కాళ్లూరు,తళ్లాడ,వేమసూర్ ప్రస్తుత 5 స్థానాలు → 6 స్థానాలు అవుతాయి. ఎక్కువ మార్పు జరిగేది పాలేరు + మధిర పరిధుల్లోనే. ఖమ్మం Urban → ఒక “నగర కేంద్రిత నియోజకవర్గం”గా చిన్నదవుతుంది. ప్రస్తుత జనాభా ప్రకారం మాత్రమే ఒక అంచనా వేయడం జరిగింది, దీనిపై సమగ్ర విశ్లేషణ జరిగే అవకాశం ఉంది.

ఖమ్మం

BJP ఖమ్మం రెండవ పట్టణ పరిధిలో స్థానిక 51 డివిజన్లో పర్యటన

భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండవ పట్టణ పరిధిలో స్థానిక 51 వ డివిజన్లో 138 బూతులో భారతీయ జనతా పార్టీ నాయకుడు నక్క రవి గౌడ్ విస్తృత పర్యటనలో భాగంగా ఈరోజు పారిశుద్ధ కార్యక్రమాలు పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జవాన్ గారికి రోడ్డు పక్కన ఉండే గడ్డి తొలగించమని బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ప్రజలు రోగాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించడం జరిగింది

భక్తి

వినాయక చవితి ముహూర్తం

వినాయకచవితి 2025 ఎప్పుడు వచ్చింది తేదీ ముహూర్తం సమయాలు ✨ విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుడి జన్మోత్సవం ✨ 🌸 పండుగ తేదీ: ➡️ 2025 ఆగస్టు 27, బుధవారం ➡️ భాద్రపద శుక్లపక్ష చతుర్థి 🌸 తిథి వివరాలు: 📿 ఆగస్టు 26 మధ్యాహ్నం 1.54 గంటలకు ప్రారంభం 📿 ఆగస్టు 27 మధ్యాహ్నం 3.44 గంటలకు ముగింపు 🌸 పూజా శుభ ముహూర్తాలు: 🪔 ఉదయం 5.20 AM – 7.20 AM (సింహ లగ్నం) 🪔 ఉదయం 11.05 AM – 11.50 AM (వృశ్చిక లగ్నం) 👉 ఈ సమయాల్లో వినాయక పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. 👉 పర్యావరణ హితమైన మట్టి వినాయకుడు ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజ చేస్తే మరింత శుభ ఫలితాలు లభిస్తాయి. 🏵️ వినాయక మండపం వాస్తు 🏵️ ✅ గణనాథుడి ముఖం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. ✅ మండపం శుభ్రంగా, పవిత్రంగా ఉండేలా చూడాలి. 🌸 ఈ సంవత్సరం వినాయకుడిని సకల శ్రద్ధాభక్తులతో పూజించి, ఆయన అనుగ్రహం అందరిపై కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

అనంతపురం

వాల్మీకి బోయ సాంబ పైన దాడి.. ఫైర్ అయిన. బుల్లెట్ లింగమయ్య వాల్మీకి సంఘం

ము స్టోర్ సాంబ వాల్మీకి వాల్మీకుల మీద దాడి సామాజి వర్గానికి బీసీ చెందిన. పరామర్శించిన బుల్లెట్ లింగమయ్య వాల్మీకి సేవాదళ్. పుష్ప నారాయణ రెడ్డి. వాల్మీకి సంఘం ఆది. సురేంద్ర వాల్మీకి సంఘం. మధు వాల్మీకి సంఘం. మిగతా వాల్మీకి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున. భారీగా ముద్దాయిలని వీక్షించాలని డిమాండ్ చేశాడు అంతేకాకుండా పెద్ద ఎత్తున ఎస్పీ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ధర్నాకు జరుగుతాయి ముద్దాయిని కఠినంగా శిక్షించాలని వాల్మీకుల జోలికి వస్తే. గతంలో వాల్మీకులు జోలికొచ్చి ఎన్ని చిత్రహింసల నడిపించినారో తెలియనిది ఏం కాదు. వాల్మీకుల్ని బీసీలను అనగా తొక్కాలని చూస్తే మాత్రం ఊరుకోం మొత్తం బిసి వాల్మీకి సంఘాలు అన్నీ ఒకటే అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లా నుంచి తరిమి తరిమి కొడతామని. మొత్తం అన్ని సంఘాలు ఒకటే త్వరలోనే వాల్మీకుల మీద బీసీల మీద ఎక్కువ దాడి జరుగుతున్నాయి. ఈ విషయం మన మంత్రి నారా లోకేష్ అన్న దగ్గరికి మన సీఎం సార్ చంద్రబాబునాయుడు సార్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. బుల్లెట్ లింగమయ్య వాల్మీకి సంఘాలన్నీ ఒకటి త్వరలోనే ముద్దాయిలు కఠిన శిక్షణ శిక్షించాలని కోరడమైనది బిసి వాల్మీకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ జోలికి వస్తే మాత్రం కఠినంగా శిక్షించాలని వీలని పిడిఎఫ్ పెట్టి కడప జైలు కట్ట పెద్ద పెద్ద జైలుకు తరలించాలని కోరడమైనది . జై వాల్మీకి జై జై వాల్మీకి

ఆంధ్రప్రదేశ్

టిడిపి కార్యకర్త,కప్ప శ్రీనివాసరాజు పార్థివ దేహానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్../!

ఉదయగిరి పున్నమి న్యూస్ఆ ప్రతినిధి గస్టు 24 :/// ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కప్పా శ్రీనివాసరాజు గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం స్థానిక నాయకులు తెలియపరచగా వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు కప్ప శ్రీనివాసరాజు స్వగ్రామానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి, నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల నాయకులు గ్రామ నాయకులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.