Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కుడుములదిన్నేపాడు సొసైటీ చైర్మన్, బాసం నరసింహనాయుడు..!

వింజమూరు పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగష్టు 25 :/// కలిగిరి మండలం కుడుములదిన్నె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా భాసం నరసింహనాయుడు గారు నూతనంగా ఎంపికయ్యారు. ఆ పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట సొసైటీ డైరెక్టర్లు గా ఎంపికైన డబ్బుగుంట మాలకొండయ్య (బుజ్జయ్య), మార్తుల మాలకొoడా రెడ్డి , ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు, కలిగిరి మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, సీమల తాతయ్య, రావుల కొల్ల సర్పంచ్ పూసల వెంకప నాయుడు, ఏపీనాపి సర్పంచ్ వరప్రసాద్, తెల్లపాడు మాజీ సర్పంచ్ సుబ్బారావు,గన్నమనేని శ్రీనివాసులు, రోడ్డా మహేష్, పెద్దకొండూరు మాజీ సర్పంచ్ మొక్కా హాజరాత్ రావు, తదితరులు ఉన్నారు..

E-పేపర్

మట్టి వినాయకుల అవగాహన సదస్సును విజయవంతంగా జరిపిన బాల అకాడమి సిల్వర్ ఓక్స్ పాఠశాల

నంద్యాల జిల్లా లో బాల అకాడమి పాఠశాలలో 25-08-2025 వ తేదిన అనగా సోమవారం మట్టి వినాయకుల అవగాహన సదస్సునుఏర్పాటు చేయడము జరిగినది. ఈ కార్యక్రమము బాల అకాడమి పాఠశాలలో ఈనాడు మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ సంస్థ నుండి విచ్చేసిన రామకృష్ణ అధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు పాఠశాల డైరెక్టర్ రవీంద్ర నాథ్ కరస్పాండెంట్ మాధవీలత మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్న స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ సంస్థ అధికారి అయిన రామకృష్ణ చిన్నారులందరికి మట్టి వినా యకులను తయారు చేసి పంపిణి చేయడం జరిగినది. మరియు ప్లాస్టిక్ ఆఫ్ ఫారిస్ వల్ల కలిగే నష్టాలు మరియు అవి వాతవరణానికి కలిగించే నష్టాలని తెలిపి, మన ప్రకృతి, పర్యా వరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. మనదే అని, బాల అకాడమి పాఠశాల గత 10 || సం|| రాలుగా మట్టి వినా యకులను పంపిణి చేస్తున్నది. అని ఇందుకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక మైన ధన్యవాదాలు తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రణకు 8 కోట్లు!

ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం QR కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ & సరఫరా కోసం ₹8,00,00,000/- (8 కోట్లు) ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చింది. మొత్తం 1,46,21,223 కార్డులు ముద్రణ చేయడానికి ఆమోదం. కొత్త కార్డులు ప్రతి నెలా నిరంతరంగా ముద్రించబడతాయి…

ఆంధ్రప్రదేశ్

కార్ఫ్ కల్చర్ లో మెరుగైన యాజమాన్య పద్ధతులపై మత్స్య రైతులకు నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఆక్వా కల్చర్ విభాగంధర్వంలో రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం..///

నెల్లూరు, పున్నమి న్యూస్ ప్రతినిధి:ఆగస్ట్ 25 ://// కార్ప్ కల్చర్‌లో మెరుగైన యాజమాన్య పద్ధతులపై మత్స్య రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఈ రోజు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (KVK), ఆక్వాకల్చర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ శిక్షణలో ఆక్వా రైతులు పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విశ్రాంతి అధ్యాపకుడు డాక్టర్ నరసింహారెడ్డి గారు “స్ట్రెస్ మేనేజ్‌మెంట్” అంశంపై ప్రసంగించారు. వృత్తి సంబంధిత ఒత్తిడి ప్రతి రంగంలో అధికమవుతోందని, రైతులు శారీరక – మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం అత్యంత అవసరమని ఆయన సూచించారు. సమయపాలన, యోగా, ధ్యానం, సానుకూల దృక్పథం వంటి చర్యలు రైతుల పనితీరును మెరుగుపరుస్తాయని వివరించారు.తదుపరి సాంకేతిక సమావేశంలో శ్రీ హరి సాదు గారు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం, కేవీకే నెల్లూరు) “నీటి యాజమాన్య పద్ధతులు” అనే అంశంపై వివరించారు. ఆయన మాట్లాడుతూ చేపల జీవనమంతా నీటిపైనే ఆధారపడి ఉండటంతో నీటి నాణ్యత నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. చేపల పెంపకానికి అనుకూలమైన నీటి ఉష్ణోగ్రత 24–30 డిగ్రీల మధ్య ఉండాలి. నీటిలో కరిగిన ఆమ్లజనకం (DO) కనీసం 5 మి.గ్రా/లీ. కంటే తక్కువ కాకూడదు. పిహెచ్ విలువ 7.8–8.5 మధ్య, క్షారత్వం 50–150 మి.గ్రా/లీ. మధ్య ఉంటేనే చేపలకు అనుకూలమని తెలిపారు. అమోనియా, నైట్రైట్ స్థాయిలు అధికమైతే చేపలకు విషప్రభావం కలుగుతుందని, అందువల్ల అధిక ఆహారం వేయకూడదని, సమయానుకూలంగా నీటిని మార్చడం, గాలిమిశ్రమ యంత్రాలు (aerators) ఉపయోగించడం అవసరమని సూచించారు. పీహెచ్ సరిచేయడానికి సున్నం లేదా డోలోమైట్ వాడాలని చెప్పారు. అంతేకాకుండా, పంటకు ముందు చెరువును శుభ్రపరచి సక్రమంగా సిద్ధం చేయడం, సేంద్రియ ఎరువులు వేయడం ద్వారా plankton వృద్ధి జరుగుతుందని, ఇది చేపలకు సహజ ఆహారం అందిస్తుందని వివరించారు. నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించి తగిన చర్యలు చేపడితే చేపల వృద్ధి మెరుగై ఉత్పత్తి పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే రైతులు అంత ఏక ధాటిగా ఒక ప్లాట్ఫారం మీదకు వచి రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి వల్ల సంఘటిత శక్తిని పెంపొందించుకుని ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలని డాక్టర్ ఎస్ లోకేష్ బాబు గారు సూచించారు.ఈ శిక్షణ ద్వారా పాల్గొన్న రైతులు ఒత్తిడి నిర్వహణ పద్ధతులు, నీటి నాణ్యత పరిరక్షణలో తీసుకోవాల్సిన చర్యలపై విలువైన జ్ఞానం పొందారు. కేవీకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది..

E-పేపర్

బాల అకాడమి లో ద బెస్ట్ గా నిలిచిన ఇంగ్లీష్ పెస్ట్

నేడు ప్రపంచాన్ని నడిపిస్తున్న భాష ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది విద్య ,వృత్తి ,ప్రపంచ కమ్యూనికేషన్ మరియు సాంకేతికతలో ఉన్నత స్థాయి అవకాశాలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాన్ని పొందడానికి ఇంగ్లీష్ జ్ఞానం చాలా అవసరం ‌ విద్యార్థులు వారి జీవితంలో ఇంగ్లీషులో అనితర సాధ్యమైన ప్రతిభను కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కావలసిన నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ‘ ఐగో నివా ఫెస్టా’ అనే పేరుతో ఇంగ్లీష్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధవి లత ఏం రాజ్ కుమార్ రజియా ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ ప్రాధాన్యతను రాజ్ కుమార్ సార్ విద్యార్థులకు చక్కగా వివరించారు. విద్యార్థులు ఎన్నో ఉపన్యాసాలు స్టోరీస్, స్కిట్స్ ,నృత్యాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొదలకూరులో స్మార్ట్ కార్డులు పంపిణీ

*పొదలకూరులో స్మార్ట్ కార్డులు పంపిణీ..* ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు… *పొదలకూరు ఆగష్టు పున్నమి ప్రతినిధి* : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొదలకూరు తాసిల్దార్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొదలకూరు మండల అధ్యక్షుడు తలచిరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తుగ్లక్ ఆలోచనతో గత ప్రభుత్వం అందించిన రేషన్ కార్డులపై ఆ పార్టీ రంగులు ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటి టిడిపి ప్రభుత్వంలో అందజేస్తున్నటువంటి రేషన్ స్మార్ట్ కార్డులు ద్వారా ఎక్కడికి వెళ్ళినా కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ తో ఫోన్లో స్కాన్ చేయగా లబ్ధిదారుల వివరాలు తెలుసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డులు రూపొందించారని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ఈ స్మార్ట్ రేషన్ కార్డును బాధ్యతగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బక్కయ్య నాయుడు, సివిల్ సప్లై డిటి రవి, డిప్యూటీ తహసిల్దార్ సురేఖ, వీఆర్వో నాగమ్మ, అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి.. ఎస్సై హనీఫ్

గణేష్ మండపాలు ఏర్పాటకు అనుమతులు తప్పనిసరి.. ఎస్ఐ.. హనీఫ్.. పొదలకూరు: పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ ఐ హనీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ సేవ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఉత్సవాలను జరుపుకునేందుకు ముందుగా కమిటీ ఏర్పడాలన్నారు గణేష్ ఉత్సవాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తెలిపే సూచనలను సలహాలు పాటించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. డీజేలకు అసలీల నృత్యాలకు ఫైర్ కాకర్స్ కు అనుమతులు లేవని తెలిపారు. ముఖ్యంగా వినాయక మండపం ఏర్పాటుచేయ స్థలము నిమజ్జనం చేయు రోజు నిమజ్జనం చేసే ప్రదేశం పోలీసులకు తెలపాలని సూచించారు. గణేష్ మండపాలు వద్ద అగ్ని ప్రమాదం అరికట్టేందుకు కావలసిన వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

అన్నమయ్య

రాజంపేట పార్లమెంట్ విస్తృత సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి

రాయచోటిలోని సుధా కన్వెన్షన్ హాలులో రాజంపేట పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్ మోహన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ అభ్యర్థుల వినతులు స్వీకరించి, అధిష్టానం కు పంపనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇన్‌ఛార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ – “కార్యకర్తలే పార్టీకి పునాది. వారి త్యాగమే విజయాలకు కారణం. భవిష్యత్తులో కూడా కార్యకర్తల ఉత్సాహం పార్టీని మరింత బలపరుస్తుంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై నాగేశ్వర యాదవ్, కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా, ముక్కా రూపానంద రెడ్డి, జయచంద్ర రెడ్డి, చల్లా రామచంద్ర రెడ్డి, చామర్తి జగన్ మోహన్ రాజు, APKVIB చైర్మన్ కె.కె. చౌదరి, AP పాల్ ఎలెక్ట్రిక్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు, AP కార్పొరేషన్ చైర్మన్ వి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిట్వేలి టౌన్‌లో నిర్వహించాలని జనసేన పార్టీ తీర్మానించింది. అంబేద్కర్ సర్కిల్‌లోని ఆర్కే కల్యాణ మండపంలో జరిగే ఈ వేడుకలకు “శ్రీ దామోదరం సంజీవయ్య” ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు, గిరిజన మహిళలకు వస్త్రాల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, కౌలు రైతులకు ప్రోత్సాహం, మెగా రక్తదాన శిబిరం, మొక్కల పెంపకం, అన్నదానం, సత్కార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

E-పేపర్

సెప్టెంబర్ 13 ,14 వ తేదీలలో నంద్యాల జిల్లాలోనే జరగబోవు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక

నంద్యాల పట్టణంలో సెప్టెంబర్ నెల 13వ, 14వ తేదీలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ & నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు నెల 28 వ తేదీ గురువారం ఉదయం 9 గంటల కు శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి రాపిడ్ అండ్ బ్లిట్జ్ వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆగస్టు నెల 27 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబరు 9010451585. డాక్టర్.జి.రవికృష్ణ,అధ్యక్షులు జి రామసుబ్బారెడ్డి,కార్యదర్శి ఎం.పి.రాజేష్,టోర్నమెంట్ డైరెక్టర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.