Wednesday, 13 May 2026

Blog

ఖమ్మం

ప్రజలు అప్రమత్తం గా ఉండాలి.. బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి గత కొన్ని రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు. అవసరం అయితే తప్ప ప్రజలు బయట కి రావద్దు అని అయన కోరారు. ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అలాగే లోతట్టు ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రాలకి తరలించాలి అని అధికారులని కోరారు.

ఖమ్మం

ఖమ్మం నగరం లో కుండపోత వర్షం.

ఖమ్మం పున్నమి ప్రతినిధి బంగాళాకాతం లో ఏర్పడిన అల్ప పీడనం వల్ల తెలంగాణ లో పలు జిల్లా ల్లో కుండపోత వర్షం పడుతుంది. ఖమ్మం నగరం లో నిన్న టి నుండి మొదలైన వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఈ వర్షానికి విద్యసంస్థ లకి సెలవు ప్రకటించాలి అని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

పద్మావతి జూనియర్ కళాశాలలో ఘనంగా వినాయక చవితి పూజ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్థానిక పద్మావతి జూనియర్ కళాశాలలో వినాయక చవితి పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మరియు హాస్టల్ విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుని ప్రార్థించారు. ఉపాధ్యాయులు సైతం భక్తి నిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ –“వినాయక చవితి పండుగ మనందరికీ శుభ ప్రారంభానికి సంకేతం. విఘ్నేశ్వరుని ఆరాధనతో మన మార్గంలోని అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు ఈ పండుగ ద్వారా శ్రద్ధ, క్రమశిక్షణ, సద్గుణాలను అలవరచుకోవాలి. గణనాథుని ఆశీస్సులు అందరి జీవితాల్లో సుఖశాంతులు, విజయాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను” అన్నారు.పూజా కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ప్రసాదం పంపిణీ చేశారు

విద్య విజ్ఞానం

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌.. స్కూళ్లకు కీలక సూచన

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ ఆధార్ నెంబర్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దలే కాదు, చిన్నపిల్లలందరికీ ఆధార్ డేటా సరిగా ఉండటం చాలా అవసరం. కానీ పిల్లల విషయంలో అనేక మంది తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో UIDAI స్కూళ్లతో చేతులు కలిపి కీలక చర్యలకు సిద్ధమైంది. మనదేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ నెంబర్ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఇక పిల్లల విషయానికి వస్తే, ఆధార్ డేటా సరైనంగా ఉండడం మరింత అవసరం. అయితే చాలా మంది తల్లిదండ్రులు దీనిని సరిగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దీని గురించి స్కూళ్లను అలర్ట్ చేస్తూ, ఈ ప్రక్రియను ముందే పూర్తిచేయాలని కోరుతోంది. ఎప్పుడు అవసరం? UIDAI చెప్పింది ఏమిటంటే, పిల్లలు 5 సంవత్సరాల వయసు చేరినప్పుడు ఒకసారి, ఆ తరువాత 15 సంవత్సరాల వయసులో మళ్లీ ఒకసారి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. ఈ అప్డేట్ వల్ల పిల్లల ఆధార్ డేటాలో ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ వివరాలు కరెక్ట్‌గా నమోదు అవుతాయి. స్కూళ్లను ముందుకు తీసుకురావడం UIDAI ఇప్పుడు స్కూళ్లను ముందుకు తీసుకురావడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటోంది. స్కూళ్లకు సంబంధించిన విద్యా డేటాను నిర్వహించే UDISE+ అనే అప్లికేషన్‌లో విద్యార్థుల బయోమెట్రిక్ స్టేటస్ కనిపించేలా మార్పులు చేశారట. అంటే, స్కూల్ యాజమాన్యానికి వెంటనే తెలిసిపోతుంది. ఎవరి అప్డేట్ పెండింగ్‌లో ఉందనేది. ఎందుకు అవసరం ఈ అప్డేట్? ఇది ఆలస్యం అయితే పిల్లలు భవిష్యత్తులో ఎన్నో ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా NEET, JEE, CUET లాంటి కీలక పరీక్షలకు నమోదు చేసుకునే సమయంలో ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆ సమయానికి బయోమెట్రిక్ లోపం ఉంటే, అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇదంతా ఉండకూడదని అనుకుంటే ముందుగానే అప్డేట్ చేసుకోవడం మంచిది. 17 కోట్ల మంది పిల్లల ఆధార్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు 17 కోట్ల ఆధార్ నంబర్లు బయోమెట్రిక్ అప్డేట్ కోసం పెండింగ్‌లో ఉన్నాయట. ఇది చిన్న సంఖ్య కాదు. అందుకే UIDAI CEO భువనేష్ కుమార్ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాసి, స్కూళ్లలో ప్రత్యేక క్యాంపులుగా ఈ ప్రక్రియను నిర్వహించాలని కోరుతున్నారు.

జాతీయ అంతర్జాతీయ

17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు..

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు.. ఎన్నికల బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీపీ రాధాకృష్ణన్.. అధికారిక ప్రకటన చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. ఓట్ల లెక్కింపు అదేరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. ఓట్ల లెక్కింపు పూర్తవగానే ఫలితం ప్రకటన.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఈ నెల 28న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు – జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 8500844365 ఏర్పాటు చేయడం జరిగిందని, తక్షణ సహాయం, సమాచారం కోసం సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలోని లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘనంగా గణేష్ ఉత్సవాలు

న్యూస్ ఆగస్టు 27 కాట్రేనికోన కమిని పంచాయతీ పొట్టితిప్ప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు గుడి అర్చక స్వామి పోతుల శ్రీను ఆధ్వర్యంలో పూజలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ గడ్డం కృష్ణమూర్తి మాట్లాడుతూ గణపతిని పూజించడం వలన విఘ్నాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అన్నారు ఈ విధంగా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులు ప్రజలందరూ ఐక్యమత్యంతో పూజలు నిర్వహించడం వలన అందరి మధ్య స్నేహభావం ఏర్పడుతుందన్నారు ఐ పోలవరం మండలం తిల్లకుప్ప అంబేద్కర్ కాలనీలో ఎస్ ఎస్ ఎఫ్ గ్రామ కన్వీనర్ తోటకూర బాబులురాజు రాచకొండ అచ్చిబాబు ల ప్రోత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు గణపతి మండపం ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించినారు. ఆలయ కన్వీనర్ సాధనాల పండు మెల్లం మురళి మోత రాజు శ్రీ జొన్నాడ దుర్గ యం. శ్రీరామ్ శంకర్ జొన్నాడ జగదీష్ గేల్లా కార్తీక్ కుమ్మరి విజయ్ మాత శంకర్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘనంగా గణేష్ ఉత్సవాలు

న్యూస్ ఆగస్టు 27 కాట్రేనికోన కమిని పంచాయతీ పొట్టితిప్ప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు గుడి అర్చక స్వామి పోతుల శ్రీను ఆధ్వర్యంలో పూజలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ గడ్డం కృష్ణమూర్తి మాట్లాడుతూ గణపతిని పూజించడం వలన విఘ్నాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అన్నారు ఈ విధంగా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులు ప్రజలందరూ ఐక్యమత్యంతో పూజలు నిర్వహించడం వలన అందరి మధ్య స్నేహభావం ఏర్పడుతుందన్నారు ఐ పోలవరం మండలం తిల్లకుప్ప అంబేద్కర్ కాలనీలో ఎస్ ఎస్ ఎఫ్ గ్రామ కన్వీనర్ తోటకూర బాబులురాజు రాచకొండ అచ్చిబాబు ల ప్రోత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు గణపతి మండపం ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించినారు. ఆలయ కన్వీనర్ సాధనాల పండు మెల్లం మురళి మోత రాజు శ్రీ జొన్నాడ దుర్గ యం. శ్రీరామ్ శంకర్ జొన్నాడ జగదీష్ గేల్లా కార్తీక్ కుమ్మరి విజయ్ మాత శంకర్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ 100% క్లియర్

న్యూస్ ఆగస్టు 27 కాట్రేనికోన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ వందశాతం పూర్తయ్యిందని కాట్రేనికోన డిసిసిబి మేనేజర్ పీతల శ్రీనివాస రావు పేర్కొన్నారు.మండల పరిధిలోని కందికుప్ప సొసైటీ కార్యాలయంలో చైర్ పర్సన్ నూకల మూర్తి అధ్యక్షతన కంప్యూటరైజషన్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి బిఎం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రాబోయే రోజులలో సొసైటీ కార్యక్రమాలు ఆన్ లైన్ లో జరుగుతాయన్నారు.సంఘం పరిధిలోని సభ్యులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్ధిక సాయం చేయాలని రైతులు కోరారు.అలాగే సొసైటీలో అందిస్తున్న పౌర సేవలను ప్రజానీకం సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.అనంతరం చైర్ పర్సన్ నూకల మూర్తి,సభ్యులు కాలాడి వీరబాబు,బొంతు శివశంకర్ ఆధ్వర్యంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావుకి సన్మానం చేసారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సూపర్ వైజర్ పేర్నీడి జయశ్రీ,రైతులు నూకల కొండలరావు,దుర్గబాబు,తాడి బాబా సురేంద్రనాథ్,పాలెపు చిన సత్యం,సత్యానందం,గుద్దటి మంగారావు,నాగళ్ళ వాసు,గోనెమడతల మహేష్,సీఈఓ యర్రంశెట్టి రామచంద్రరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ని సత్కరించిన నాయకులు

… న్యూస్ ఆగస్టు 27 కాట్రేనికోన సారథ్యం కార్యక్రమానికి కాకినాడ విచ్చేసి అన్నమ్మగాటి సెంటర్లో నాయకర్ గారి కాంస్య విగ్రహానికి గజమాల వేసి సారథ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ,,పివియన్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువా, తో బిజెపి నాయకులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు శ్రీమతి ఉమామహేశ్వరి, చెక్కా అజయ్ వర్మ సత్కరించడం జరిగింది.. అనంతరం…నాయకర్ జిల్లా సాధన సమితి తో కలిసి జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని వినతిపత్రం నాయకర్ ఇప్పుడు మీ బాబాయ్ చిత్రపటం, అందించడం జరిగింది… అనంతరం మాధవ్ మాట్లాడుతూ….మల్లాడి సత్యలింగం నాయకర్ గారు ఎంఎస్ఎన్ చారిటీస్ స్థాపించి రాష్ట్రంలో మొదటి సాంకేతిక కళాశాల పాలిటెక్నిక్ స్థాపించి అనేక మంది ఇంజినీర్స్ ని తయారు చేయడం తో పాటు అనేక కళాశాలలను ప్రారంభించడంతో పాటు విద్య వసతి భోజనం విదేశాల్లో చదువుకోవడానికి అనేకమందికి ప్రోత్సాహాన్ని అందించడం ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు ఆ స్థాయికి ఎదగడానికి ప్రోత్సాహాన్ని అందించింది కూడా వారే… అంతేకాకుండా అనేక దేవాలయాలు, వేద పాఠశాల నిర్మాణం చేసి ఆధ్యాత్మిక సామాజిక చైతన్యం కోసం యావదాస్తిని సమాజ సంక్షేమం కోసం.. ఖర్చు చేసిన మహనీయులు అందుకే వారికి గజమాలను వేసి నివాళులర్పించి సారథ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని తెలియజేశారు…. మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు వైదాడి నూకరాజు.. బిజెపి నాయకులు కొక్కిలిగడ్డ గంగరాజు మచ్చ శివప్రసాద్ కోపనాతి దత్తాత్రేయ వర్మ శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి అధ్యక్షులు పెమ్మాడి శ్రీను కోలా మీరయ్య కాలాడి శివ దున్న జాన్ కామేశ్వరరావు పాలెపు సత్తిబాబు… తదితరులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.