శ్రీకాళహస్తి, మే 13 (పున్నమి టెంపుల్ న్యూస్): అనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు బాలికలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అండగా నిలిచారు. తొట్టంబేడు మండలం సిద్ధిగుంట గ్రామానికి చెందిన రాజేశ్వరి, రమేష్ దంపతులు మృతి చెందడంతో వారి ముగ్గురు కుమార్తెలు నానమ్మ వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి చేరింది. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చిన్నారి వర్షిణిని బాలసదన్‌లో చేర్పించి, ఆమె చదువు సహా భవిష్యత్ అవసరాల బాధ్యతను స్వయంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు బాలికలు కుమారి, జ్ఞానదీప్తిల విద్యాభ్యాసానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆ కుటుంబానికి స్థిర నివాసం కల్పించేందుకు పంచాయతీ పరిధిలో రెండు ప్లాట్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ బాలికల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అనాథ బాలికలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భరోసా