Friday, 24 July 2026
  • Home  
  • సమాజ సేవే జర్నలిజం పరమావధి ​సేవా కార్యక్రమాలతో ఘనంగా టీజేఏ 12వ వార్షికోత్సవం ​విద్యార్థులకు పెన్నులు, రోగులకు పండ్ల పంపిణీ
- కామారెడ్డి

సమాజ సేవే జర్నలిజం పరమావధి ​సేవా కార్యక్రమాలతో ఘనంగా టీజేఏ 12వ వార్షికోత్సవం ​విద్యార్థులకు పెన్నులు, రోగులకు పండ్ల పంపిణీ

కామారెడ్డి, జూలై 23, (పున్నమి ప్రతినిధి) : జర్నలిజం అంటే కేవలం వార్తలు రాయడమే కాద ని, సామాజిక స్పృహతో సమాజ సేవలో భాగస్వా మ్యమవ్వడమే దాని అసలు పరమావధి అని ఎన్‌ యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ అ సోసియేషన్ (టీజేఏ) 12వ వార్షికోత్సవం సంద ర్భంగా గురువారం కామారెడ్డిలో టీజేఏ ఆధ్వ ర్యం లో పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.టీజేఏ కామారెడ్డి జిల్లా అధ్యక్షు డు సడక్ సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కేవలం కేక్ కటింగ్‌కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను చాటుతూ,పలు కార్యక్రమా లు చేపట్టడం విశేషం.ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో వేడుకల ప్రారంభంముందుగా స్థానిక ఆర్అండ్‌బీ (R&B) గెస్ట్‌హౌస్‌లో టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జర్నలి స్టులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.విద్యార్థులకు పెన్నుల పంపిణీఅనంతరం దేవున్‌పల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)ను టీజేఏ ప్రతినిధులు సందర్శించి, విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా రాజేందర్ నాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,సమాజానికి నిజాలను చేరవేయడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం,ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పో షించడమే పాత్రికేయుల ప్రధాన బాధ్యత.విద్యా ర్థులు చిన్నతనం నుంచే నిజాయితీ, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత అలవర్చుకోవాలి. మంచి పుస్త కాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీఆ తర్వాత టీజేఏ బృందం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించింది. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెబుతూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పండ్లను పంపి ణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. వార్తలను అందించడంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ టీజేఏ ఎల్లప్పుడూ ముం దుంటుందని, భవిష్యత్తులోనూ విద్యా, వైద్యం, సామాజిక రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌యూజే (ఐ) కార్యవర్గ సభ్యుడు డి. రాజలిం గం, టీజేఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల నీలకంఠం, టీజేఏ ప్రతినిధులు శ్రీధర్, సుందర్, శ్రీనివాస్ రావు, గోవర్ధన్, అమృత్ రావు, అరవింద్, మోహన్, నవీన్, మారుతి, సాయులు, రాజేందర్ రావు, ఫర్వేజ్, ఎల్లన్న, నక్క సిద్దిరాములు, వినోద్, టి. సాయులు, యాదన్న, రేణుకుమార్, టీజేఏ స భ్యులు,జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గంగా కిషన్, పాఠ శాల విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయ కులు, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రవీందర్ గౌడ్, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.