ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతి నిధి)
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఖమ్మం టూ టౌన్ పరిధిలోని ప్రతి భారతీయుడు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ విజ్ఞప్తి చేశారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. జాతీయ జెండా మన గర్వానికి ప్రతీక అని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.


