Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

టిడిపి కార్యకర్త,కప్ప శ్రీనివాసరాజు పార్థివ దేహానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్../!

ఉదయగిరి పున్నమి న్యూస్ఆ ప్రతినిధి గస్టు 24 :/// ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కప్పా శ్రీనివాసరాజు గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం స్థానిక నాయకులు తెలియపరచగా వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు కప్ప శ్రీనివాసరాజు స్వగ్రామానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి, నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల నాయకులు గ్రామ నాయకులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

స్కూటీ డిక్కీలో మద్యం బాటిల్స్ రవాణా – వ్యక్తి అరెస్ట్

విశాఖపట్నం, ఆగస్టు 25: NAD కొత్త రోడ్ ఇందిరా ప్రియదర్శిని కాలనీ వీధిలో వేకువజామున 3.30 గంటలకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 50 ఏళ్ల అల్లూరాము అనే వ్యక్తి స్కూటీ డిక్కీలో మద్యం బాటిల్స్ దాచిపెట్టి అమ్ముతున్నట్లు గుర్తించారు. అతని వద్ద 29 బాటిల్స్ స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ సీఐ జి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఖమ్మం

విద్యుత్ కొత.. ఇబ్బంది పడుతున్న ప్రజలు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి. ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్, ద్వారకా నగర్, వీడియో స్ కాలనీ లో సుమారు 2 గంటలు నుండి విద్యుత్ సరఫరా నిలిచి పోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ae వివరణ.. పున్నమి ప్రతినిధి విద్యుత్ శాఖ అధికారి ని సంప్రదించగా స్వల్ప మారమ్మత్తు ల వలన మాత్రమే ఈ రోజు ఈ కొత ఉంది అని అయన వివరణ ఇచ్చారు.

సక్సెస్ స్టోరీస్

ఒకే ఇంట్లో నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు..!

ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమనేది నేటి యువతకు ఒక కల. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెల్లు.. లేదా ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్కాతమ్ముడు.. భార్యాభర్తలు.. ఇలా ఓ కుటుంబంలో ఏకంగా ముగ్గురు.. కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన సంఘటనలు చూశాం. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపిక కావడం మాత్రం చాలా తక్కువ గానే చూసుంటాం. ఈ అసాధారణ విషయాన్ని చేసి చూపించారు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వాసులు. ఒకే కుటుంబంలో ముగ్గురు, నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం అరుదుగా జరిగే అద్భుతం. ఈ అసాధారణ విజయాన్ని సాధించి, పేదరికాన్ని చదువుతో జయించవచ్చని నిరూపించింది గౌరమ్మ కుటుంబం. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు కూతుళ్లు. పదేళ్ల క్రితం భర్త మరణించిన తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం ఆమె భుజాలపై పడింది. అయినా మొక్కవోని దీక్షతో గౌరమ్మ కూలీ పనులు చేస్తూ, తన పిల్లలను చదువులో ముందుకు నడిపించారు. పేదరికం, సామాజిక సమస్యలు ఎదురైనా కానీ వారు చదువుపై అంకితభావంతో భవిష్యత్తును కాపాడుకున్నారు. గౌరమ్మ నలుగురు కూతుళ్లు కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తల్లి కలను నిజం చేశారు.

భక్తి

వరుస పండుగలకు 22 స్పెషల్ ట్రైన్స్! అందుబాటులోకి రానున్నాయి

ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @ వరుస పండుగలు.. 22 స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. దసరా, దీపావళి, ఛట్ పండగలకు 22 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. SEP 4-25 వరకు సికింద్రాబాద్, తిరుపతి మధ్య 4, కాచిగూడ-నాగర్ సోల్ మధ్య 4 సర్వీసులు, 5-26 వరకు తిరుపతి-సికింద్రాబాద్ 4, నాగర్ సోల్-కాచిగూడ 4 సర్వీసులు నడుస్తాయన్నారు. SEP 19-OCT 3 వరకు సంత్రాగ్జి-చర్లపల్లి మధ్య 3, SEP 20-OCT 4 వరకు చర్లపల్లి-సంత్రాగ్జి మధ్య 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు…..

అన్నమయ్య

రాయచోటి: నేడు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక : చామకూరి శ్రీధర్

రాయచోటి కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా అర్జీలు సమర్పించవచ్చన్నారు. పీజీఆర్ఎస్ లో ఇచ్చిన అర్జీల వివరాలు, వాటి ప్రోగ్రస్ సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు కాల్ సెంటర్ నెంబరు 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.

అన్నమయ్య

అక్రమంగా విక్రయిస్తున్న 17 క్వార్టర్ ల మద్యం స్వాధీనం

జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మద్యం అక్రమ విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. వీరపునాయనపల్లి మండలంలోని గోనామాకులపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి వద్ద నుండి 17 క్వార్టర్ ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.ఐ మంజునాధ్ తెలిపారు. మండలంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠినచర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులకు కోటి రూపాయల బీమా.. సీఎం చంద్రబాబు చారిత్రక నిర్ణయం

మున్సిపల్ కార్మికుల కోసం కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పెద్దాపురంలో ప్రారంభం. శాశ్వత ఉద్యోగులకు కోటి రూపాయల వరకు ప్రమాద బీమా కవరేజ్. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల మందికి పైగా కార్మికులకు లబ్ధి. యాక్సిస్ బ్యాంకుతో కలిసి శాలరీ ఖాతాల ద్వారా అమలు. కార్మికుల పిల్లల చదువుకు 8 లక్షల వరకు ఆర్థిక సాయం. ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @ మున్సిపల్ కార్మికులు, వారి కుటుంబాలకు సంక్షేమం, భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల ప్రమాద, ఆరోగ్య బీమా స్కీంను లాంఛనంగా ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ-యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ స్కీంను అమలు చేసేలా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ కార్మికుల శాలరీ ప్యాకేజ్ ఖాతాలు ప్రారంభించారు. ఈ కొత్త ఆర్థిక సదుపాయం ద్వారా మున్సిపల్ కార్మికులకు గణనీయమైన భరోసా లభించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 123 అర్బన్ స్థానిక సంస్థల్లో మొత్తం 55,686 మంది కార్మికులు సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఈ స్కీం ద్వారా వీరందరికీ ఈ బీమా సదుపాయం లభించనుంది. వీరిలో 39,170 మంది పబ్లిక్ హెల్త్ విభాగంలో ఉండగా, 16,516 మంది ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో శాశ్వత, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇప్పటి వరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో కుటుంబీకులకు ఎక్స్-గ్రేషియా రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ప్రమాద మరణానికి రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చే విధానం అమలులో ఉంది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా ఈ ప్రయోజనాలు మరింత విస్తరించాయి. శాశ్వత ఉద్యోగులకు ఒక రూ. 1 కోటి వరకు ప్రమాద బీమా, పది లక్షల లైఫ్ కవర్ లభించనుంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.20 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లైఫ్ కవర్ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా ప్రమాద మరణం జరిగితే పిల్లల చదువు కోసం గరిష్ఠంగా రూ. 8 లక్షల వరకు విద్యా సహాయం అందించనుంది. దీంతో పాటు తక్కువ ప్రీమియం ద్వారా ఆరోగ్య బీమా అందుబాటులో ఉంది. కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా రూ. 33 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. ఇదే కాకుండా మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులు మరో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరిస్తే వారికి రూ. 15 లక్షల మేర ప్రమాద బీమా కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ పథకం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మున్సిపల్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం

బాలకృష్ణ కి అరుదైన అవార్డు.. ఖమ్మం బాలయ్య హర్షం.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి సినీ నటుడు హిందూ పురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ గోల్డ్ ఎడిషన్ అవార్డు ప్రకటన పట్ల ఖమ్మం జిల్లా నందమూరి అభిమాన సంఘం ఖమ్మం బాలయ్య నల్ల మల్ల రంజిత్ హర్షం ప్రకటించారు. భారత దేశం లో నే ఈ అవార్డు వచ్చిన మొదటి నటుడు బాలయ్య బాబు అని నల్లమల్ల రంజిత్ తెలియజెశారు.

భక్తి

నేటి పంచాంగం

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 జయ జయ శంకర హర హర శంకర గాయత్రీ రక్షా సర్వ జగద్రక్ష సోమవారం,25,8,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువు భాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి:విదియ ఉ11.38 వరకు వారం:సోమవారం(ఇందువాసరే) నక్షత్రం:ఉత్తర తె3.59 వరకు యోగం:సిద్ధం మ1.29 వరకు కరణం:కౌలువ ఉ11.38 వరకు తదుపరి తైతుల రా12.07 వరకు వర్జ్యం:ఉ10.12 – 11.54 దుర్ముహూర్తము:మ12.27 – 1.17 మరల మ2.57 – 3.47 అమృతకాలం:రా8.22 – 10.03 రాహుకాలం:ఉ7.30 – 9.00 యమగండ:ఉ10.30 – 12.00 సూర్యరాశి:సింహం చంద్రరాశి:సింహం సూర్యోదయం:5.48 సూర్యాస్తమయం:6.17 సర్వేజనా సుఖినోభవంతు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.