Sunday, 10 May 2026

Blog

తిరుపతి

అద్వానంగా రోడ్లు పట్టించుకోని అధికారులు

శ్రీకాళహస్తి వెంకటగిరి మార్గ మధ్యలో గ్రామానికి వెళ్లే మార్గ మధ్య తారు రోడ్డు సంగతి దేవుడెరుగు.గుంతలకు కనీసం మట్టి పోసే దిక్కు లేదా యే. ఏ.యం పుత్తూరు వయా దొమ్మరపాలెం రోడ్లు అద్వాన్నంగా మారాయని ఇంతకు మునుపు అనేక పర్యాయాలు అధికారులకు చెప్పిన పత్రికలలో ప్రచురించిన ఎవ్వరు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. రానున్నది వర్షాకాలమని ఈ మార్గంలో గుంతలు ఉన్న రోడ్లలో వర్షపు నీళ్లు నిలవడం వలన ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముఖ్యంగా రాత్రిళ్ళు గుంతలు కనిపించక ఇబ్బందిగా ఉందని రోడ్లు బాగు చేయించి మా సమస్యను పరిష్కరించాలని పాలకులను,అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

తిరుపతి

కొత్త రేషన్ కార్డుల పంపిణీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనలతో రేపు అనగా 25/8/25 సోమవారం ఉదయం 9:00 గంటలకు అక్కుర్తి గ్రామపంచాయతీ నందు నూతన రేషన్ కార్డ్ పంపిణీ జరుగును.కావున ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాలుగొని నూతన రేషన్ కార్డులు ప్రతి లభ్యదారునికి అందజేయవలసిందిగా కోరుచున్నామని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు అక్షింతలు క్రిష్ణ యాదవ్ ప్రకటన విడుదల చేసారు.

హైదరాబాద్

పార్టీ మారిన MLA లు దమ్ముంటే రాజీనామా చేయాలి. కేటీఆర్

పున్నమి ప్రతి నిధి 20 నెలల తన పాలన చూపించి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ సవాల్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్‌మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపుల్లో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు. హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కేసీఆర్ గారు మార్చారని, అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లుేశారని అన్నారు. హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ వృద్ధి అతలాకుతలం హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చివేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల బ్లాక్‌మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. పేదవాళ్ల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వర్సెస్ కాంగ్రెస్ 20 నెలల పాలన బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్‌లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా అని ప్రశ్నించారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేసిండని అడిగారు. ప్రజల కోసం కాదు, స్వార్థం కోసమే శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒక రోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని ఆయన ప్రశంసించారు.

జాతీయ అంతర్జాతీయ

భారతదేశంలో అత్యవసర సేవల హెల్ప్ లైన్ నంబర్లు

పున్నమి: భారతదేశంలో అత్యవసర సేవల హెల్ప్ లైన్ నంబర్లు 100 – పోలీస్ 112 – అత్యవసర సేవల సమగ్ర హెల్ప్లైన్ (ERSS) 101 – అగ్నిమాపక శాఖ 102 – అంబులెన్స్ సేవలు 108 – ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ 1091 – మహిళల సహాయ కేంద్రం 1098 – బాలల సహాయ హెల్ప్ లైన్ 181 – మహిళా సంక్షేమ హెల్ప్ లైన్ 1090 – సైబర్ క్రైమ్ & మహిళల భద్రత 1930 – ఆన్లైన్ ఫ్రాడ్స్ & సైబర్ నేరాల ఫిర్యాదు 1070 – రాష్ట్ర విపత్తు నియంత్రణ 1078 – రైల్వే అత్యవసర సేవలు 1077 – జిల్లా విపత్తు హెల్ప్ లైన్

భద్రాద్రి కొత్తగూడెం

బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

పున్నమి న్యూస్ (ఆగస్టు 24) కొత్తగూడెం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ నందు ఇల్లందు మండలానికి చెందిన భద్రమ్మ కుటుంబంకు బీమా చెక్కు అందజేశారు. వరస శశికాంత్ గత సంవత్సరం 25/11/2024 నాడు మూడు లక్షలతో పాలసీ తీసుకున్న 9 నెలలోనే గుండెపోటుతో మరణించడం వల్ల నామిని అయినటువంటి భద్రమ్మకి 28,22176/- (28 లక్షలు 22 వేల 176/-) చెక్కు ను 22/08/2025 నా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ముఖ్యమైనది గుర్తు చేసి ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ వెంకట చారి, బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్, డెవలప్మెంట్ ఆఫీసర్ వేణుగోపాల్, ఉమా శంకర్, రాజశేఖర్, ఏజెంట్లు, వినోద్ కుమార్, రామ్ రాజు, వీరయ్య, రగన్ బాబు, బ్రాంచ్ ఎంప్లాయిస్ నరేష్, శ్రీను, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

వినాయక చవితి, దసర నవ రాత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఈ నెల 27 న వినాయక చవితి వచ్చే నెల లో రానున్న దేవి నవరత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండపల నిర్వాహకులకి ఉచిత విద్యుత్ సౌకర్యం కలిపించాలి అని కీలక నిర్ణయం తీసుకుంది. మరో వైపు మండ పాల వద్ద ఎటువంటి అవంచనీయ సంఘటన లు జరగ కుండా చూడాలని అధికారులని ఆదేశించింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పెద్దిరాజుకు 25 ర్యాంకు కాట్రేనికోన

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీపరీక్షల్లో కాట్రేనికోన మండలానికి చెందిన కలి పెద్దిరాజు సోషల్ స్టడీస్ లో స్కూల్ అసిస్టెంట్ జిల్లా 25 ర్యాంకు సాధించారు.78.9 మార్కులు వచ్చాయి.మారుమూల ప్రాంతానికి చెందిన పెద్దిరాజు తన మామ్మ సీతమ్మ తనచదువు సాగించడానికిఆర్థిక తోడ్పాటును అందించిందన్నారు. ప్రస్తుత హోంగార్డ్ విభాగంలో పనిచేస్తున్న పెద్దిరాజుకు ఈయన బంధువు. ఒకటనుండి 5వ తరగతి వరకు గాజింగి తిప్పలో,ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు కందికుప్ప హైస్కూల్లో, ఇంటర్మీడియట్ ముమ్మిడివరంలో, బిఈడి ఎస్ కేబీఆర్ కాలేజీలో పూర్తి చేశారు. ఎంతోకాలంగా అమలాపురం ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. తన విజయం పట్ల ప్రోత్సాహం అందించిన స్నేహితులు బంధువులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

ఖాకి చొక్కా వెనుక కల్మషం లేని హృదయం…///

కలిగిరి పున్నమి న్యూస్ ప్రతినిధి నాగరాజు,ఆగష్టు 24 :// కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ఆయన సాధారణంగా కనిపిస్తాడు, నిత్యం ప్రజలతో మమేకమవుతాడు, సమస్యలను సామరస్యంగా పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. పేదలకు సమస్య అని స్టేషన్కు వచ్చిన ప్రతి ఒక్కరు ఉన్న ఆప్యాయంగా పలకరించి సమస్యను తెలుసుకొనుటలో, ఆ సమస్యను పరిష్కరించే విధానంలో ఆయన ఆయన విభిన్న శైలికి నిదర్శనం. మోములో చెరగని చిరునవ్వు, పోలీస్ అంటే జనాల్లో భయం, బిడియం లేని నిరాడంబరతను , ప్రజల్లో మమేకమవుతూ శభాష్ పోలీస్ బాస్ అనిపించుకుంటున్న మన కలిగిరి ఎస్సై ఉమాశంకర్. ఉమా శంకర్ పేరు చెప్పగానే ప్రజల్లో భయం కన్నా ఆప్యాయత ఎక్కువగా కనబడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలు మన్ననలు అందుకుంటున్న ఎస్సై ఉమాశంకర్. ఆగస్టు 15 ఉత్తమ పోలీస్ అధికారిగా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్న మన కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ను, మదర్ తెరిసా మిరాకిల్ ఫౌండేషన్ చైర్మన్ శాంసన్,ఈశ్వర్,మరియు సభ్యులు శాలువాతో సత్కరించి ఫోటో ప్రతిమను బహుకరించారు.ఈ సందర్బంగా శాంసన్ మాట్లాడుతూ మా ఫౌండేషన్ తరుపున ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసిన తప్పకుండా ఎస్సై ఉమశంకర్ రావడం మమ్మల్ని అభినందించడం జరుగుతుందన్నారు. సేవా గుణం కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడేరు. పోలీస్ అనే పదానికి కొత్త నిర్వచనం అందించిన కలిగిరి ఎస్సై ఉమశంకర్ కు మా మదర్ థెరిస్సా మీరాకీల్ ఫౌండేషన్ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అని వారు అన్నరు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో “ఉచిత వినికిడి పరీక్షల” శిబిరం. కాట్రేనికోనలో

కామేశ్వరి మెడికల్ స్టోర్స్ ప్రక్కన ఆణివిళ్ళ కృష్ణమూర్తి ప్రాంగణంలో డా.ఆణివిళ్ళ కాశ్యప్ సహకారంతో డా. వెన్నా హరీష్ పర్యవేక్షణలో ఉచిత వినికిడి పరీక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ శిబిరంలో 30 మంది వరకు వినికిడి సమస్య ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శిబిరం పుర్తయిన అనంతరం డా. ఆణివిళ్ళ కాశ్యప్ మరియు డా.వెన్నా హరీష్ ని ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి దుశ్శాలువతో ఘనంగా సత్కరించి, ప్రశంసా పత్రం, మొమెంటో అందజేసారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు చల్లా గోపీ, గ్రంథి ప్రసాద్, పెద్దింటి వ్యాసమూర్తి పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురంలో నిర్వహిస్తున్న శోభాయాత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని బిజెపికి, ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలి

:- న్యూస్ 24 తెలుగు ఆగస్టు 24 కాట్రేను కోన ఐ పోలవరం మండల పరిధిలోని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ అండ్ అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి గ్రామంలో సామాన్య ప్రజానీకంతో బిజెపి నాయకత్వాన్ని బలపరచవలసిన ఆవశ్యకత గురించి, మోడీ అందిస్తున్న అనేకనేక సంక్షేమ పథకాలు గురించి దేశం పట్ల మోడీకి ఉన్న దేశభక్తి అంకితభావం గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా నియమించబడ్డ పివిఎన్ మాధవ్ సారధ్యం పేరుతో తొలిసారిగా ఈ నెల ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు కోనసీమ జిల్లాకు విచ్చేసి అమలాపురంలో జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొని వారికి, బిజెపి పార్టీకి, ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని గ్రామస్థులను నానాజీ వెంకటరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్, విజయ్, బొమ్మల శ్రీను, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.